కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఇదే కొత్త పార్లమెంట్ భవనం నమూనా..2022 కి సిద్ధం!

నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి ఇవాళ పునాది పడబోతోంది.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. టాటా ప్రాజెక్ట్స్ సంస్థ నిర్మించే ఈ నూతన భవనానికి రూ.971 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 93 ఏళ్ళనాటి ప్రస్తుత పార్లమెంటు భవనానికి బదులుగా ఈ నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. స్వతంత్ర భారతావని 75 వసంతాలు …

ఆ స్టోరీ చూసి ఇద్దరు నవ్వుకున్నారట !

అవును మరి…  లాజిక్ లోపించిన కథనం… ఊహాగానాలతో వండి వార్చిన ఆ స్టోరీ చదివి తెలంగాణ సీఎం కేసీఆర్ … ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లు నవ్వుకున్నారట.  “కారుకు ఫ్యాన్ గాలి “అంటూ ఆ పత్రిక రాసిన కథనం అలా ఉంది మరి. రీడర్లు మహా తెలివిగలవారు అనే విషయం మర్చిపోయి వారి చెవుల్లో పూలు …

ఆ ఇద్దరికీ ఎందుకు చెడింది ?

ఏపీ అసెంబ్లీ లో స్పీకర్ తమ్మినేని సీతారాం .. ప్రతిపక్ష నేత చంద్రబాబు ల మధ్య వాగ్యుద్ధాలు చూస్తుంటే  ఆ ఇద్దరు ఉప్పు నిప్పు లా వ్యవహరిస్తున్నారా అనిపిస్తుంది. సీతారాం ను స్పీకర్ అని కూడా చూడకుండా చంద్రబాబు వేలెత్తి చూపుతూ మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీంతో సీతారాం కూడా కొన్ని సందర్భాల్లో ఆయనపై …

సింగర్ సునీత పెళ్లి కూతురాయెనే!

ప్రముఖ గాయని సునీత వివాహం ఖరారు అయింది. డిజిటల్ మీడియా వ్యాపారంలో ఉన్న వీరపనేని రామ్ తో ఇవాళ నిశ్చితార్ధం జరిగింది.  ఈ నెల 27న వీరిరువురు పెళ్ళి చేసుకోబోతున్నారు. గత కొద్దీ రోజులుగా సునీత రెండో పెళ్లి గురించి వార్తలు ప్రచారంలో ఉన్నాయి.  చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన  సునీత …

కాంగ్రెస్ కు కాయకల్ప చికిత్స చేసేదెవరో ?

వరుస ఓటములతో కుదేలు అవుతున్న తెలంగాణా కాంగ్రెస్ కు సారధ్యం వహించేందుకు చాలామంది పోటీ పడుతున్నారు. నిజంగా అంతమంది రేసులో ఉండటం గొప్పవిషయమే. పార్టీ కోలుకుంటుందని .. పరుగులు దీస్తుందని వారంతా భావించడం మంచిదే. గ్రేటర్ ఎన్నికల్లో దారుణ ఓటమి  తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. దీంతో ఆ పదవి కోసం పోటీ మొదలయింది. పలువురు పగ్గాలు చేపట్టాలని ప్రయత్నిస్తున్నారు.  గత ఆరేడేళ్లుగా కాంగ్రెస్ వరుసగా ఎదురుదెబ్బలు …

“భజన బ్యాచ్” ను దూరంగా పెట్టండి సారూ !

అయ్యా …. సీఎం  జగన్మోహనరెడ్డి గారు …   నమస్కారం.  భజన గురించి …  ఆ భజన పర్యవసానాల గురించి అసెంబ్లీ లో మీరు ప్రదర్శించిన చంద్రబాబు గారి భజన వీడియో చూసిన తర్వాత మీతో పాటు ‘ మేము ‘ కూడా నవ్వుకున్నాం. భజన పేరుతో పాలకుడ్ని ఏ విధంగా అధమ స్థాయికి తీసుకురావొచ్చో..ప్రజల్లో ఏ …

జానా కుటుంబం బీజేపీ లో చేరుతుందా ?

గ్రేటర్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ సమీకరణాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.  కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం గా మారుతున్నబీజేపీ వైపు పలువురు నేతలు చూస్తున్నారు. అదే సమయంలో బీజేపీ ఇతర పార్టీ  నేతల పట్ల ఆకర్షణ మంత్రం ప్రయోగిస్తోంది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అకాల మరణంతో అక్కడ త్వరలో …

బీజేపీ దూకుడు మరింత పెరుగుతుందా ?

తెలంగాణ లో తెరాస కు బలమైన ప్రత్యర్థిగా బీజేపీ ఎదుగుతోంది. మొన్నటి దుబ్బాక , నిన్నటి గ్రేటర్ ఎన్నికల ఫలితాలను చూస్తే ఎవరికైనా అదే అభిప్రాయం కలుగుతుంది. గతంలో నాలుగు సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో దాదాపు 50 స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీ ఆస్థాయిలో పుంజుకున్నదంటే ముందుముందు తెరాసకు  ప్రత్యామ్నాయంగా …

రజనీ ఆధ్యాత్మిక రాజకీయాలను ఆదరిస్తారా ?

కొన్నేళ్ళుగా ఊరిస్తూ వచ్చిన  సౌత్ ఇండియా సూపర్ స్టార్  రజనీ కాంత్ ఎట్టకేలకు పొలిటికల్ ఎంట్రీ ఖాయమని తేల్చేసిన నేపథ్యంలో  తమిళ ప్రజలు ఆయనను  ఎంతవరకు ఆదరిస్తారా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.  తమ పార్టీ కుల మతాలకు అతీతమైనదని, “ఆధ్యాత్మిక” రాజకీయాల” తో ముందుకు సాగుతుందని రజని ప్రకటించారు. కులమతాలకు …
error: Content is protected !!