“గాయత్రీ”తో కరోనా ను జయించవచ్చా ?  

Sharing is Caring...

గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా కరోనా వ్యాధి నుంచి త్వరగా కోలుకోవచ్చా?లేదా ? అనే అంశాన్ని తేల్చేందుకు ఎయిమ్స్(రిషికేష్ ) శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం నిర్వహిస్తున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్అండ్ టెక్నాలజీ ఈ అధ్యయనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఈ మేరకు  జాతీయ మీడియాలో వార్తాకథనాలు వస్తున్నాయి. ఈ అధ్యయనం కోసం మొత్తం 20 రోగులను ఎంపిక చేశారు.వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒకటో గ్రూప్ కు ఆధునిక వైద్య చికిత్సలు అందిస్తూ … గాయత్రీ .. ప్రాణాయామం చేయిస్తారు. రెండో గ్రూప్ కు కేవలం ఆధునిక చికిత్స మాత్రమే అందిస్తారు. 14 రోజుల పాటు  ఈ రెండు గ్రూప్ లు ఎయిమ్స్ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఉంటాయి. ఈ అధ్యయనం వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, మంత్రం, ప్రాణాయామం కరోనా ను తగ్గిస్తుందా ? కేవలం  సాంప్రదాయక చికిత్స మాత్రమే  రోగులను కరోనా నుంచి బాగుచేయగలదా ? తెలుసుకోవడం కోసమే అంటున్నారు.  ఒకటో గ్రూప్ ఉదయం సాయంత్రం గాయత్రి , ప్రాణాయామం గంట చొప్పున చేస్తారు. 14 రోజుల తర్వాత ఈ రెండు గ్రూప్ ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. అలాగే పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే అధ్యయనం మొదలయిందని సమాచారం.

ఇక గాయత్రి మంత్రాన్ని హిందువులు పరమ పవిత్ర మంత్రంగా  భావిస్తారనే విషయం తెలిసిందే. మూడు సార్లు ప్రాణాయామం ఆచరించి గాయత్రీ మంత్రం పఠిస్తారు . మంత్రాన్ని పైకి వినిపించేలా కాకుండా మనసులోనే జపిస్తారు. గాయత్రి మంత్రం వలన శ్వాస మెరుగుపడుతుంది. హృదయ స్పందన ను ఈ మంత్రం క్రమబద్దీకరిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. మనసుకు శక్తి వస్తుంది.మంత్రాన్ని ఒక పద్ధతి ప్రకారం జపిస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మన పూర్వీకులు ఎపుడో చెప్పారు. అందుకే గాయత్రిని మించిన మంత్రం లేదంటారు. ఆది శంకరాచార్యులు వారు మంత్ర ప్రాధాన్యతను వివరిస్తూ  “గయాన్ త్రాయతే ఇతి గాయత్రి ” అన్నారు. గయలు అంటే ప్రాణాలు అని అర్ధం .. త్రాయతే అంటే కాపాడమని భావం. ప్రాణాలను రక్షించే మంత్రం గాయత్రి మంత్రమని శంకరాచార్యులవారి భాష్యం.ఇక గాయత్రి మంత్రం పై ఎన్నో పరిశోధనలు జరిగాయి. జరుగుతున్నాయి. గాయత్రి మంత్రాన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తే శరీరం లోని 72 వేల నాడులు  ఉత్తేజితమవుతాయి. జపించే పద్దతిని తెలుసుకుని నిత్యం గాయత్రి జపం చేస్తే సత్ఫలితాలు ఉంటాయి. ఎయిమ్స్ శాస్త్రవేత్తలు ఈ సత్యాన్ని తెలుసుకున్నారు కాబట్టే  ఈ అధ్యయనం చేస్తున్నారని  హిందూ పండితులు అంటున్నారు. 

————K.N.MURHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!