IRCTC ‘Divine Karnataka’ Package……………………..
IRCTC తాజాగా ‘డివైన్ కర్ణాటక’ పేరుతో ఓ స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ఈ టూర్‌ను ప్లాన్ చేశారు. హైదరాబాద్ నుంచి ఈ టూర్ మొదలవుతుంది. 5 రాత్రులు 6 రోజులు ఈ టూర్ సాగుతుంది.
అక్టోబర్‌నెలలో 1, 8, 15, 22, 29 తేదీలలో అంటే ప్రతి మంగళవారం ఈ టూర్ ప్యాకేజి అందుబాటులో ఉంటుంది. ఈ డివైన్ కర్ణాటక సంబంధించి ముందస్తు రిజర్వేషన్‌లు మొదలైనాయి. ఇంతకీ టూర్ ప్యాకేజీలో కవర్ అయ్యే ప్రాంతాలు, ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ప్యాకేజీ లో 3 రోజులు బ్రేక్ ఫాస్టు అందిస్తారు. ఇక భోజనం ఖర్చులు పర్యాటకులు భరించాలి.
* ఫస్ట్ డే ఉదయం 6:05 గంటలకు కాచిగూడ- మంగళూర్ సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నం: 12789) ఎక్కగానే టూర్ మొదలవుతుంది. ఆ రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
* సెకండ్ డే ఉదయం 9.30 గంటలకు మంగళూరు చేరుకుంటారు. అక్కడినుంచి ఉడిపికి వెళ్లి, ముందుగానే బుక్ చేసిన హోటల్‌లో ఫ్రెషప్ అయ్యాక శ్రీకృష్ణ ఆలయం, మాల్పే బీచ్ సందర్శన ఉంటుంది. ఆ రాత్రి ఉడిపిలోనే బస చేస్తారు.
* ఇక థర్డ్ డే ఉదయం శృంగేరీ కి వెళతారు. అక్కడ శారదాంబ ఆలయాన్ని దర్శించుకుంటారు. తర్వాత మంగళూరు వెళతారు. ఆ రాత్రి అక్కడే బస చేస్తారు.
* ఫోర్త్ డే ఉదయం ధర్మస్థల చేరుకుంటారు. అక్కడ మంజునాథ స్వామి ఆలయాన్ని, కుక్కే సుబ్రమణ్య టెంపుల్ ను దర్శించుకుంటారు.సాయంత్రం తిరిగి మంగళూరుకు బయలుదేరి వస్తారు.. ఆ రాత్రి అక్కడే బస చేస్తారు.
* ఇక ఫిఫ్త్ డే … మంగుళూరు లోని పురాతన మంగళదేవి ,కద్రి మంజునాథ ఆలయాలను దర్శించుకుంటారు. సాయంత్రం తన్నెరభావి బీచ్, కుద్రోలి గోకర్నాథ దేవాలయం చూస్తారు. ఆ పిదప మంగళూరు రైల్వేస్టేషన్ చేరుకుని, రాత్రి 8 గంటలకు (ట్రైన్ నం: 12790) రైలు ఎక్కుతారు.
* సిక్స్త్ డే … రాత్రి 11.40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. దీంతో యాత్ర ముగుస్తుంది.
ఛార్జీలు ఇలా ఉంటాయి.
ఛార్జీల విషయానికొస్తే.. రూమ్ సింగిల్ షేరింగ్ అయితే రూ.38,100 ..ట్విన్ షేరింగ్‌కు రూ. 22,450, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 18150గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల మధ్య పిల్లలకు విత్ బెడ్ రూ. 11430, విత్ అవుట్ బెడ్ రూ. 9,890 చెల్లించాలి. .స్లీపర్ బెర్త్‌కు … థర్డ్ ఏసీకి ప్రత్యేకంగా ఛార్జీలను నిర్ణయించారు. సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజీ ఆధారంగా వసతి సదుపాయాలు ఉంటాయి. పూర్తి వివరాల కోసం IRCTC వెబ్సైటు చూడండి. లేదా ఈ నంబర్లను 8287932229 / 9701360701 సంప్రదించండి.