New experiment……………………………………..
రోదసిలో చైనా సౌరశక్తి విద్యుత్ ప్లాంటు ను ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. 2028కల్లా ఈ పాజెక్టు ను సిద్ధం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. కొన్ని దేశాలు ఇదే ప్రయత్నం లో ఉన్నప్పటికీ .. వాటి కంటే ముందుగా చైనా రోదసి రంగంలో దూసుకెళ్తున్నది.
Xidian విశ్వవిద్యాలయానికి చెందిన డువాన్ బావోయన్ నేతృత్వంలోని “డైలీ ప్రాజెక్ట్” పరిశోధన బృందం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన కొన్ని పరిశోధనలు కూడా చేసింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సౌరశక్తిని మైక్రోవేవ్స్ గా మార్చి భూ కక్ష్యలోని తమ ఉపగ్రహాల అవసరాల కోసం చైనా ఉపయోగించుకుంటుంది.
అదే విధంగా సౌరశక్తిని మైక్రోవేవ్స్ ను ఈ రోదసి కేంద్రం భూమికి పంపిస్తుంది. దీనికి సంబంధించి చేసిన ప్రాధమిక పరిశోధనలు అన్ని సక్సెస్ అయ్యాయి. ఉక్కు తో నిర్మించే ప్లాంట్‌ని Xi dian యూనివర్సిటీ దక్షిణ క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు. దీని ఎత్తు 75 మీటర్లు. ఈ ప్లాంట్ లో సౌర శక్తి శ్రేణులపై నిఘా ఉంచే ఐదు ఉపవ్యవస్థలు ఉన్నాయి.
ఈ రోదసి పవర్ ప్లాంటుకు 10 కిలోవాట్ల సామర్థ్యం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒమేగా భారీ ప్రాజెక్ట్ లో భాగమైన రోదసి విద్యుత్ కేంద్రం గురించి 2014లోనే పరిశోధకులు ప్రకటించిన విషయం తెలిసిందే. భూకక్ష్యలో తిరిగే ఈ వ్యోమ నౌక, సౌర శక్తిని విద్యుత్ శక్తిగా మార్చి నిల్వ చేస్తుంది. అనంతరం భూమికి పంపుతుంది.
సౌర శక్తిని ఉపయోగించుకోవడం లో చైనా ముందంజలో ఉంది. పరావలయం (పారాబోలా) ఆకారంలో ఉండే అద్దాలను మూడు వేల ఏళ్ల క్రితమే చైనాలో ఉపయోగించేవారు. సూర్యకిరణాలను కేంద్రీకరించి మాంసాన్ని కాల్చేందుకు ఆ అద్దాలను వాడేవారు.సూర్యరశ్మితో చలికాలంలో గాలిని, నీటిని వేడి చేసేందుకు సౌర ఉష్ణ వ్యవస్థలను ఉపయోగించేవారు.
తద్వారా విద్యుత్ డిమాండును తగ్గించుకునే వారు.సౌర విద్యుత్ వల్ల ఖర్చు తగ్గడంతో పాటు, పర్యావరణాన్ని కూడా కాపాడవచ్చు. ఇక ఈ తాజా ప్రాజెక్టు విషయాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇదే విధమైన ప్రాజెక్ట్‌ను 2019లో NASA ప్రకటించింది. దాని విషయాలు కూడా పూర్తిగా బయటకు రాలేదు.