A wonderful singer ……………..
భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ 1942లో తన కెరీర్‌ని ప్రారంభించారు. ‘మహల్’ చిత్రంలోని ‘ఆయేగా ఆనే వాలా’ పాట ద్వారా ఆమెకు సినీ పరిశ్రమలో గుర్తింపు పొందారు.లతా మంగేష్కర్ ప్రపంచవ్యాప్తంగా 36 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి రికార్డు నెలకొల్పారు.
లతా మంగేష్కర్ గాయనిగా తన కెరీర్‌లో చాలా సంపదను గడించారు.Trustednetworth.com రిపోర్ట్ ప్రకారం లతా మంగేష్కర్ ఆస్తుల నికర విలువ USD 50 మిలియన్లు.మన ఇండియన్ కరెన్సీ లో చెప్పుకోవాలంటే దాదాపు రూ. 368 కోట్లు. లత సంపాదనలో అధిక భాగం పాటల రాయల్టీలు ..పెట్టుబడుల నుండి వచ్చింది.
లతా మంగేష్కర్ తొలిసారిగా మరాఠీ చిత్రం ‘కితీ హసల్’ కోసం ఒక పాడారు. అయితే సినిమా ఎడిటింగ్లో ఆ పాటను తొలగించారు. దీంతో లత తొలి పాట వెలుగుచూడలేదు.లతా మంగేష్కర్ మొదటి సంపాదన కేవలం 25 రూపాయలు మాత్రమే. ఆమె మొదటి ఐదు సంవత్సరాలలో సగటున ఒక పాటకు రూ. 300 తీసుకునే వారట.ఆతరవాత రూ. 2,000; రూ. 5,౦౦౦ అలా పెంచుకుంటూ వెళ్లారని అంటారు.
కాగా చనిపోయేనాటికి ఆమె కోట్ల ఆస్తికి యజమానిగా మారింది. లతా మంగేష్కర్ నెలవారీ ఆదాయం రూ.40 లక్షలు. చిన్ననాటి నుంచి కఠోర శ్రమతో ఆమె ఈ స్థానానికి ఎదిగింది.లతకి సౌత్ ముంబైలోని పెద్దర్ రోడ్‌లో ‘ప్రభు కుంజ్ భవన్’ పేరుతో ఒక భవంతి ఉంది. ఆమె ఇందులో నివసించేది.
ఆ భవంతి ఖరీదు కోట్లలో ఉంటుంది. లతా మంగేష్కర్‌కు కార్లంటే చాలా ఇష్టం.చెవర్లేట్, బ్యూక్, క్రిస్లర్ కార్లు ఆమె కున్నాయి. ‘వీర్ జారా’ పాటలు విడుదలైన తర్వాత లతా మంగేష్కర్‌కు చిత్ర నిర్మాత యష్ చోప్రా మెర్సిడెస్ కారును బహుమతిగా ఇచ్చారు.
లతా మంగేష్కర్ జీవితాంతం అవివాహిత గానే ఉండిపోయారు. ఎవర్ని పెంచుకున్నట్టు కూడా సమాచారం లేదు.లతా మంగేష్కర్ ఆస్తులు ఆమె తన తండ్రి పేరు మీద సృష్టించిన ట్రస్ట్‌కు, అలాగే ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్‌కు వెళ్లాయి.