చైనా లో ఆకస్మిక వరదలు!

Sharing is Caring...

Floods ……………………………………………..

ఇండియాలో క్లౌడ్ బరస్ట్ కి చైనా కారణమని అనుమానిస్తున్న నేపథ్యంలో …… రెండురోజుల క్రితం నైరుతి, వాయవ్య చైనాలోని పలు ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. కుండపోతగా కురిసిన వర్షం కారణంగా వరదలు వచ్చాయి.ఈ వరదల కారణంగా సిచువాన్‌ రాష్ట్రంలో ఆరుగురు మరణించారు. మరో 12 మంది వ్యక్తులు గల్లంతయ్యారు. రెండు రోజుల క్రితం నాటికీ ఈ ప్రాంతంలో 1300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చైనా అధికారిక మీడియా చెబుతోంది.

వాయువ్య గన్సు రాష్ట్రంలోని లాంగ్నాన్ నగరంలోనూ వరదల వల్ల ఆరుగురు చనిపోయారని సమాచారం. ఆ ప్రాంతంలో 3000 మందిని ప్రత్యేక శిబిరాలకు తరలించారు.ఒకట్రెండు రోజుల్లోనే వర్షపాతం 98.9 మిల్లీమీటర్లకు చేరింది.. జులై సగటుతో పోల్చితే ఇది దాదాపు రెట్టింపు అని అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే చైనాలోని తూర్పు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుంటే నైరుతి, వాయువ్య ప్రాంతాల్లో మాత్రం కుండపోత వర్షాలు కురిసి వరదలు నగరాలను ముంచెత్తుతూ ప్రజలను హడలెత్తిస్తున్నాయి.  తూర్పు జెజియాంగ్ రాష్ట్రం, షాంఘై నగరాల్లో మాత్రం గతవారం ఉష్ణోగ్రతలు 42 డిగ్రీ ల వద్ద నమోదయయ్యాయి.

వాతావరణ మార్పుల కారణంగా ప్రకృతి విపత్తులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వేడి గాలులు ఎక్కువ నీటిని నిల్వ చేసుకుంటాయని, ఆ నీరు ఒక్కసారిగా విడుదలైనప్పుడు క్లౌడ్ బరస్ట్‌లు సంభవిస్తాయని … . ఫలితంగా ఆకస్మిక వరదలు వస్తాయని అంటున్నారు. 

వర్షాలను ఆపగల టెక్నాలజీ తెలిసినప్పటికీ చైనా ఎందుకు కుండపోత వర్షాలను నిలువరించ లేకపోయిందో తెలీదు. తమ దేశంలో వర్షాలకు ఫలానా వాళ్ళు కారణమని అక్కడ ఎవరూ మాట్లాడలేదు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!