అలాంటి ట్రెండ్ సెట్టర్ ను ‘వర్మ’ మళ్లీ తీయగలరా ?

Sharing is Caring...

 A trend setter…………………

ప్రముఖ దర్శకుడు  రాం గోపాలవర్మ “శివ” సినిమా గురించి తెలియని వారు ఉండరు. “శివ ” సినిమా ద్వారా వర్మ తన ఉనికిని ప్రపంచానికి చాటారు. దర్శకుడిగా మొదటి సినిమాతో విజయం సాధించారు.వర్మ దర్శకుడు అయ్యేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.శివ సినిమాలో కాలేజీ నేపథ్యంలో హింసాత్మక కథను చొప్పించి నిర్మించారు.

ఎటువంటి ఆధారం, శిక్షణ, సహాయ సహకారాలు లేకుండా, 28 ఏళ్ల వయసులో తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగార్జునను ఈ చిత్ర నిర్మాణానికి ఒప్పించగలిగారు. ఆయన కథ చెప్పిన విధానం నచ్చి నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మించారు.

‘శివ’ చిత్రం విడుదలై ముప్పయి ఐదేళ్లు దాటింది. 75 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ సినిమా అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. వర్మ హిందీ భాషలో కూడా ఈ చిత్రాన్ని అదే పేరుతో తీశారు.

కానీ తెలుగులో సాధించినంత విజయాన్ని హిందీలో సాధించలేదు.తమిళంలో ‘ఉదయం’గా డబ్ అయింది. ‘శివ’ సినిమా హీరో నాగార్జునకు స్టార్ హీరో స్టేటస్ అందించింది. ఈ సినిమాతో నాగార్జున టాలీవుడ్ టాప్ హీరో అయ్యారు.

అప్పట్లో ‘శివ’ ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.’శివ’ సినిమా ఆరు కేంద్రాల్లో యేడాది పైగా నడిచి రికార్డు సృష్టించింది. 22 కేంద్రాల్లో 100 రోజులుకు పైగా నడిచింది.తనికెళ్ళ భరణి ఈ సినిమాకు మాటలు రాశారు.. ఒక పాత్ర కూడా పోషించారు. రామ్ గోపాల్ వర్మ కథ, స్క్రీన్ ప్లే తయారు చేశారు 

అప్పట్లో అంత సంచలనం సృష్టించిన ఈ సినిమాలో సన్నివేశాలు చాలావరకు వేరే సినిమాల్లో నుంచి తీసుకొచ్చి పెట్టినవే.అంటే ఆయా సన్నివేశాలనుంచి వర్మ స్ఫూర్తి పొందారనుకోవాలి. ‘శివ’ స్టోరీ లైన్ బ్రూస్లీ సినిమా ‘రిటర్న్ అఫ్ ది డ్రాగన్’ నుంచి తీసుకున్నారు.

బ్రూస్లీ హాంకాంగ్ నుంచి రోమ్ కు వచ్చి అక్కడ చైనా రెస్టారెంట్ లో పనిచేయడం, లోకల్ గూండాలు రెస్టారెంట్ యజమానిని వేధించడం .. బ్రూస్లీ వారితో పోరాడి రెస్టారెంట్ యజమానిని కాపాడటం , ఆ పోరాటం అలా సాగుతూ చివరికి ప్రధాన ప్రత్యర్థి చక్నారిస్ తో కలోజియంలో ఒంటరిగా ఫైట్ చేయడం వంటి సన్నివేశాలను వర్మ తెలివిగా ‘శివ’ కథలో వాడుకున్నారు.

‘శివ’లో నాగార్జున  కాలేజీలో చేరడం, తోటి విద్యార్థులను గూండాలు వేధించడం … ‘శివ’ ఆ గ్రూప్ లోని ఒక్కొక్కరితో పోట్లాటకు దిగడం . కాలేజీని కాపాడటం .. చివరకు ప్రధాన ప్రత్యర్థి రఘువరన్ తో బిల్డింగ్ టెర్రేస్ పై ఒంటరిగా ఫైట్ చేయడం .. సేమ్ తో సేమ్ బ్యాక్ గ్రౌండ్ మార్చి కథ తయారు చేశారు.

అలాగే గణేష్ చందా సీన్ ను దిలీప్ శంకర్ ‘కాలచక్ర’ నుంచి ఒక పాటకు ముందు అమల నాగార్జునకు కాఫీ ఇచ్చే సీన్ ను సంజీవ్ కుమార్ నటించిన సినిమానుంచి, సైకిల్ చేజ్ సీన్ రాహుల్ రవైల్ ‘అర్జున’ నుంచి, మరణించిన స్నేహితుడి తల్లి ఇన్ స్పెక్టర్ ను చెంప మీద కొట్టే దృశ్యం స్టీవెన్ స్పీల్బర్గ్  ‘జాస్’ నుంచి లాగేసారు.

తమాషా ఏమిటంటే ఈ సన్నివేశాలని ఎవరూ పసిగట్టలేదు. సినిమా సూపర్ హిట్ అయింది. వర్మ గొప్ప డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. శివ సినిమా వివిధ సినిమాలకు స్ఫూర్తి అని ఒకరు అరా పసిగట్టినా బయట ఎక్కడ చెప్పినట్టు లేరు. 

ఈ విషయాలను వర్మే స్వయంగా ‘నా ఇష్టం’ పుస్తకం లో రాసుకున్నారు.అలాగే ఓకే వీడియో లో చెప్పారు. అలా నిజం ఒప్పుకోవడం కూడా గొప్పేకదా. అదీసంగతి.

——————–KNM

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!