She prefers key roles…………
నటి అనుష్క వెనుకబడిందా?… కాదు … యాక్టివ్ రేస్‌లో ఉందా? ..లేదు …. స్టార్ స్టేటస్ తగ్గిందా? అసలు కాదు.. అనుష్క ప్రస్తుతం తక్కువ సినిమాలు, ఎక్కువ గ్యాప్‌తో చేస్తున్నది. ఇది ఆమె తీసుకున్న తెలివైన నిర్ణయం.ఆమె కమర్షియల్ రేస్‌లో ఉండకపోయినా, స్టార్ ఇమేజ్, మార్కెట్ విలువ, ఫ్యాన్ బేస్ మాత్రం తగ్గలేదు.అరుంధతి, బాహుబలి, భాగమతి వంటి సినిమాలు ఆమెను మాస్ + క్లాస్ యాక్ట్రెస్‌గా నిలబెట్టాయి.
ఇటీవల కాలంలో అనుష్క సినిమాలు తక్కువగా రావడం వల్ల ఇతర హీరోయిన్లు ఎక్కువగా కనిపిస్తున్నారనే భావన కలుగుతుంది. అంతే తప్ప ఆమె క్రేజ్ ముగిసిందని కాదు. రోజూ రేసులో పరుగెత్తడం” అనేది అనుష్క స్ట్రాటజీ కాదు. సరైన సినిమా వస్తే ప్రభావం చూపడం అనేదే ఆమె స్టైల్.
ఇతర టాప్ హీరోయిన్లు నయనతార, కీర్తి సురేష్,తమన్నావంటి వారిలా అధిక సినిమాల్లో నటించడం లేదు.అనుష్క శెట్టి సినిమాలు చాలా తక్కువగా చేస్తున్నారు. కీలక పాత్రలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
మార్కెట్లో కనిపించడం తక్కువైనా, స్టార్ వ్యాల్యూ మాత్రం స్థిరంగా ఉంది.. ఒక్క బిగ్ హిట్ మూవీ వస్తే పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు + హీరోలతో పెద్ద ప్రాజెక్టులు.. బాలీవుడ్, తమిళ్, తెలుగు మూడు మార్కెట్లను ప్రభావితం చేయగల ఇమేజ్ అనుష్కకు ఉంది.
అనుష్కకి మంచి రీ-కమ్‌బ్యాక్ ఛాన్స్ ఉందా?
స్టార్ డైల్యూషన్ జరగలేదు.. వరుసగా చిన్న/సాధారణ పాత్రలు చేయకపోవడం వల్ల ఆమె ఇమేజ్ చెక్కు చెదరకుండా ఉంది. హీరోయిన్ నుంచి “ఈవెంట్ యాక్ట్రెస్” స్థాయికి ఎదిగింది..ఏజ్ ఫ్యాక్టర్ ఆమెపై నెగెటివ్‌గా పనిచేయలేదు, ఎందుకంటే ఆమె పాత్రల ఎంపిక వేరు. అయితే దీర్ఘ విరామం వల్ల యూత్ తో కనెక్ట్విటీ కొంత తగ్గింది… సోషల్ మీడియా, పబ్లిక్ ఎంగేజ్మెంట్ ఆమెకు చాలా తక్కువ ఈ క్రమంలోనే మార్కెట్లో కొత్త హీరోయిన్లకు స్పేస్ ఎక్కువగా వచ్చింది.
ఆమె తీసుకున్న నిర్ణయాలు ఇమేజ్ పరంగా చాలా సేఫ్. లేడీ ఓరియెంటెడ్ సినిమా (హారర్ / పీరియాడిక్ / మైథలాజికల్ / థ్రిల్లర్) బలమైన దర్శకుడు + సరైన ప్రమోషన్ జరిగితే పెద్ద హిట్ కొట్టే ఛాన్స్ ఉంది. అనుష్క రొటీన్ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు,యువ హీరోలతో గ్లామర్ పాత్రలు చేయదలచుకోలేదు.
అనుష్కకు ఇప్పటికీ ఒక మంచి సినిమా వస్తే మార్కెట్ షేక్ చేసే సామర్థ్యం ఉంది.హీరోయిన్లు చాలామంది ఉంటారు…. కానీ “అరుంధతి అనుష్క” ఒక్కరే … ఆమెను ఓడించడానికి సినిమాలు చాలవు…అలాంటి పాత్రలు కావాలి… అనుష్క శెట్టి సినిమాల పరంగా ప్రస్తుతం కాస్త వెనుకబడిందనే చర్చ పరిశ్రమలో జరుగుతోంది.
2025లో ఆమె ఎదుర్కొన్న కొన్ని కీలక పరిణామాలు దీనికి కారణం.. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5, 2025న విడుదలైన అనుష్క క్రైమ్ థ్రిల్లర్ ‘ఘాటి’ (Ghaati) బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయింది. సుమారు ₹40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, కేవలం ₹7 కోట్ల లోపు వసూళ్లతో కెరీర్లోనే పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
ఈ సినిమా విడుదల సమయంలో అనుష్క ప్రత్యక్షంగా ప్రమోషన్లలో పాల్గొనకపోవడం కూడా ప్రతికూలంగా మారింది. కేవలం ఫోన్ ద్వారా ఇంటర్వ్యూలు ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి.’ఘాటి’ ఫలితం తర్వాత, అనుష్క కొంతకాలం పాటు సోషల్ మీడియాకు విరామం ప్రకటించారు.
ప్రస్తుతం ఆమె మలయాళంలో తన తొలి చిత్రం ‘కథనార్: ది వైల్డ్ సోర్సరర్’ (Kathanar – The Wild Sorcerer) లో నటిస్తున్నారు. ఇది భారీ బడ్జెట్ చిత్రం కావడంతో దీనిపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
గతంలో ‘బాహుబలి’, ‘అరుంధతి’ వంటి చిత్రాలతో అగ్రస్థానంలో ఉన్న అనుష్క, ప్రస్తుతం సినిమాల ఎంపికలో వేగం తగ్గించడం ..ఇటీవలి పరాజయాల వల్ల రేసులో వెనుకబడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

