ఒక చోట హిజాబ్ ధరించకపోతే ..ఇంకో చోట ధరిస్తే శిక్షలు !!

Sharing is Caring...

 Different ways…………………..

ఇస్లాం సంప్రదాయం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్‌ (ముఖ ఆచ్ఛాదన) ధరించేందుకు విముఖత వ్యక్తం చేసే మహిళలకు, ఇందుకు మద్దతు తెలిపేవారికి భారీ శిక్షలు విధించేలా ఇరాన్‌ పార్లమెంటు బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశముంది.

హిజాబ్‌ ధరించని మహిళలకు సేవలందించే వ్యాపారులకు సైతం ఈ చట్టం వర్తిస్తుంది. గతేడాది హిజాబ్‌ వివాదం కారణంగా పోలీస్‌ కస్టడీలో మృతిచెందిన మహసా అమిని (22) ఘటనకు సరిగ్గా ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఇరాన్‌ ఈ బిల్లును తీసుకు వచ్చింది.ఈ బిల్లు రాజ్యాంగ పరిరక్షకులుగా పనిచేసే గార్డియన్‌ కౌన్సిల్‌ అంగీకారం పొందాల్సి ఉంది. ఈ అంగీకారం కూడా పొందాక బిల్లు అమలులోకి వస్తుంది.

కాగా బుర్ఖా వేసుకుంటే ఫైన్ విధించాలని స్విట్జర్లాండ్ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు దిగువ సభ నేషనల్ కౌన్సిల్ బుర్ఖాలను నిషేధించే బిల్లుకు ఆమోదం తెలిపింది.బుర్ఖా కానీ, మరో వస్త్రంతో కానీ ముఖాన్ని కప్పివేయడం ఇక మీదట స్విట్జర్లాండ్ లో నేరంగా పరిగణించనున్నారు. 151 – 29 ఓట్ల తేడాతో నేషనల్ కౌన్సిల్ ఈ బిల్లుకు తుది ఆమోదం ప్రకటించింది.

ఇప్పటికే ఈ బిల్లుకు ఎగువ సభ కూడా ఆమోదం తెలపడంతో ఇక చట్ట రూపం దాల్చినట్టే.   స్విస్ పీపుల్స్ పార్టీ ఈ బిల్లును ప్రతిపాదించింది. నిజానికి రెండేళ్ల క్రితమే స్విట్జర్లాండ్ వ్యాప్తంగా దీనిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. నిఖాబ్ ధారణకు వ్యతిరేకంగా మెజారిటీ ప్రజలు ఓటు వేశారు. ఇక ఇది చట్ట రూపం దాల్చినందున దీన్ని ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించనున్నారు.

చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా బుర్ఖా ధరిస్తే 1,000 స్విస్ ఫ్రాంక్ లను జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే 91,300 రూపాయలు అన్నమాట. బహిరంగ ప్రదేశాలతోపాటు, ప్రజలు వినియోగించుకునే ప్రైవేటు ప్రదేశాల్లోనూ ముక్కు, నోరు, కళ్లను కప్పి వేయకూడదని కొత్త చట్టం చెబుతోంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!