అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన దుర్భుద్ధి బయటపెట్టకుని పరువు పొగొట్టుకున్నాడు. పార్టీ కూడా ఆయన వైఖరిని తప్పు పట్టిన పరిస్థితి నెలకొన్నది. పార్టీ యే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రియులంతా ట్రంప్ తెంపరి తనాన్ని.. దుష్టబుద్ధిని దుయ్యబడుతున్నారు. హుందాగా ఓటమిని ఒప్పకుని అధికార మార్పిడికి అంగీకరించినట్టయితే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉండేది. అలాకాకుండా మద్దతు దారులను రెచ్చగొట్టి క్యాపిటల్ హిల్ భవనం పై దాడికి పాల్పడేలా చేశారు. ఈ దాడిలో అయిదుగురి ప్రాణాలను పొట్టన బెట్టుకున్నారు. అందుకే ఆయనకు బుద్ధిచెప్పాలని …అభిశంచాలనే డిమాండ్ ఊపందుకుంది. రిపబ్లికన్లతో పాటు డెమోక్రాట్లు కూడా ట్రంప్‌ను అభిశంసించాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ అధికారం నుంచి తప్పుకోవడానికి ఇంకా 10 రోజులు వ్యవధి మాత్రమే ఉంది. ఈ లోగానే ఆయనను ఇంపీచ్ చేయాలని డెమొక్రాట్లు యోచిస్తున్నారు. తన దుశ్చర్యను లోకమంతా ఖండిస్తున్నాట్రంప్ వైఖరి .. మాట తీరు ఇప్పటికీ మారలేదు.
అమెరికా చరిత్రలో రెండుసార్లు అభిశంసనకు గురైన వ్యక్తి ట్రంప్ మాత్రమే. 2019 డిసెంబర్ లో ట్రంప్‌పై తొలిసారిగా అభిశంసన జరిగింది. అధికార దుర్వినియోగం కేసులో హౌజ్ ఆయన్ను తప్పుపట్టే ప్రయత్నం చేసింది. కానీ ఆ అభిశంసన విఫలమైంది. చరిత్రలో ఇప్పటి వరకు ముగ్గురు అమెరికా అధ్యక్షులు మాత్రమే అభిశంసనకు గురయ్యారు. రెండు సార్లు ఎవరూ అభిశంసనకు గురికాలేదు. వ్యవధి తక్కువగా ఉన్న కారణంగా.. సభ ఏర్పాటు … హౌజ్‌లో ఓటింగ్ జరిగి .. ఆ తర్వాత విచారణకు తక్షణమే సేనేట్ ఆమోదం పొందాలి. అయితే జనవరి 20లోగా విచారణ జరగడం అసాధ్యమని అంటున్నారు.
వంద మంది సేనేటర్లు ఒకవేళ అభిశంసన ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలని డిమాండ్ చేస్తేనే ట్రంప్ తొలగింపు జరుగుతుంది. పది రోజుల్లో అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్న ట్రంన్‌ను అభిశంసించడం శుద్ధ దండుగ ప్రక్రియ అనే వాదన కూడా వినపడుతోంది. కానీ ఆయన మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలంటే అభిశంసనే ఏకైక మార్గమని కూడా అంటున్నారు. విచారణలో ట్రంప్ దోషి అని తేలితే అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టకుండా సేనేట్ ఓటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అనర్హత వేటు విధించాలంటే.. సేనేటర్లలో స్వల్ప మెజారిటీ సరిపోతుందని చెబుతున్నారు.
అదే సమయంలో ట్రంప్ మాజీ అయ్యాక కూడా అభిశంసించే అవకాశం ఉన్నది. వైట్‌హౌజ్‌ను వదిలి వెళ్లిన తర్వాత ట్రంప్‌ను విచారించేందుకు కావాల్సిన అన్ని మార్గాలను హౌజ్ లాయర్లు అన్వేషిస్తున్నారు. రాజ్యాంగ నిపుణలతో చర్చిస్తున్నారు. ఇంత చేసాక ట్రంప్‌ను అభిశంసించకుండా పంపరని అంటున్నారు. లేదంటే ప్రపంచదేశాల్లో అమెరికా పరువు పోతుందని అంటున్నారు. అమెరికాలో పటిష్టమైన చట్టాలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది లేకపోతే ట్రంప్ లాంటి దూరాలోచనాపరులు చట్టాలను మార్చేసి తమకు తామే నియంతలుగా ప్రకటించుకునే వారు. చూద్దాం ఏమి జరుగుతుందో ?
———-KNM