పంజాబ్ లో హంగ్ తప్పదా ?

Sharing is Caring...

పంజాబ్‌లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అతి పెద్ద పార్టీగా అవతరించే సూచనలు కనబడుతున్నాయని వివిధ సర్వే లు చెబుతున్నాయి. ద్వితీయ స్థానంలో కాంగ్రెస్ నిలిచే అవకాశాలున్నాయని సర్వేలు సూచిస్తున్నాయి. ఏపార్టీ కూడా పూర్తి స్థాయి మెజారిటీ సాధించే సూచనలు లేని కారణంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడ వచ్చని ఇప్పటి వరకు వచ్చిన ఒపీనియన్ పోల్ సర్వేల సారాంశం. 

జీ న్యూస్ ప్రీ-పోల్ సర్వే ప్రకారం, ఆప్ 36-39 సీట్లు .. కాంగ్రెస్ 35-38 సీట్లు గెలుచుకుంటాయని అంచనా. రెండు పార్టీల కొచ్చే సీట్ల మధ్య పెద్ద తేడా లేదు. దీన్ని ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలున్నాయని చెప్పుకోవచ్చు. ఇక రిపబ్లిక్ టీవీ..  పి. మార్క్ ఒపీనియన్ పోల్ ప్రకారం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోరు జరగవచ్చు. ఆప్ 49-55 సీట్లు కాంగ్రెస్ 43-49 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా.ఈ పరిణామాలు  హంగ్ అసెంబ్లీకి దారితీయవచ్చని సర్వే చెబుతోంది.

శిరోమణి అకాలీదళ్ 15-21 సీట్లు, BJP + 1-3 సీట్లు,ఇతరులు 1-3 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా. పంజాబ్ లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాగా అధికారం చేపట్టడానికి కనీసం 59 సీట్లు అవసరం. ఆప్ లేదా కాంగ్రెస్ కి 50 సీట్ల వరకు వస్తే మరో పార్టీ తో లేదా స్వతంత్ర అభ్యర్థులతో కలసి సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేయవచ్చు. అలా కాకుండా 60 పైన ఏ పార్టీ కొచ్చినా సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ ఛాన్స్ ఆప్ కి లభిస్తుందా ? కాంగ్రెస్ కి దక్కుతుందా అనేది  తేలాలంటే ఫలితాలు రావాల్సిందే.

2017 నాటి  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్  77 స్థానాలను గెలుచుకుంది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అప్పట్లో 20 సీట్లు గెలుచుకుని  ప్రతిపక్షంగా రెండవ స్థానంలో నిలిచింది, శిరోమణి అకాలీదళ్, బీజేపీ కూటమి 18 స్థానాలను మాత్రమే గెలిచాయి. రైతు ఉద్యమ ప్రభావం బీజేపీ కూటమి కి కొంత మైనస్ కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 20న ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. మార్చి 10 న ఫలితాలు వస్తాయి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!