చలం…అచలం…అరుణాచలం…!!

Sharing is Caring...

ఎ..రజాహుస్సేన్…………..

నాస్తికత్వం నుంచి అస్తికత్వం వైపుకు.. నిరీశ్వరవాదం నుంచి..ఈశ్వరోపాసన వరకు చలం గారి ప్రస్థానం సాగింది. చలం గారి భావాలు తరుచూ మారే రుతువులు కావడం విమర్శలకు దారితీసింది.ఆయన మొదటి నాస్తికుడు..ఆ తర్వాత అరుణాచల యాత్రతో అస్తిత్వం వైపుకు మొగ్గాడు.

ఈశ్వరుడనే వాడే లేడన్న చలం గారు చివరకు ఈశ్వరోపాసకుడయ్యాడు.చలంగారి లోని ఈ ద్వైదీభావం ఈ మార్పు ఆయన వ్యక్తిగతమైనా కూడా విమర్శలు తప్పలేదు. చలంగారి లోని ఈ వైవిధ్యం పలాయన వాదమన్న అపవాదు మోయక తప్పలేదు అయితేచలం గారిని అభిమానించే వాళ్ళు ఈ వైరుధ్యాన్ని” సత్యాన్వేషణ” అన్నారు. 

చలం లో వైరుధ్యాలున్నాయని గోల పెట్టే వాళ్ళు బహుశా జడులై వుంటారు.సత్యాన్వేషణ అంటే వారికి తెలియదు. తాత్వికులకు సమాధానాలు ముఖ్యం కాదు. ప్రశ్నలు…. ముఖ్యం.ఈనాటికి సమాధానం సత్యమని పంపించవచ్చు.రేపటికి కాదు.ఈ ప్రయాణం లో నిత్యమూ క్రొత్త మజిలీలు తగు లేస్తూ వుంటాయి.శాశ్వత సత్యాలంటూ లేవు.అప్పటికేది సత్యమని తోస్తుంటే అప్పటికది అంగీ కరించడమే మనం చెయ్యగలిగింది.దీన్నే Open mindness అన్నాడు చలం “..!! (ఆర్ .ఎస్… సుదర్శనం)

‘సాధన’లో బాధ…!!
“ఆరుణాచలా ఘనీభవానంద తిరిగి అంధకార తేజోమూర్తి”! తిరువణ్ణామలై లో చలం గారికి ఈశ్వరుడిపై నమ్మకం కుదిరినప్పటి నుంచి పరిస్థితులు క్రమంగా కుదుట పడుతున్నాయి.ఈశ్వరుడు చలం తలనొప్పులు పోగొట్టాడు. జనరల్ గా ఆరోగ్యం బాగైంది. కొత్త‌ ఉత్సాహం వచ్చింది.

ఇది వరకు మూసుకుపోయిన జీవితం ఉజ్జ్వలమైన భవిష్యత్ లోకి వికసిస్తోంది.ఎక్కడి నుంచి ఉందో డబ్బువచ్చి నెల నెలా చలం గారి ఇంటిని గడుపుతోంది. చలంగారు అరుణాచలం లో స్థిరపడ్డారని తెలిసి ఆయనలో విశ్వాసమున్న మిత్రులు చూడ్డానికి వస్తున్నారు.

ఈశ్వర సాధనలోచలంగారి వొళ్ళు,మనసు ఎప్పుడూ బాధపెడుతూనే వుంది. జీవితమంతా చలంగారిని కాల్చింది..కాలుస్తున్నదీ అశాంతే .బాధ పెడుతున్నది .అనారోగ్యమే.ఈ విషయమే ఈశ్వరుడితోచెప్పుకుంటే. “తప్పదు..ఇదంతా సాధనలో భాగమే” అన్నారట. అయినా..చలం గారు బాధలు భరించలేక ఎన్నోసార్లు బతిమాలుకున్నారు.

“నాకు సత్యం దర్శనమూ వద్దు.మోక్షమూ వద్దు..నాకు కొంచెం శాంతి నిచ్చీ..ఈ బతికే 4రోజులు హాయిగా బతక నీయండి.నేను పడవలసినది వుంటే చావు తరువాత లోకంలో పెడతాను అదంతా.బతుకంతా..నా సమస్యలతో, అనారోగ్యంతో కాలిపోయాను..చచ్చేలోపల ఈ నాలుగు రోజులన్నా నన్నుసుఖం గా చావనీయండి.” (ఆత్మకథ పే219)

చలం గారు ఇలా..బతిమాలుకున్నప్పుడు ఈశ్వరుడు ఏమన్నారో.?చూడండి.
“నీ దేహానికి ఆరోగ్యన్నిస్తాను సరే..కానీ అంతటితో నీ మనసు ఊరుకుంటుందా? సమస్యల్ని రేపుకుంటూనే వుంటుంది.బాధ పడుతోనే వుంటుంది. నీ అహం అణిగి పోవాలి.అప్పుడు గానీ శాంతి రాదు. నీ శరీరంలో వున్న రోగాలతో పాటు నీ మనసు లోని రోగొలం కూడా నయం కావాలి.అప్పటి వరకు ఈ బాధ తప్పదు.”! అన్నారు.
*అశాంతికి కారణం…అత్యాశే ..!!

“నాలోని అశాంతికి,వ్యసనానికి కారణం నాలోని అత్యాశ. నాకు అందనివి,నేను భావించు కోగలిగినవి కలలు గొప్పవి .. ఎన్నో అందాలు, ఐశ్వర్యాలుమానవాతీత అనుభవాలన్నీనిజంగా ఎక్కడో వున్నాయని నాకు తెలుసు.కాని అవి.. నాకు చిక్కులు.అందుకే ఈ బాధ అని,కావాలంటే తపస్సుచేయాలి,త్యాగాలు చేయాలని అంటున్నాయి శాస్త్రాలు.

వాటిలో నాకు విశ్వాసం లేదు.ఈ శరీరం సుఖాలని త్యజించి వుత్త జోగినైతే గానీ.. విరాగినైతే గానీ,నాకు దొరకాలంటే సౌఖ్యాలలో నమ్మకం లేదు.ఈ శరీరాన్ని అణిచివేసి విరాగినై,మొద్దు కట్టెనైతే తప్ప ఆనందాలు నాలోంచి చిగురించవు . అంటే నాకు నమ్మకం లేదు.నేను క్రమంగా వికసించాలని కాని,కాలి బూడిదనైతేనే కానీ..పునర్జీవం రాలేదంటే నేను నమ్మను.”..అంటారు చలం (ఆత్మకథ.198..)

చలం సౌందర్యాభిలాషి..మ్యూజింగ్స్ లో చలంగారు  ఏమన్నారో చూడండి…, “అవును నా వంటి వాడు సౌందర్యాలను కల్పించుకోకుం డా వుండలేడు.మనసులోని ఆ గుణం నిర్మూలమైతేనే…. గాని.కానీ నిర్మూలం ఆపడం అవసరమా? అదే మనసు లోని జీవశక్తి.దాన్ని చంపితే..మనసును చంపినట్టే”.,.ఈ భావన చలం గారిని చివరిదాకా వెంటాడింది.ఈసందిగ్థమే .. ఆయన జీవితంలో శాంతిలేకుండా చేసిందేమో?

అరుణాచలం లో చలం అనే వాడిని నశింప జెయ్యాలని ఆయన ఎంతగానో ప్రయత్నించారు.ఈ ప్రయత్నంలో చలం గారు కోరుకున్న శాశ్వతానందం ఆయనకు దొరికిందా? అంటే..జవాబు చెప్పడం కష్టమే..! హిపోక్రసీని, భౌతిక విలువల్ని,పరిత్యజించి తన జీవితంలోనూ తనలోనూ స్వేచ్ఛా,ఆనందం వెతుక్కుంటేనే కానీ.మనిషికి శాంతి దొరికదనే పాఠాన్ని చలం దగ్గర మనం నేర్చుకోవాలా? ఈ విషయంలో ఇప్పుడు మనకు చలం అవసరం వుందా? ‘ నా యత్నం సమాజాన్ని ఉద్ధరించడానికి కాదు..నన్ను నేను సంస్కరించు కోడానికి ‘ అన్న చలంగారి మాటలు ఇక్కడ మననం చేసుకోవాలి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!