Abdul Rajahussain …………………………………………….
ప్ర*చాలా గొప్ప విషయం..మీరు ప్రపంచ చరిత్ర రాస్తున్నందుకు అభినందనలు .. ఈ ప్రపంచ చరిత్ర పుస్తకం ఎలా ఉండబోతుందో చూచాయగా చెబుతారా?
జ … “నేను ముందుగా ఈ విశ్వం పుట్టినప్పుటి నుండి మొదలు పెట్టి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి జనాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న కరోనా వైపరీత్యం వరకు రాద్దామనుకుంటున్నాను. విశ్వంలో గాలీ, నిప్పు నీరూ పుట్టుక,రుతువులు .. ఆకాశం,భూమి సముద్రాలు,నదీనదాల ఆవిర్భావం నుంచి మొదలు పెట్టి రాస్తున్నా.ఆ తర్వాత ప్రాచీన మానవ నాగరికతకు సంబంధించిన వివిధ దేశాల దగ్గరి నుండి ప్రారంభించి. అభివృద్ది చెందుతూ వున్న దేశాలవరకు రాస్తున్నా. ఇదంతా మీకు అర్థం కావాలంటే మనం ఓసారి ప్రపంచ చరిత్రను..వివిధ దేశాలను చుట్టిరావాలి.
*ప్రపంచ చరిత్ర…విహంగావలోకనం… ప్రపంచ చరిత్ర అనేది మానవుడి పుట్టుక, మనుగడ మొదలుకొని ఇప్పటి వరకు జరిగిన యదార్థాల అధ్యయనం. ఈ అధ్యయనం పురాతత్వశాస్త్రం, మానవ పరిణామ శాస్త్రం, జన్యు శాస్త్రం, భాషాశాస్త్రం, ఇతర సంబంధిత శాస్త్రాల ఆధారంగా జరుగుతుంది. చరిత్రలో మానవుడు వ్రాత పద్ధతిని కనిపెట్టిన మొదలు గౌణ వనరుల ఆధారంగా, అధ్యయనాల ఆధారంగా, ప్రపంచ చరిత్రను నిర్వచించగలం మానవుడు రాత విధానాన్ని కనిపెట్టక ముందు ప్రాక్ చరిత్ర తొలి రాతి యుగంతో మొదలై కొత్త రాతి యుగం(నియోలిథిక్, నియో -కొత్త, లిథిక్ – రాయి) వరకు జరిగింది.
కొత్త రాతి యుగంలో క్రీ.పూ. 8000 నుండి 5000 మధ్య వ్యవసాయ విప్లవం మొదలయింది. వ్యవసాయం మానవ చరిత్రలో. ఒక పెద్ద ఘట్టం. అప్పటి దాకా సంచారులై తిరుగుతున్న మనుషులు ఒక చోట స్థిరపడి పంట పండించు కొని తినడం మొదలుపెట్టారు. వ్యవసాయానికి పనికొచ్చే మొక్కలను, చెట్లను, జంతువులను మనిషి తనకనువుగా మచ్చిక చేసుకోవటం మొదలుపెట్టాడు. వ్యవసాయం మెరుగయ్యే కొద్దీ,మనిషి సంచారజీవితాన్ని వదిలేసి స్థిరనివాసాలను ఏర్పాటు చేసుకోవడం మొదలు పెట్టాడు. ఎక్కువ ప్రయాస లేకుండా ఆహారం అందుబాటులోకి రావటం, వ్యవసాయ మెరుగు దలతోపెరిగిన రాబడి వలన మనిషి స్థిర నివా సాలు విస్తరించాయి.
రవాణా వ్యవస్థ వికాసం వలన మరింత మెరుగయ్యాయి. ప్రాక్చరిత్రలో, చారిత్రక యుగంలో మనిషి స్థిర నివాసం తాగునీటి వసతి అందుబాటులో ఉన్న స్థానాలలోనే జరిగింది. క్రీ.పూ. 3000 సంవత్సరానికే నగరాలు నదీతీరాన వెలిశాయి. ఇవి మెసొపోటామియాలో, నైలు నది తీర ఈజిప్టులో, సింధునది లోయలో, చైనా దేశపు నదుల తీరాన వెలిశాయి. వ్యవసాయం మరింత మెరుగయ్యాక ధాన్యపు సాగులో మెళకువలు వచ్చాయి. ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు కాయకష్టం వ్యవసాయధాన్యాగారాల మధ్య విభజించబడింది.
ధాన్యాగారాల వద్ద పని చేసే కూలీల తరగతి ఒకటి ఏర్పడటంతో నాటి సమాజంలో ధనికులకూ ఒక వర్గం ఏర్పడింది. నగరాలు కూడాఈ విధంగా అభివృద్ధిలోకి వచ్చాయి.ఇలా విపరీతంగా పెరుగుతున్న మానవ సమాజంలోధనవ్యయ సంపాదనలను లెక్కించడానికి రాత విధానం, లెక్కల పద్దు విధానం అవసరమయ్యాయి.నాగరికతలు పెరగడంతో పాటుగా, ప్రాచీన చరిత్ర కాలంలో ఎన్నో రాజ్యాలు పతాక స్థాయి కి చేరి పతనమయ్యాయి. మధ్య యుగాల ప్రపంచ చరిత్రలో ఎన్నో రాజ్యాలు పతాక స్థాయికి చేరి పతనమయ్యాయి. మధ్య యుగాల ప్రపంచ చరిత్రలో క్రైస్తవం, ఇస్లాం, మతాల పుట్టుక వ్యాప్తి కనిపిస్తాయి. క్రీ.శ. 13వ శతాబ్దికి ఇటలీ మొదలు పునరుజ్జీవన విప్లవం యూరప్ లో కనిపిస్తుంది.
తొలి ఆధునిక యుగం, యురోపియన్ యుగంలో ఖండాల కనుగోలు, ముద్రణ, ఆధునికయంత్రాలకు నాంది వేసిన మరెన్నోతొలినాటి యంత్రాల. రూపకల్పన మనకు కనిపిస్తాయి.ఇవే విజ్ఞాన క్రాంతికి బీజాలు వేసాయి.తరువాతి కాలంలో పద్దెనిమిదవ శతాబ్దానికి విజ్ఞానం, సాంకేతిక శాస్త్రం మరింత అభివృద్ధిచెంది సమాచార ప్రసరణ అంతకు ముందు తెలీనంత వేగంగా జరి గింది. మలి ఆధునిక యుగం పద్దెనిమిదవ శతాబ్ది ఆఖరు నుండి ప్రస్తుతం వరకు అని నిర్ధారించబడింది..
అగ్రరాజ్యాలు అమెరికా అంతర్యుద్ధం ప్రపంచ చరిత్ర ప్రపంచ వింతలు ప్రపంచంలోని కొత్తఏడు అద్భుతాలుమింగ్ వంశము,రాబర్ట్ ముగాబే,రాయల్ రోడ్డు, రెండవ ప్రపంచ యుద్ధం,రోమన్ సామ్రాజ్యం, వంద సంవత్సరాల యుద్ధం, హమ్మురాబి , హిట్లర్,నెపోలియన్,ముస్సోలిని. కెనెడీ, లెనిన్…ఇలా ప్రపంచ ప్రసిద్ధిపొందిన నాయకుల జీవితాలతో ముడిపడిందే ప్రపంచ చరిత్రకు ఆధారం.
ప్ర*ప్రపంచ చరిత్ర రాయడానికి మీకున్న అర్హత. మీ శోథన..సాధన, పర్యటన…, అథ్యయనం గురించి చెబుతారా?
జ*మంచి ప్రశ్న? నేను అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యాకనే ప్రపంచ చరిత్ర రాయాలన్న నిర్ణయానికొచ్చాను. ప్రపంచ చరిత్రకు సంబంధించి ప్రసిద్ధ పుస్తకాలను చదివాను. చదివిన విషయాలను నా ప్రపంచ దేశాల పర్యటనలో ప్రత్యక్షంగా చూశాను.చదివిన వాటిని చూసిన వాటికి అన్వయించుకున్నాను. అన్నింటికంటే మించి ప్రాపంచిక స్పృహ వుంది. ప్రపంచ చరిత్ర రాయడానికి ఇంత కంటే అర్హత, సాధికారత ఇంకేం కావాలి.
ప్ర*అయితే మీరు లోకం చుట్టిన వీరులన్న మాట?’
జ* “అన్నమాటే కాదు..ఉన్న మాట కూడా..1991 నుండే విదేశాల సందర్శన మొదలైంది. అయితే గత అయిదేళ్ళలో నా మిత్రబృందంతో కలిసి సుమారు 40….50 దేశాల్ని చుట్టి వచ్చాను. ప్రాచీన నాగరికతకు ఆలవాలమైన రోమ్,గ్రీస్, ఇటలీ,ఈజిప్ట్,మెసపుఈటేమియాచైనా,రష్యా, తదితర దేశాలన్నింటిని సందర్శించి,నాకు కావలసిన మెటీరియల్ ను సిద్ధం చేసుకున్నాను.
*కొన్ని విదేశీ పర్యటనలూ..వివరాలు….
*1991 లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రసంగించారు.వాస్తవానికి ఈ సమావేశంలో భారత్ తరఫున మాననీయ వాజపేయి గారు మాట్లాడవలసింది కానీ యువ పార్లమెంటేరియన్ల ను ప్రోత్సహించాలి అనే ఉద్దేశ్యంతో వాజపేయి గారు డాక్టర్ గారికి అవకాశం ఇచ్చారు ..
డాక్టర్ దగ్గుబాటి మాట్లాడుతూ ‘జాతి వివక్షత – భారతీయ దృక్కోణం’ గురించి సోదాహరణంగా వివరించారు.ఈ ప్రసంగాన్నిసభ యావత్తూ శ్రద్ధగా విన్నారు..డాక్టర్ దగ్గుబాటి తరువాత ప్రసంగించడానికి వేదిక మీదకు వచ్చిన నాటి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నెల్సన్ మండేలా కూడా దగ్గుబాటిని ప్రత్యేకంగా అభినందించారు.
*1993 వ సంవత్సరం చైనా లో డెంగ్ జియో పింగ్ నాయకత్వాన నూతన ఆర్థిక విధానాలు అమలు చెందుతున్న కాలం, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు చైనా దేశంను సందర్శించాలని కోరిక కలిగి ఢిల్లీ లోని చైనా ఎంబసీ కి లేఖ రాయగా చైనా ప్రభుత్వం డాక్టర్ దగ్గుబాటి గారిని తమ దేశంలో పర్యటించ వలసిందిగా ఆహ్వానం పంపించారు.
చైనా ప్రభుత్వ ఆహ్వానం పై బీజింగ్ ,షాంఘై, గాంజా, కాంటాన్ వంటి పలు ప్రాంతాల్లో 15 రోజులపాటు ర్యటించారు. పర్యటనకు మన ప్రభుత్వ ఖర్చు కాకుండా చైనా ప్రభుత్వమే భరించింది. ఇందులో ఆనాటి చైనా దేశ సామా జిక, ఆర్థిక, రాజకీయ విషయాలు మనకు ప్రస్పుటమవుతాయి.
కరోనా కు ముందు సమర్ ఘాండ్ .. బుఖారా దేశాలను సందర్శించి వచ్చారు. ఆయా దేశాల చారిత్రిక ప్రాధాన్యతను అవగాహన చేసుకున్నారు.
ప్ర*ఇంటర్వ్యూ ముగింపు సందర్భంగా ఏదైనా చెబుతారా?
“రాజకీయాల్లో క్రియాశీలంగా వున్నప్పుడు ఈ విషయాలేం తెలిసేవి కాదు. అప్పుడు సిగ్గుపడేవాడిని.ఇప్పుడలా లేదు.స్థానిక, జాతీయ, ప్రాపంచిక విషయాల మీద పట్టు సాధించాను.చాలా ఆనందంగా వుంది.జ్ఞాన సముద్రాన్నిమధించడమంటే….కొత్తగా మొలకెత్తడమే..క్రియాశీలక రాజకీయాల్లో వుండి వుంటే…అప్పటికంటే ఇప్పుడు ఇంకా సమర్థంగా పనిచేయగలనన్న ఆత్మవిశ్వాసం వచ్చింది.జ్ఞానం…మనిషి ఆలోచనలకు,వికాసానికి తాళం చెవిలాంటిది. అది ఇప్పుడు నా చేతిలో ఉంది అంటున్నారు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు.
Read it also ……………………… చరిత్రకారుడిగా కొత్త పాత్రలో డా. దగ్గుబాటి ! (1)