ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారా?

Sharing is Caring...

The story lacks strength…………

‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’ 1982లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రంలో ఇద్దరు లెజెండరీ నటులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. కథానాయికలుగా శ్రీదేవి, రాధిక నటించారు. ముందుగా జయప్రద, జయసుధ లను  తీసుకోవాలనుకున్నారు. వారి డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో  శ్రీదేవి, రాధిక లు తెరపై కొచ్చారు. 

 NTR, కృష్ణ అన్నదమ్ములుగా నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’ తర్వాత దాదాపు తొమ్మిదేళ్లకు వచ్చిన  మల్టీస్టారర్ సినిమా ఇది. అప్పట్లో కుటుంబకథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకుంటున్న కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించగా, GRP ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆర్.వి. గురుపాదం నిర్మించారు.

ఇద్దరుగ్ర నటులు నటించిన సినిమా కావడంతో ఓపెనింగ్స్ ఊహించని రీతిలో వచ్చాయి. మంచి టాక్ రాకపోవడంతో ఆ తర్వాత రన్నింగ్ లో సినిమా వెనుక బడింది. ఆశించిన స్థాయిలో సినిమా ఆడలేదు. ఇద్దరి హీరోల అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా సినిమా రూపొందలేదు.

కథ విషయానికొస్తే అన్యోన్యంగా ఉండే అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లను ఇచ్చి పెళ్లి చేస్తే ఆ కుటుంబం బాగుంటుందని ఇద్దరు తల్లులు భావిస్తారు. తల్లుల కోరిక మేరకు అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లను ప్రేమించి పెళ్లి చేసుకుంటారు..ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి ఎలా విడిపోయారు? మరల అన్నదమ్ములు వయ్యారి భామలను ఎలా దారిలో పెట్టారు అనేది క్లుప్తంగా సినిమా కథ.

ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి. అందుకే జనాలకు ఈ సినిమా రుచించలేదు. కథలో ఆసక్తికరమైన మలుపులులేవు ,భావోద్వేగ సన్నివేశాలు లేవు. కథలో బలం లేదు. ఎన్టీఆర్ ,కృష్ణ వంటి  హీరోలతో సినిమా తీసేటపుడు ఇవన్నీ చూసుకోవాలి మరి. దర్శకుడు సినిమా ను రిచ్ గానే తీశారు.కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు..దర్శకుడు హీరోల డ్రెస్సెస్ ,సాంగ్స్ పై పెట్టిన శ్రద్ధ కథపైపెడితే బాగుండేది అన్న విమర్శలు వచ్చాయి. 

సినిమాలో కామెడీ పండించడానికి ప్రయత్నించినా, కథనంలో పట్టు లేకపోవడం వల్ల ప్రేక్షకులు బోర్ ఫీలవుతారు. ఇద్దరు మాస్ హీరోలు ఉన్నప్పుడు ఆశించే యాక్షన్ లేదా భారీ డైలాగులు లేకపోవడం మైనస్ అయ్యింది.కట్టా సుబ్బారావు కి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకోలేపోయారు. 

డి. వి. నరసరాజు డైలాగులు బాగానే రాసారు. రావుగోపాలరావు,అల్లు,నూతన ప్రసాద్ కామెడీ ట్రాక్ ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తం రిచ్ గా ఉంటుంది. పలు సన్నివేశాల్లో ఎన్టీఆర్, కృష్ణలు ఒకేరకం డ్రెస్ లో కనిపిస్తారు. పాటలు అవుట్ డోర్ లో తీశారు.

ఇద్దరి హీరోల అభిమానులు ఫీల్ అవకుండా పాటలు కూడా తీశారు .పాటలు పరవాలేదు. రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు.రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, కాంతారావు ,నూతన్ ప్రసాద్, రమాప్రభ,  పండరీబాయి,ఎస్ వరలక్ష్మి  వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా యూట్యూబ్ లో ఉంది ఆసక్తి ఉన్న వారు చూడవచ్చు . 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!