Nature is amazing……………………
ఎన్నో అద్భుతాల సమ్మేళనం ప్రకృతి. నిత్యం పొగలు గక్కే నది కూడా ఆ అద్భుతాలలో ఒకటి ఈ బాయిల్డ్ రివర్… దక్షిణ అమెరికాలోని పెరువియన్ అమెజన్ రెయిన్ ఫారెస్ట్‌లో ఉంది. ఇది అమెజాన్ నదికి ఉపనది కూడా. ప్రపంచంలోనే మరుగుతున్న నది ఇదొక్కటే. దీని పేరు షానయ్-టింపిష్కా.
నిజానికి ఇది లా బొంబా నదిగానే ప్రసిద్ధి చెందింది. ఇది సుమారు 6.4 కిలోమీటర్లు పొడవైన నది. ఈ నది నీటి ఉష్ణోగ్రతలు 212 డిగ్రీల ఫారెన్‌హీట్ (100 డిగ్రీల సెల్సియస్) ఉంటుంది. ఇలా ఈ నది ఎందుకు నిత్యం మరుగుతూ పొగలు గక్కుతూ ఉంటుంది అనేది ఓ అంతు పట్టని మిస్టరీ.
.
అక్కడ ఉండే రాతినేలల్లో విపరీతమైన వేడి ఉండటంతోనే ప్రవహించే నీరు మరుగుతుందని చెబుతుంటారు. మరికొందరూ భూ ఉష్ణోగ్రత కారణంగా అని అంటారు. మరి మిగతా నదులు అలా లేవు కదా… కేవలం ఈ నది ఇలా ఎందుకు ఉందని? చాలా మంది మదిని తొలిచే ప్రశ్న. దీనికి గల కారణం గురించి ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు. కొన్ని పరిశోధనలు జరిగినా కారణాలు కనుగొన లేకపోయారు.
ఈ మరుగుతున్న నీటిలో ఏవైనా క్షణాల్లో ఉడికిపోతాయి. ఈ నీటిలో చేతులు అస్సలు పెట్టే సాహసం చేయకూడదు. అప్పుడప్పుడు ప్రమాదవశాత్తూ పక్షులు నీటిని తాగబోయి మరణించాయని స్థానికుల కథనం. ఈ నదీ జలాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని, ఇవి ఎన్నో వ్యాధులను నయం చేస్తాయని స్థానికులు చెబుతుంటారు.
అందుకే ఈ ప్రాంతానికి జనాలు తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఇదిలా ఉండగా పర్యావరణ ప్రేమికులు ఇలా పర్యాటకులు ఈ సహజ సిద్ధ ప్రకృతి అద్భుతాల వద్దకు వస్తే అవి కూడా కాలుష్యానికి గురవుతాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహజసిద్ధమైన ఈ నది ని రక్షించడం కోసం పర్యాటకుల తాకిడిని తగ్గించేలా ఇప్పటికే పలు ఆంక్షలు విధించే యత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.