లాఫింగ్ బుద్ధుడు నిజంగా ఫలితాలు ఇస్తాడా ?

Sharing is Caring...

ఫెంగ్ షూయ్  వస్తువులలో ప్రాచుర్యం కలిగినది లాఫింగ్‌ బుద్ధా. ఈ చిన్న విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని అంటారు. రెండు దశాబ్దాల క్రితం ఈ బొమ్మల గురించి ఎక్కువగా ప్రచారం జరిగింది. చాలామంది ఇళ్ల కొచ్చి లాఫింగ్ బుద్ధ కొలువు  తీరాడు. అదృష్టం, సంపద కలిగేందుకు ఫెంగ్‌షూయ్‌ నిపుణులు ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోమని అప్పట్లో సూచించారు.

లాఫింగ్‌ బుద్ధాను ‘హ్యాపీ బుద్ధ లేక మైత్రేయ’ అని కూడా అంటారు. హిందువులకు లక్ష్మీ దేవి వలె సంపదకు సంబంధించిన దేవునిగా ఆయనను కొలుస్తారు. ఇంట్లో ఈ విగ్రహాన్ని పెట్టుకుంటే సౌభాగ్యం, విజయం, ఆనందం కలుగుతాయని భావిస్తారు. వ్యాపారం చేసే వారు కార్యాలయాల్లో పెట్టుకుంటే ఇది రాబడిని పెంచుతుందని చెబుతారు. ఇది ప్రతికూల ప్రాణ శక్తిని హరించి సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తుందని నమ్మకం. అందుకే  ఆమధ్య కాలంలో ఈ విగ్రహం చాలా చోట్ల కనబడేది .ఇపుడు కొందరి  ఇళ్లల్లో మాత్రమే కనిపిస్తున్నది. 

బహుమతి ఇవ్వాలనుకుంటే లాఫింగ్‌ బుద్ధను కొని ప్రెసెంట్ చేసేవాళ్ళు .. పెద్ద పొట్టతో  నవ్వుతూ ఉండే బుద్ధుడు .. వెనుకాల గోతం వేసుకొని ఉన్నట్టుగా ఈ విగ్రహాలు ఉంటాయి. ఇవన్నీ సంపద  అందిస్తాయని ఒక విశ్వా సం. అనంతమైన ఆనందం, ఓర్పు, దయ కలిగిన వాడే బుద్ధుడు. అన్ని కష్టాలను, సమస్యలను ఓర్చి వాటిని ఆనందం గా రూపాంతరం చెందిస్తాడని నమ్మకం. పిల్ల లు, పేదలు, బలహీనుల పక్షాన ఉంటాడని కూడా భావిస్తారు.

ఈ విగ్రహాలు లోహం, టెర్రకోట, క్రిస్టల్స్‌ వంటివాటితో తయారు చేస్తారు. ఇవి రకరకాల పోజులలో కూడా ఉంటాయి. కానీ ప్రతి దానికీ ఒక ప్రాముఖ్యత ఉంటుంది. పూ తాయ్‌గా పిలుచుకునే ఈ బుద్ధుడు వెయ్యి సంవత్సరాల క్రితం చైనాలో జీవించాడని ఒక నమ్మకం. జపనీయులు ఆయనను హోతీ అంటారు.

ఈ బుద్ధుడు లియాంగ్‌ వంశం చైనాను పాలిస్తున్న కాలంలో పూతాయ్‌ అనే సన్యాసి జీవించాడని ఒక కథనం. లావుగా, ముడతలు పడ్డ నుదురుతో, బానలాంటి పొట్ట తో అతడు ఉన్నట్టు చెబుతారు.  అతని జపమాల అదృష్టానికి చిహ్నం కాగా, పొడవుగా వేళ్ళాడుతున్న చెవు లు జ్ఞానానికి చిహ్నం.ఇక సంచీ కోరికలు తీరడానికి చిహ్నం అంటారు.

ఈ ప్రపంచంలో మంచి జీవితాన్ని సాధించవచ్చనే బౌద్ధ సూత్రాలను ఇది ప్రతిఫలిస్తుంది. లాఫింగ్‌ బుద్ధ లేక హాపీ హోతీ మనకు అనేక రూపాలలో దర్శనమిస్తాడు. లాఫింగ్‌ బుద్ధా పొట్టను రాయడం ఆనందాన్ని, అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని తెస్తుందని అనేకమంది భావన. చైనాలోని ఆలయాలలో ద్వారం వద్ద మన గణపతి విగ్ర హం వలెనే లాఫింగ్‌ బుద్ధా ప్రతిమ ను ప్రతిష్ఠిస్తారు. అదృష్టానికి, సౌ భాగ్యానికీ అధి దేవతగా పూజిస్తారు. తత్ఫలితంగానే ఫెంగ్‌షూయ్‌ లాఫింగ్‌ బుద్ధాను సంపదలకు, సౌభాగ్యాలకు ప్రతీకగా చెప్తుంది. 

కాగా జపాన్‌లో అదృష్టాన్ని తెచ్చే ఏడుగురు షింటో దేవతలలో ఒకరిగా లాఫింగ్‌ బుద్ధాను పరిగణిస్తారు.  లాఫింగ్‌ బుద్ధా ప్రతిమను కొనేటప్పుడు సాద్యమైనంత పెద్దది కొనడం మంచిదని అంటారు .కొన్న ప్రతిమను ద్వారానికి ఎదురు గా ముప్ఫై అంగుళాల ఎత్తు మీద ఒక టేబుల్‌ మీద పెట్టుకోవాలి అని చెప్పే వారు.  విద్యార్ధులు అయితే మంచి ఫలితాల కోసం ఆ ప్రతిమను తమ టేబుల్‌పై ఉంచుకోవచ్చు.

ఆఫీసులో లేదా రిసెప్షన్‌ టేబుల్‌ మీద ఉంచడం వల్ల ఆదాయం బాగా ఉంటుంది. ఈ విగ్రహాలను దేవతా విగ్రహం వలే పూజించనవసరం లేదు. దాన్ని సరైన స్థలం లో ఉంచితే సరిపోతుంది. అయితే ఈ విగ్రహాలను బెడ్‌రూంలలోనూ, బాత్‌ రూంలలో నూ, డైనింగ్‌ రూంలలోనూ పెట్టకపోవడమే మంచిదని ఫెంగ్‌షూయ్‌ నిపుణులు సూచించే వారు.  అప్పట్లో వీటిపై పుస్తకాలు వచ్చాయి.  లాఫింగ్ బుద్ధా పై పెద్ద స్థాయిలో ప్రచారం జరిగింది. వీటిని వాడి ప్రయోజనం కనబడక పక్కన పడేసిన వారు కూడా ఉన్నారు. 

—————KNM 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!