Mind blowing tour…………………
పర్యాటకుల మనస్సుదోచే తూర్పు గోదావరి జిల్లా పాపికొండల విహార యాత్రకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పర్యాటక అభివృద్ధి శాఖ (ఏపీటీడీసీ) ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. క్రిస్మస్, సంక్రాంతి పండుగల వేళ కుటుంబ సభ్యులతో కలిసి బోటులో విహరించేందుకు ఒకటి, రెండు రోజుల టూర్లను రాజమండ్రి, పోచవరం, గండి పోచమ్మ ప్రాంతాల నుంచి సిద్ధం చేసింది.
రాజమండ్రి నుంచి ఒక రోజు పర్యటన
రాజమండ్రి నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలు దేరి సాయంత్రం 7.30 గంటలకు వెనక్కి రావచ్చు. ఈ ప్యాకేజీలో పెద్దలు ఒక్కొక్కరికి రూ.1,250, చిన్నారులు ఒక్కొక్కరికి రూ.1,050 చార్జీగా నిర్ణయించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తారు.
రాజమండ్రి నుంచి 2 రోజుల పర్యటన
రాజమండ్రి నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటలకు తిరిగి వస్తారు. ఈ ప్యాకేజీలో పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ. 2,500 చార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి 2 నాన్వెజ్ కూరలతో భోజనం, 2వ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం 2 నాన్వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తారు.
పోచవరం నుంచి ఒక రోజు పర్యటన
పోచవరం నుంచి పాపికొండలకు ఉదయం 9.30 గంటలకు బయలు దేరి సాయంత్రం 5 గంటలకు తిరిగి రావచ్చు. ఈ ప్యాకేజీలో పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 చార్జీ వసూలు చేస్తారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తారు.
పోచవరం నుంచి 2 రోజుల పర్యటన
పోచవరం నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి తిరిగి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటల వరకు వెనక్కి వస్తారు. పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2,000 చార్జీ ఈ ప్యాకేజీలో వసూలు చేస్తారు. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి 2 నాన్వెజ్ కూరలతో భోజనం, 2వ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రెండు నాన్వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం అల్పాహారం ఇస్తారు.
గండి పోచమ్మ నుంచి ఒక రోజు పర్యటన
గండి పోచమ్మ నుంచి పాపికొండలకు ఉదయం 9.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటల వరకు విహార యాత్ర చేయవచ్చు. ఇందుకు గాను పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.800 చార్జీ. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తారు.
గండి పోచమ్మ నుంచి 2 రోజుల పర్యటన
గండి పోచమ్మ నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటల వరకు యాత్ర సాగుతుంది. ఇందుకు గాను పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2,000 చార్జీ నిర్ణయించారు. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి రెండు నాన్వెజ్ కూరలతో భోజనం. 2వ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రెండు నాన్వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం అల్పాహారం ఇస్తారు.
రెండు రోజుల విహారయాత్ర ను ఎంపిక చేసుకుంటే నైట్ స్టే కల్పిస్తారు. రెండో రోజు టూర్ పూర్తైన తర్వాత మళ్లీ ఎక్కడ ఎక్కితే అక్కడ వదులుతారు.
ఈ విహారయాత్ర లో గోదావరిలో పయనిస్తూ చుట్టూ ఉన్న కొండలు, లోయల అందాలను ఆస్వాదించవచ్చు. పెరంటల్లపల్లి, పోచమ్మ ఆలయం, పట్టిసీమ వంటి ప్రదేశాల్లో సుందర దృశ్యాలను తిలకించవచ్చు. ఈ కొండలపై అనేక గిరిజన వర్గాలు తమ నివాసాలను ఏర్పాటు చేసుకున్నాయి.
మునివాతం వద్ద ఉన్న జలపాతం ప్రత్యేక ఆకర్షణ. రాజమండ్రి, గండి పోచమ్మ నుంచి పాపికొండలు వెళ్ళడానికి సెల్ : 98486 29341, 98488 83091 నంబర్లలో సంప్రదించండి. పోచవరం నుంచి పాపికొండలు వెళ్లే వారు సెల్ : 63037 69675 నంబర్లో సంప్రదించాలి. అన్ని వివరాలు సిబ్బంది చెబుతారు.