Good chance…………………………..
సావరిన్ గోల్డ్ బాండ్ల అమ్మకాలు ఈ నెల 20 నుంచి మొదలు కానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బాండ్ల ను 2022-23 సం.. కి గాను మొదటి విడతగా జారీ చేస్తున్నది. ఐదు రోజుల పాటు ఈ బాండ్లు అమ్మకాలు కొనసాగుతాయి. రెండో విడత 2022 – 23 సిరీస్ II బాండ్లు ఆగస్టు 22 నుంచి 26 తేదీల్లో సబ్ స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటాయి.
సావరిన్ గోల్డ్ బాండ్ల సబ్ స్క్రిప్షన్ జూన్ 20 తేదీన ఆరంభమై జూన్ 24న ముగుస్తుంది. జూన్ 28న బాండ్లను ఆర్ బీఐ ఇన్వెస్టర్లకు జారీ చేస్తుంది. సావరిన్ గోల్డ్ బాండ్లను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, స్టాక్ హెల్డింగ్ కార్పొరేషన్, క్లియరింగ్ కార్పొరేషన్ ఎంపిక చేసిన పోస్టాఫీసులు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ , బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ వంటి గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా విక్రయిస్తారు.
2022-23 సిరీస్ II సబ్ స్క్రిప్షన్ ను ఆగస్టు 22 నుంచి 26 వరకు విక్రయిస్తారు.బాండ్లు ఆగస్టు 30న జారీ అవుతాయి. సావరిన్ గోల్డ్ బాండ్లను భారత ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. ఈ బాండ్లను ఎవరెవరికి విక్రయించాలనే విషయంతోపాటు పెట్టుబడి పరిమితిని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
భారత పౌరులు, అవిభాజ్య హిందూ కుటుంబాలు (HUF), ట్రస్టు, యూనివర్సిటీలు, స్వచ్ఛంద సంస్థలకు ఈ బాండ్లను ప్రభుత్వం విక్రయిస్తుంది. ఇన్వెస్టర్లు ఒక గ్రాము బంగారం నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం కనీస పెట్టుబడి ఒక గ్రాము బంగారం కాగా గరిష్ట పరిమితిని ఒక వ్యక్తికి 4 కేజీలు, హెచ్ యూఎఫ్ (Hindu Undivided Family- HUF)లకు 4 కేజీలు, ఆర్థిక సంవత్సరంలో ట్రస్టు, అలాంటి మరిన్ని సంస్థలకు 20 కిలోలుగా నిర్ణయించింది.
జాయింట్ హెల్డింగ్ దరఖాస్తుదారుల విషయానికి వస్తే.. 4 కేజీల ఇన్వెస్ట్మెంట్ లిమిట్ మొదటి దరఖాస్తుదారుకు మాత్రమే వర్తిస్తుంది. వీటి మెచ్యూరిటీ పీరియడ్ 8 సంవత్సరాలు.పెట్టుబడిదారులు ఐదేళ్ల తర్వాత పథకం నుంచి బయటికి రావచ్చు.
సావరిన్ గోల్డ్ బాండ్ల ధర విషయానికి వస్తే.. సబ్ స్క్రిప్షన్ వ్యవధికి ముందు వారంలోని చివరి మూడు వర్కింగ్ డేస్ లో ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) పబ్లిష్ చేసిన 999 ప్యూర్ గోల్డ్ సగటు క్లోజింగ్ ప్రెస్ ఆధారంగా ధర నిర్ణయిస్తారు. ఈ బాండ్ల ధర ఇండియన్ రుపీస్ లో ఉంటుంది.
ఆసక్తిగల ఇన్వెస్టర్లు నగదు ద్వారా గరిష్టంగా రూ. 20,000 వరకు చెల్లించి బాండ్లు కొనుగోలు చేయవచ్చు. లేదంటే డిమాండ్ డ్రాఫ్ట్, చెక్ లేదా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా ఇస్యూ ప్రైస్ చెల్లించవచ్చు. జారీ చేసిన తర్వాత, దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఆఫ్ హెల్డింగ్ ను ఇన్వెస్టర్లు పెట్టుబడిదారులు పొందుతారు. ఈ సర్టిఫికెట్ ను డీమ్యాట్ రూపంలోకి కూడా మార్చుకోవచ్చు.బంగారం కొనుగోలు పట్ల ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.