ఈ ‘ఉచ్చి పిల్లయార్ కోయిల్’ గురించి విన్నారా ?

Sharing is Caring...

Susri Ram………………………………………………………

విభీషణుడు లంకని పరిపాలించిన రావణుని సోదరుడు.రాముని బార్య ని అపహరించిన రావణుడిని సుగ్రీవ, హనుమాన్ ల సాయం తో జయించి సీత ని తిరిగి చేరుకుంటాడు రాముడు.‘విభీషణుని’ సాయం లేకుండా ఆ విజయం సాధ్యపడలేదు. రాముడు ‘విభీషణుడి’ కి ప్రేమతో విష్ణు స్వరూపమయిన ‘రంగనాధ స్వామి’ ప్రతిమ ని బహూకరిస్తాడు. (శ్రీరంగం లో కొలువైన రంగ నాధ స్వామి)

విభీషణుడు తిరుచ్చి వద్ద కోనేరు లో సంధ్యా వందనం చేసుకునే టప్పుడు ఆ విగ్రహాన్ని అక్కడే ఉన్న బాలుడు ఒకరు కావేరీ నది ఇసుకలో దాచేస్తాడు. విభీషణుడు ఆ పిల్లాడి పని గమనించి వెంటాడతాడు.దగ్గరలో ఉన్న కొండ మీద (రాక్ ఫోర్ట్) కి చేరిన పిల్లాడిని ఒక్క దెబ్బ వేస్తాడు. ఆ పిల్లాడే వినాయకుడిగా మారి ఆ రాతి మీద స్థిరపడతాడు.ఇప్పటికీ వినాయకుని నుదిటిన ఆ గుర్తు కనిపిస్తుంది. ఇది ఇతి హాసం.

తమిళనాడు దేవాలయాలకు ప్రసిద్ధి.  చారిత్రాత్మక నిర్మాణాలు ఇక్కడ అనేకం.  శ్రీరంగం, తంజావూరు, మధురై, అరుణాచలం, కుంభకోణం, రామేశ్వరం లాంటి దేవాలయాలతో పాటు తిరుచ్చి లోని ఉచ్చి పిల్లయార్  కోయిల్ కూడా ఒక గొప్ప చరిత్రాత్మక కట్టడం. 83 మీటర్ల ఎత్తైన కొండ మీద ఈ దేవాలయం కొలువై ఉంది. కొండ శిఖరం మీద కొలువైన దేవాలయం కి రాళ్ళ మద్య చెక్కిన విశాలమయిన మెట్ల బాట ఉంది.  ఆ బాట మలుపులు తిరుగుతూ సాగుతుంది.  ప్రతి మలుపులో స్టోన్ కార్వింగ్ తో ఉన్న విశాలమైన ఉప దేవాలయాలున్నాయి. అద్భుతమైన నిర్మాణాలివి.ఈ ఉచ్చి పిల్లయార్ కోయిల్ ( 10.8285°N 78.6974°E) నన్ను బాగా ఆకర్షించిన వినాయక దేవాలయం.
..
ఇక్కడి నిర్మాణాలన్నీ పల్లవుల పనితనాన్ని ప్రతిబింబిస్తాయి.ఈ ఆలయానికి కొండ రాతిని చెక్కి మెట్ల దారి ఏర్పాటుచేసారు.
మధ్య మధ్య లో అనేక దేవేరుల విశాలమయిన దేవాలయాలు ఆకట్టుకునే విధంగా నిర్మితమైనాయి. దారి పొడుగునా త్రిచి నగరాన్ని, దూరం నుండి శ్రీరంగం గోపురాలను ,చుట్టూ వడ్డాణం లా ప్రవహించే కావేరి ని చూడటానికి అనుకూలంగా ఉంటుంది.
పల్లవులు (మహాదేవ వర్మ 6 శతాబ్ది) మొదలెట్టిన ఈ కార్యాన్ని, మధురై నాయకులు (1529-1736) మదురై రాజధానిగా పరిపాలించిన వారు పూర్తి చేశారు.
..
293 అడుగుల ఎత్తైన ఈ రాతి మీద ప్రధానంగా రెండు దేవాలయాలు ఉన్నాయి. ఒకటి వినాయకునిది రెండవది శివుని దేవాలయం. తండ్రి దేవాలయం పై భాగాన కుమారుని దేవాలయం ఉండటం ఇక్కడ మన గమనించదగ్గ ప్రత్యేక అంశం…
బీజాపూర్, మరాటా, మదురై నాయకుల కాలం లో అనేక యుద్దాలకి ఈ దేవాలయం నిలువెత్తు సాక్ష్యం. 7 వ శతాబ్దపు ఈ హిందూ దేవాలయం గురించి ఎంత చెప్పినా తక్కువే.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!