ఆయనొకలా అనుకుంటే …పార్టీ మరోలా అనుకుంది !!

Sharing is Caring...

బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తికి బీజేపీ టిక్కెట్ దక్కలేదు.అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని ఆశపడిన మిదున్ చక్రవర్తికి నిరాశే మిగిలింది. మిథున్‌ ఇటీవలే బీజేపీలో చేరారు. మీడియా మిథున్‌ చక్రవర్తే కాబోయే సీఎం అభ్యర్థి అని ఊదరగొట్టింది.కానీ పార్టీ మాత్రం టిక్కెట్ ఇవ్వలేదు. కొద్దీ రోజుల క్రితమే మిథున్ ‌ ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో పార్టీలో చేరారు. స్టార్ క్యాంపైనర్ గా కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేశారు. రాస్ బిహారీ స్థానం నుంచి  పోటీ చేయవచ్చని అందరూ భావించారు. తుది జాబితా వరకు ఆ సీటు ఎవరికి కేటాయించలేదు. దీంతో  మిథున్ కోసమే ఖాళీగా ఉంచారని అనుకున్నారు. మంగళవారం వెలువడిన తుది జాబితాలో మిథున్ పేరు లేదు. ఆ సీటును రిటైర్డ్  లెఫ్టినెంట్ జనరల్ సుబ్రతా సాహా కు కేటాయించారు. ఈ పరిణామం తో  మిథున్ చక్రవర్తి ఇక ప్రచారానికే పరిమితం కానున్నారు. కొద్దీరోజుల క్రితమే మిథున్ చక్రవర్తికి కేంద్రం వై ప్లస్ భద్రతను కల్పించింది.
కాగా మిథున్ చక్రవర్తి రాజకీయాలకు కొత్త వాడేమి కాదు. గతంలో కొంత కాలం  మిథున్ కమ్యూనిస్టు పార్టీలతో కూడా కలసి పనిచేశారు. తర్వాత కాలంలో తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. దీదీ  మిథున్ చక్రవర్తి ని 2014 లో రాజ్యసభకు పంపారు. ఆ తర్వాత తృణమూల్ తరపున ఎన్నికల ప్రచారం కూడా చేశారు. రెండేళ్లు ఎంపీగా చేసిన మిథున్ 2016 లో ఎంపీ పదవికి రాజీనామా చేసారు.శారదా కుంభకోణం తర్వాత ఆయన పదవికి రాజీనామా చేశారు. శారదా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా చేశారు. ఈ క్రమంలోనే ఈడీ మిథున్ని కూడా ప్రశ్నించింది. అప్పటి నుంచి మిథున్ చక్రవర్తి తృణమూల్ పార్టీకి దూరంగా ఉంటున్నారు.  

డిస్కో డాన్సర్ సినిమా తో దేశవ్యాప్తం గా పరిచయమైన  మిథున్ సినిమా రంగంలో గణనీయమైన విజయాలే సాధించారు.80 వ దశకంలోడిస్కో డాన్సర్ సృష్టించిన సంచలనం అంత ఇంతా కాదు. తహదర్ కథ(92) , స్వామి వివేకానంద (98) వంటి చిత్రాలలో నటించి జాతీయ పురస్కారాలు కూడా అందుకున్నారు. మిథున్ గౌరంగ్ చక్రవర్తి. తూర్పు బెంగాల్ లోని బరిసలల్ లో జన్మించారు. ఇపుడు ఆ ప్రాంతం బంగ్లాదేశ్ లో ఉంది.  మిథున్  అసలు పేరు మొదటి సినిమా మృగయా. ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ దర్శకత్వం వహించారు.1976 లో విడుదలైన ఈ సినిమా మిథున్ కు జాతీయ అవార్డును తెచ్చి పెట్టింది.జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలెట్టిన  మిథున్  ఎన్నో కస్టాలు పడి స్టార్డం అందుకున్నారు. దాదాపు 350 సినిమాల్లో ఆయన నటించారు. ఎన్నో అవార్డులు రివార్డులు సాధించారు. నటి యోగితాబాలి ని పెళ్లి చేసుకున్నారు. అన్నట్టు ఆయన కుమారుడు  మిమో చక్రవర్తి కూడా నటుడే . 

———–K.N.MURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!