పాక్ ఆర్మీని బెంబేలెత్తించిన గూర్ఖా సైనికులు!!

Sharing is Caring...

సుదర్శన్ టి ……………………..

సైన్యం ఎంత పెద్దదైనా శత్రువుతో సూటిగా ముఖాముఖి తలపడేది (infantry) పదాతి దళం సైనికులే. వీరికి వివిధ పరిస్థితులలో పోరాడే విధంగా శిక్షణ ఇస్తారు  ఈ పదాతి దళం బెటాలియన్లలో గూర్ఖా సైనికులకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

1971 యుద్ధంలో జరిగిన ఘటన ఇది…కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ అరుణ్ హరోలీకర్ ఆధ్వర్యంలో గూర్ఖా సైనికులు Atgram, Ghazipur యుద్ధాల్లో పోరాడి వీరోచితంగా తిరిగి వచ్చారు. Atgram లో పాకిస్థాన్ B కంపెనీ సైనికులను మన గూర్ఖా సైనికులు ఊచ*కోత కోసారు.

ఘాజీపూర్ లో 22-Baloch సైనికుల మీద విరుచుకుపడ్డారు. మన గూర్ఖా సైనికుల ఉగ్ర ప్రతాపం ఏ లెవల్లో ఉందంటే వీళ్ళు మామూలు సైనికుల్లా తుపాకులతో కాల్చడం లేదు..తమ ఆయుధం కుక్రీని విచ్చలవిడిగా ప్రయోగించారు.పాకిస్థాన్ సైనికుల తలలు యథేచ్ఛగా నరి*కారు.

మొండేలు, అవయవాలు అంతటా కుప్పలు కుప్పలుగా పడున్నాయి. ఏ అవయవం ఎవరిదో కూడా గుర్తుపట్టడం సాధ్యం కానంతగా మారణ*హోమం సృష్టించారు. ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోగలిగిన పాకిస్థాన్ సైనికులు గూర్ఖా సైనికుల క్రూరత్వాన్ని అన్ని యూనిట్ల సైనికులకు చేరవేశారు.

ఇప్పుడు అందరి మనసుల్లో ప్రార్థన ఒకటే… పొరపాటున కూడా గూర్ఖా సైనికులకు ఎదురుపడకూడదు.కానీ ఈ విజయాలకు మన 4th బెటాలియన్ చాలా పెద్ద ప్రతిఫలమే చెల్లించాల్సి వచ్చింది.

డిప్యూటీ కమాండంట్, మరో ఇద్దరు ఆఫీసర్లు ప్రాణాలు కోల్పోయారు.  ఇంకో నలుగురు ఆఫీసర్లు తీవ్రంగా గాయపడ్డారు. 18 మంది ఆఫీసర్లతో యుద్ధంలోకి దిగిన బెటాలియన్లో ఇప్పుడు కేవలం 11 మంది ఆఫీసర్లు ఉన్నారు. 

ఓ JCO మరో 19 మంది సైనికులను కూడా ప్రాణాలు కోల్పోయారు. యూనిట్ కు విశ్రాంతి అవసరం. యూనిట్ ను పునర్నిర్మించాలి. ఎవ్వరికీ వేసుకోడానికి ఉతికిన బట్టలు కూడా లేవు. వీళ్ళ అభ్యర్థన మేరకు అతి కష్టం మీద 48 గంటల విశ్రాంతికి అనుమతి దొరికింది. సైనికులు బట్టలు ఉతికి ఆరేసుకున్నారు. జస్ట్ ఒక టీ తాగారు.

అంతలో బ్రిగేడ్ కమాండర్ Bunty Quinn స్వయంగా వచ్చారు. అంత పెద్ద ఆఫీసర్ రావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. యూనిట్ మరో ముఖ్యమైన ఆపరేషన్ లో పాల్గొనాలని మరో 30 నిముషాల్లో బయలుదేరాలని చెప్పారు. కల్నల్ అరుణ్ ఏదో చెప్పబోయారు. Quinn సైగ చేశారు.

మీ పరిస్థితి ఏమిటో నేను హెడ్ క్వార్టర్స్ కు చెప్పలేదు అనుకొంటున్నారా, కానీ వేరే దారి లేదు. ఇప్పుడు మీరు చేయబోయే ఆపరేషన్ ..వేరే ఎవ్వరికీ సాధ్యం కాదు. పైగా అది ఈ యుద్ధం గెలవడానికి చాలా ముఖ్యమైనది. కాబట్టి ఉన్న పళంగా బయలుదేరండి అని ఆర్డర్స్ ఇచ్చి వెళ్ళిపోయారు.

ఆర్మీ లో  orders are orders. వ్యక్తి కంటే యూనిట్ గొప్పది, యూనిట్ కంటే దేశం గొప్పది.
మరో 48 గంటల్లో బెటాలియన్ Kaloura చేరుకుంది. మొదట విమానాల ద్వారా కలకత్తా వరకు వచ్చి ,ఆ తర్వాత రైలు ద్వారా కలౌర చేరుకున్నారు.

Kaloura బంగ్లాదేశ్ బోర్డర్. అక్కడి నుండి పాకిస్థాన్ సైన్యం అధీనంలో ఉండడం వల్ల ముందుకు పోవడం కుదరదు కానీ వారిని దాటుకుని వెళ్లి Sylhet ను తమ అధీనంలోకి తీసుకోవాలని బెటాలియన్ కు ఆదేశాలు అందాయి.భారత చరిత్రలో మొదటిసారి హెలికాప్టర్ ద్వారా సైనికులను శత్రుదేశంలోకి దింపబోతున్నారు.

ఢాకాలో తిష్ట వేసిన జనరల్ నియాజీ ఢాకా చుట్టూ సైనిక సమూహంతో శత్రు దుర్భేద్యమైన కోట నిర్మించుకుని కూచున్నాడు. భారత సైన్యం వచ్చినా ఈ సైనిక సమూహాలను దాటి రావడానికి కుదరని విధంగా ఆర్మీ ఫార్మేషన్ ఏర్పాటు చేసుకున్నాడు. అందులో భాగమే Sylhet ప్రాంతం.

ఇంత వరకూ పాకిస్థాన్ 202 పదాతి దళం బ్రిగేడ్ తమ 3000 వేల మంది సైనికులు వాటి అనుబంధ ఆయుధ, మందు గుండు వ్యవస్థ తో ఈ Sylhet ను రక్షిస్తూ వచ్చింది.  ఇప్పుడు ఈ యూనిట్ డాఖా కు తరలి వెళ్లిందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఈ Sylhet ని ఓ 200 మంది రజాకార్లు కాపలా కాస్తున్నారు అనేది సమాచారం. కానీ ఈ వార్త నిజమో కాదో తెలీదు.

ఒకవేళ మన బెటాలియన్ అక్కడ దిగితే, అక్కడ 202 యూనిట్ ఉంటే, పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తారు ..అయినా రిస్క్ తీసుకోవడమే ..యుద్ధంలో ప్రధాన ఆయుధం. పైగా మనవద్ద attack helicopter లు లేవు. ఉన్నవి అల్యూమినియం బాడీతో చేసిన ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్లు మాత్రమే.

చిన్న పిస్టల్ తో కాల్చినా తూట్లు పడి బుల్లెట్లు లోపల ఉన్న సైనికుల సీట్లలో దిగబడుతుంది. మీ ఆర్మీ కిట్ సీట్ మీద పెట్టి వాటి మీద కూర్చోండి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి అని పైలట్ చెప్పాడు. 7 Mi-4 హెలికాప్టర్ లలో మొదటి విడత సైనికులను Sylhet కు తరలించారు.

అనుకున్నట్టే హెలికాప్టర్లు గాల్లో వుండగానే కింద నుండి కాల్పులు మొదలయ్యాయి. హెలికాప్టర్లు తూట్లు పడ్డాయి. ఒక ఆఫీసర్ తీవ్రంగా గాయపడ్డారు. ల్యాండ్ అవకుండానే నేల మీదకు దూకాలని ఆదేశాలు అందాయి. సైనికులు భూమ్మీదకు దూకి అక్కడి సైనికుల మీద కాల్పులు జరిపారు.

అదృష్టవశాత్తు బుల్లెట్లు ఇందన ట్యాంకులో దిగలేదు. గాయపడిన మేజర్ కరణ్ పురిని వెనక్కు తీసుకెళ్లారు. (రెండు రోజుల తర్వాత అయన గౌహతి మిలటరీ హాస్పిటల్లో ప్రాణాలు విడిచారు).హెలికాప్టర్ నుండి భూమ్మీదకు దూకగానే కీచు గొంతులతో అయ్యో ఘోరకలి అని అరుస్తూ పాకిస్థాన్ సైనికుల మీదకు దాడికి దిగారు.

ఆ గొంతు ఆ వార్  క్రై  వినగానే వచ్చింది ..ఎవరో పాకిస్థాన్ సైనికులకు అర్థం అయిపోయింది. చెల్లాచెదురై నలుదిక్కులా పారిపోయారు. ఆ తర్వాత దూరం నుండి కాల్పులు జరుపుతున్నారే కానీ ఎవ్వరూ దగ్గరకు రావడం లేదు.ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం తప్పు అని తేలింది.  అక్కడ 202 యూనిట్ బయటకు పోలేదు. పోయే ఉద్దేశ్యం కూడా లేదు.

గూర్ఖా బ్రిగేడ్ మొత్తం వచ్చింది అనుకుని sylhet సరిహద్దుకు పారిపోయారు. మరో 12 గంటల్లో మొత్తం 384 మంది గూర్ఖా బెటాలియన్ సైనికులు Sylhet ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. (బెటాలియన్ అంటే దాదాపు 400 మంది, బ్రిగేడ్ 3000 మంది) కానీ ఒక అపశృతి దొర్లింది. వీరి వద్ద పెద్దగా మందుగుండు సామగ్రి లేదు.

రావలసిన సప్లై రాలేదు. 48 గంటల్లో వేరే యూనిట్ల సైనికులు జాయిన్ అవుతారు అని బ్రిగేడ్ కమాండర్ చెప్పారు కానీ 72 గంటలు గడిచింది మన వాళ్ళ జాడ లేదు. అదే సమయంలో ఒక పూర్తి బ్రిగేడ్ అంటే 3000 వేల మంది పాకిస్థాన్ సైనికులు Sylhet ను చుట్టుముట్టారు. 

అంటే మన ప్రతి ఒక సైనికుడికి వాళ్లు 10 మంది ఉన్నారు. కల్నల్ హరోలేకర్ కు ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడే కొందరు గూర్ఖాలు బండరాళ్ల మీద తమ కుక్రీ పదును పెట్టడం చూసారు.

ఎందుకు అని అడిగితే సాబ్ జీ హమారా బందూక్ నహీ హోతో క్యా హువా, కుక్రీ హైనా చీర్ కే రఖ్-దేంగే…. ఈ ప్రపంచంలో ఎవరైనా ప్రాణ భయం లేదు అన్నాడంటే వాడు అబద్దం చెబుతున్నాడు లేదా వాడు గూర్ఖా సైనికుడు అయ్యుంటాడు అని మరోసారి రుజువు అయ్యింది.

సాబ్ ఇక్కడ ఉన్నది 380 మంది అని మీకు మాకు తెలుసు పాకిస్థాన్ వాళ్లకు తెలీదు కదా. మనం 380 మంది 3000 మందిలా ప్రవర్తిద్దాం అన్నారు. యుద్ధంలో సైనికులు విడిపోకూడదు, ఒకే యూనిట్ లాగా ఉండాలి.. కానీ ఇప్పుడు వీళ్లు ఇద్దరిద్దరు సైనికుల జట్టుగా విడిపోయి మొత్తం Sylhet ప్రాంతంలో spread అయ్యారు. ఓ పద్దతి ప్రకారం strategic firing చేస్తున్నారు. మరో 48 గంటలు గడిచింది.

తెచ్చుకున్న ఆహారం కూడా నిండుకుంది. మంచినీళ్లు లేవు. బురద గుంటల్లోని నీళ్ళు కర్చీఫ్ తో వడగట్టి తాగుతున్నారు. కానీ అటువైపు ఇంకో బ్రిగేడ్ సైనికులు చేరారు అంటే ఈ 380 మందికి వాళ్లు 6000 మంది. వారిలో ఇద్దరు బ్రిగేడియర్లు 10 మంది కల్నల్ ర్యాంక్ ఆఫీసర్లు మరో 20 మంది ఇతర ర్యాంక్ ఆఫీసర్లు ఓ 5900 మంది సైనికులు వాళ్ళ మందుగుండు సామగ్రి వ్యవస్థలు.

ఇపుడు ఒకరికి 20 మంది. వాళ్ళ నుండి భారీగా ఫైరింగ్ జరుగుతోంది. గూర్ఖా సైనికులు దైర్యంగా నిలబడ్డారు, దాడులు చేస్తున్నారు. మరో 24 గంటలు గడిచింది. పాకిస్థాన్ సైనికులకు ధైర్యం చాలడం లేదు.15 డిసెంబర్, 1971 పొద్దున 9 గంటలకు ఇద్దరు పాకిస్థాన్ ఆఫీసర్లు తెల్ల జెండాలు పట్టుకుని గూర్ఖా సైనికుల స్థావరం వద్దకు వచ్చారు, ‘లొంగిపోతాం’ అని బ్రిగేడ్ కమాండర్ పంపిన లెటర్ తీసుకు వచ్చారు.

మీరు వెళ్లి మీ బ్రిగేడ్ కమాండర్నే పంపండి. ఎలా సరెండర్ అవ్వాలో చర్చిద్దాం అని వాళ్ళను వెనక్కు పంపి ఇండియన్ బ్రిగేడ్ కమాండర్ Bunty Quinn కు మెసేజ్ పంపారు. మధ్యాహ్నం 3 గంటలకు Bunty Quinn హెలికాప్టర్ లో వచ్చారు. పాకిస్థాన్ సైనికుల రెండు బ్రిగేడ్లు సరెండర్ అయ్యారు.

ఎన్నో రోజుల తర్వాత కానీ పాకిస్థానీయులకు తెలీదు ఆ 6000 మందిని 8 రోజుల పాటు నిలదీసింది కేవలం 384 మంది భారత సైనికులని.అందుకే అంటారు it is not the weapon but the person behind the weapon decides the outcome అని…

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!