కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

జానా కుటుంబం బీజేపీ లో చేరుతుందా ?

గ్రేటర్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ సమీకరణాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.  కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం గా మారుతున్నబీజేపీ వైపు పలువురు నేతలు చూస్తున్నారు. అదే సమయంలో బీజేపీ ఇతర పార్టీ  నేతల పట్ల ఆకర్షణ మంత్రం ప్రయోగిస్తోంది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అకాల మరణంతో అక్కడ త్వరలో …

బీజేపీ దూకుడు మరింత పెరుగుతుందా ?

తెలంగాణ లో తెరాస కు బలమైన ప్రత్యర్థిగా బీజేపీ ఎదుగుతోంది. మొన్నటి దుబ్బాక , నిన్నటి గ్రేటర్ ఎన్నికల ఫలితాలను చూస్తే ఎవరికైనా అదే అభిప్రాయం కలుగుతుంది. గతంలో నాలుగు సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో దాదాపు 50 స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీ ఆస్థాయిలో పుంజుకున్నదంటే ముందుముందు తెరాసకు  ప్రత్యామ్నాయంగా …

రజనీ ఆధ్యాత్మిక రాజకీయాలను ఆదరిస్తారా ?

కొన్నేళ్ళుగా ఊరిస్తూ వచ్చిన  సౌత్ ఇండియా సూపర్ స్టార్  రజనీ కాంత్ ఎట్టకేలకు పొలిటికల్ ఎంట్రీ ఖాయమని తేల్చేసిన నేపథ్యంలో  తమిళ ప్రజలు ఆయనను  ఎంతవరకు ఆదరిస్తారా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.  తమ పార్టీ కుల మతాలకు అతీతమైనదని, “ఆధ్యాత్మిక” రాజకీయాల” తో ముందుకు సాగుతుందని రజని ప్రకటించారు. కులమతాలకు …

ఆయన దూకుడు పట్ల అటు పొగడ్తలు..ఇటు విమర్శలు !

ముందెన్నడూ లేని విధంగా ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీ లో దూకుడుగా వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ వర్గాల్లో ఆనందం వ్యక్తమౌతోంది. ఆయన అభిమానులైతే సంబరపడుతున్నారు. చంద్రబాబు ఇదే శైలి లో వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ దే  విజయమని చెప్పుకుంటున్నారు. నేతల తీరుని బట్టీ కార్యకర్తలు కూడా దూసుకుపోతుంటారు. ఏపార్టీలో అయినా …

ఓటర్లను విమర్శించే అర్హత ఛానళ్లకుందా?

జి హెచ్ ఏం సి … ఎన్నికల నేపథ్యంలో  కొన్ని టీవీ ఛానెళ్లు ఓటు వేయ‌డానికి ఆసక్తి చూపని వారి మీద అనుచిత‌మైన వ్యాఖ్య‌లు చేశాయి. రాజకీయ నాయ‌కుల కంటే ఘోరంగా మాట్లాడాయి. ఓటు వేయ‌ని ద‌ద్ద‌మ్మ‌లు, పోలింగ్‌కి దూరంగా వున్న చ‌వ‌ట‌లు, సెల‌వు ఎంజాయ్ చేశారు కానీ ఓటేయ‌డానికి రాలేని స‌న్నాసులు, బ‌ద్ధ‌క‌జీవులు … అంటూ …

చిన్నమ్మ మళ్ళీ చిటికెలు వేస్తుందా ?

జయలలిత నెచ్చెలి  శశికళ  కొద్దీ రోజుల్లో జైలునుంచి విడుదల కాబోతోంది.  ఇటీవలే జరిమానా మొత్తం రూ.10కోట్ల 10 వేలు చెల్లించడంతో చిన్నమ్మ విడుదలకు మార్గం సుగమమయింది. శశికళ జైలునుంచి వచ్చాక సైలెంట్ గా ఉంటారా ? మళ్ళీ రాజకీయాల్లోకి  వస్తారా ? లేదా అనేది ఇంకా సస్పెన్సుగా నే ఉంది.  2017 లో శశికళ కర్ణాటక …

మైలారం గుట్టల్లో ఆదిమానవుల ఆనవాళ్లు ! 

Sheik Sadiq Ali …………..  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలారం సమీపంలోని నల్లగుట్టలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇక్కడ వెలసిన  సున్నపు గుహలు తెలంగాణా మరెక్కడా కనిపించవు.  ప్రాచీన శిలాయుగానికి చెందిన అనేక రాతి పనిముట్ల ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ గుట్టలు ఒకనాటి ఆదిమానవుల ఆవాసమే అని చరిత్రకారులు భావిస్తున్నారు. భూమికి 300 అడుగుల …

అయినా.. మనిషి మారలేదు .. కాంక్ష తీరలేదు!!

ఎన్నికల ఫలితాలు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినప్పటికీ …ఓడిపోయానని స్పష్టం గా తేలినప్పటికీ  అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ వైఖరిలో మార్పురావడం లేదు. ఎలాగైనా జో బైడెన్ కు అడ్డం పడాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రంప్ వ్యవహార శైలి పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఆయన బేఖాతర్ చేస్తున్నారు. మరోపక్క మూడు మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి  కోర్టుల్లో రీకౌంటింగ్ చేపట్టాలని వేసిన కేసుల వలన మళ్ళీ కౌంటింగ్ జరిగింది. ఫలితాలు చూస్తే బైడెన్ మెజారిటీ మరింత …

తెర వెనుక సణుగుడు ఇదే !

సినిమా కళాకారులు ముఖ్యమంత్రిని కలిసారు.అబ్బో బ్రహ్మండమైన వార్త.ఇంకేం ప్రజలకు మంచి జరగబోతుంది.వాళ్ళు లోపలకు వెళ్ళి నాలుగు ఫొటోలు తీసుకోని తర్వాత తీరికగా తమ కష్టాలు వెళ్ళబుచ్చుతారు.తమకు తినటానికి కూడా తిండి లేదని,కనుక తమ చేతిలో ఉన్న కనీసం వందకు పైగా ధియేటర్లకు కరెంట్ ఛార్జీలు మాఫీ చేయాలని కోరతారు.  టికెట్ ధరల పెంపు కోసం అనుమతి అడుగుతారు. 24 …
error: Content is protected !!