యోగశక్తి అంత గొప్పదా ?

Sharing is Caring...

 Sadiq Ali ……………………..

Turiya Avastha.

మన యోగులు, సాధు మహారాజ్ లు, బాబాలు గాలి లోంచి వస్తువులు సృష్టిస్తారు అంటే చాలామంది మేధావులు పెదవి విరుస్తారు. దానికి తగ్గట్టే దొంగ బాబాలు గారడీ విద్యలు ప్రదర్శిస్తూ దొరికి పోవటంతో ఆ మహత్తర విద్య కాస్తా అపహాస్యం పాలవుతోంది.

కానీ పదార్ధమంతా పరమాణు నిర్మితమేననీ, ఆ పరమాణువులను రూపాంతరం చెందించ వచ్చనీ, మన శాస్త్రాలు చెబుతున్నాయి. పరుస వేది కూడా అలాంటి ప్రక్రియే. ఒక వస్తువును మరో వస్తువుగా, ఒక ధాతువును మరో ధాతువు గా మార్చవచ్చనీ చెబుతున్నాయి. దీన్నే ఆధునిక విజ్ఞాన శాస్త్రం న్యూక్లియర్ ట్రాన్స్ మ్యుటేషన్ అని అంటోంది.

అయితే మన యోగులు దీనికన్నా మరికొన్ని అడుగులు ముందు వున్నారు. ప్రకృతి అంతా, ఆఖరికి మనచుట్టూ వున్న ప్రదేశమంతా పదార్ధం (మ్యాటర్) తో నిండి ఉందనీ, ఆ పదార్ధమంతా పరమాణు భరితమనీ ఆ శాస్త్రాలూ, ఈ శాస్త్రాలూ నిరూపించాయి.

మన యోగులు సరిగ్గా శూన్యం లోని ఈ పదార్ధాన్నే పట్టుకున్నారు. వాళ్లకు మరో వస్తువు తో గానీ, మరో ధాతువుతో కానీ పని లేదు. ఏకంగా శూన్యంలోని పదార్ధం , అందులోని పరమాణువులను తమ సాధనా శక్తితో ఒడిసి పట్టుకొని వాటిని రూపాంతరం చెందించి కోరుకున్న వస్తువును సృష్టించగలరు. అలాంటి యోగ సాధకులు గతం లోనూ వున్నారు. ఇప్పటికీ హిమాలయాల్లో వున్నారని అంటారు.

యోగుల శక్తి సామర్ద్యాలను పరీక్షించాలని  కొంతమంది న్యూరాలజిస్టులు … దిగ్గజాల్లాంటి శాస్త్రవేత్తలు భావించారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక యోగిని పిలిపించారు. అత్యాధునిక పరికరాలు తెప్పించారు.

ఆధ్యాత్మిక తేజస్సుతో వెలిగిపోతున్న ఆ భారతీయ యోగి స్వామి రామ. ఆయన రాగానే . అందరూ స్వాగతం పలికారు. స్వామికి క్లుప్తంగా విషయం చెప్పారు. అంతా విని ఆయన శవాసనంలోకి వెళ్లిపోయారు.  ప్రశాంతంగా కళ్ళుమూసుకున్నారు.

శాస్త్రవేత్తలు ఆ యోగి తల చుట్టూ మీటలు అమర్చారు. మధ్యలో మధ్యలో కొన్ని ప్రశ్నలు వేశారు. కానీ ఆయన నుండి ఎలాంటి జవాబులు లేవు. సరిగ్గా అరగంట తర్వాత యోగి కళ్ళు తెరిచారు. శాస్త్రవేత్తలు ఆయన మెదడు పనితీరును విశ్లేషించారు. అధ్యయన ఫలితాలు అందరిని ఆశ్చర్యపరిచేయి.

స్వామి రామ మెదడులోని ఒక పొర నిద్రా స్థితిలో ఉంది. అంతకంటే ఉన్నతమైన మరో పొర పూర్తి చేతనావస్థలో ఉంది. శాస్త్రజ్ఞులు ఇదెలా సాధ్యమా అని బిత్తరపోయారు. అంతలో స్వామి రామ అంతకు ముందు వారు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబులు ఇచ్చేరు.

సంభ్రమాశ్చర్యాలకు లోనైన న్యూరాలజిస్టులు . ఇతర నిపుణులు  అసలు ఇది ఎలా సాధ్యం స్వామి అని ప్రశ్నించారు. అందుకు  ఆ యోగి పుంగవుడు నవ్వుతూ  దీనినే ‘తురీయా అవస్థ’ అంటారు అని చెప్పారు. అది యోగ నిద్ర లోని అత్యున్నత స్థితి అని అక్కడ నుంచి మౌనంగా నిష్క్రమించారు.  అసలు యోగ నిద్ర అంటే ఏమిటో మరోమారు తెలుసుకుందాం.

స్వామి రామ 1925లో ఉత్తరప్రదేశ్‌లోని ఒక పండిత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. హిమాలయాల దిగువ ప్రాంతంలో నివసించే బెంగాల్‌కు చెందిన ఒక యోగి వద్ద బాల్యం నుంచిపెరిగాడు. తన యవ్వనంలో హిమాలయాల సాంప్రదాయ మఠాలలో యోగా శాస్త్రం తత్వశాస్త్రం అభ్యసించాడు.

ఆయన 1969లో అమెరికా వెళ్ళి, మొదట YMCAలలో యోగాను బోధించడం ప్రారంభించారు. 1971లో అమెరికాలో హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా సైన్స్ అండ్ ఫిలాసఫీని స్థాపించారు. ప్రముఖ యోగా గురువుగా, తత్త్వవేత్తగా ప్రసిద్ధి గాంచారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!