సముద్ర గర్భంలో వేట..ఈ తెగ ప్రత్యేకత !

Sharing is Caring...

A powerful tribe…………………………………………………

ఈ ఫొటోలో కనిపించే వ్యక్తులు బజౌ తెగ కు చెందిన వారు. వీరికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. సముద్రానికి 200 అడుగుల లోతులో ఈ మనుషులు సంచరిస్తుంటారు. అక్కడ ఆహరం సేకరించుకుని సముద్ర ఉపరితలంపై నివసిస్తుంటారు.

ఫిలిఫ్ఫీన్స్ సముద్ర ప్రాంతాలలో ఈ బజౌ తెగ వారు ఎక్కువగా ఉంటారు. ఈ తెగవారు సముద్ర గర్భంలోకి వెళ్లి ఆహారం కోసం వేట సాగిస్తారు.. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ వేటకు వెళుతుంటారు. వీరికి సముద్రం … వేట తప్ప మరో ప్రపంచం తెలీదు. ఇతర సదుపాయాలు అందుబాటులో కూడా లేవు. సమీప గ్రామాలకు వెళ్లి అవసరమైన వస్తువులు తెచ్చుకుంటారు.  

ఈ తెగలో పిల్లలు పుట్టి నడక నేర్చిన నాటి నుండి వీరికి ఇదే జీవితమట. ఈ ప్రాంత ప్రజలు భూమి మీద నివసించడానికి వీలులేకుండా నిషేధానికి గురయ్యారని అంటారు. ఆ కారణంగా వీరి జీవితం మొత్తం సముద్రం నీటి మీదనే గడుస్తోంది. కొందరు నీటి ఉపరితలం మీద కర్రల సహాయంతో తేలుతున్న ఇళ్ళను నిర్మించుకుంటే మరికొందరు పడవల్లో నివసిస్తూ జీవితం సాగిస్తున్నారు.

వీళ్లు నీటిలో ప్రతి దాన్ని ఎంతో స్పష్టంగా చూడగలుగుతారు. వీళ్ల కంటిచూపు సామర్థ్యం చాలా ఎక్కువగా ఉందని.. సాధారణ వ్యక్తులతో పోలిస్తే వీరిలో ప్లీహ సామర్థ్యం కూడా ఎక్కువగా ఉందని ఈ తెగ ప్రజల గురించి పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పలు దేశాలకు చెందిన మత్స్యకారులు సముద్రాలలో చేపలు పట్టడానికి వినూత్న పద్ధతులు ఉపయోగిస్తున్న కారణంగా వీరికి ఆహార కొరత ఏర్పడింది . దీంతో ఈతెగ మనుగడకు ప్రమాదం ఏర్పడింది. వీళ్లు నీటిలో ఆహారం కోసం వేటాడుతున్నప్పుడు శరీరంలో ఒత్తిడి పెరిగి రక్తప్రసరణలో మార్పులు చోటు చేసుకుంటాయి.

ఈ మార్పు వల్ల వీళ్ల శరీరంలో రోగనిరోధక శక్తి కూడా సమర్థవంతంగా తయారవుతోందని చెబుతున్నారు. వీళ్లకంటూ సొంతదేశం కానీ, సొంత ప్రాంతం కానీ ఏదీ లేదు. సముద్ర నీటి ఉపరితలం మీద జీవించడం, సముద్రంలో వేటసాగించి ఆహారాన్ని సంపాదించుకోవడమే వారికి తెలిసిన పని.

ఈ జాతి పిల్లలు చాలా వరకు చిన్నప్పటి నుండే నీటితో కలసి పెరుగుతారు. వీరు ఏ జలచరాన్ని చూసినా భయపడరు. సముద్రపు నీళ్లలో వీళ్ళు షార్క్ చేపలు ఈదినట్టే వేగంగా ఈదుతారు. సాధారణ ప్రజలకంటే.. ఈ తెగ ప్రజలకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందట.

మరొక ముఖ్యవిషయం ఏమిటంటే.. ఈ బజౌ జాతి ప్రజలలో ప్లీహము 50శాతం పెద్దగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీళ్ళనే సీ నోమాడ్స్ అని కూడా పిలుస్తారు. కనీసం 1,000 సంవత్సరాలుగా ఆగ్నేయాసియా సముద్రాలలో వీరు తిరుగుతున్నారు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!