డేటింగ్ యాప్ జోలికెళితే .. అంతే సంగతులు !

Sharing is Caring...

Fake Apps ………………………………………………..

ప్రపంచ వ్యాప్తంగా కొన్నివేల డేటింగ్ యాప్స్ ఉన్నాయి. వీటిలో అధిక భాగం నకిలీవే. ఏదో ఆశించి వీటి జోలికెళ్ళామో .. అంతే సంగతులు. మనల్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుతారు. ఎంతోమంది ఇలాంటి యాప్ లింక్ నొక్కి ఇరుక్కుపోతున్నారు. అలాంటి డేటింగ్ యాప్ లింక్ నొక్కిన పాపం ఓ ప్రైవేటు ఉద్యోగిని రెండేళ్ల పాటు వెంటాడింది.

మాటలతో నమ్మించి అతగాడి నగ్న చిత్రాలు సేకరించిన సైబర్ నేరగాళ్లు అతగాడి నుంచి రూ. 2. 18 లక్షలు గుంజారు. వ్యభిచార వెబ్ సైట్లలో అతని ఫోన్ నంబరు ఉంచారు. దీంతో అతగాడికి ఫోన్లు రావడం మొదలైంది. వెంటనే బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేశారు.

మియాపూర్‌లో ఉండే బాధితుడు 2020 ఆగస్టులో ఆన్లైన్ లో ‘లొకాంటో’ పేరుతో ఉన్న డేటింగ్ యాప్ లింకు నొక్కాడు. సైబర్ నేరగాళ్లు అతగాడితో చాటింగ్ ప్రారంభించారు. శృతి, మోక్ష పేర్లతో మభ్య పెట్టి నగ్నచిత్రాలు సేకరించి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు.

అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నగ్నచిత్రాల స్క్రీన్ షాట్లు భార్య, కుటుంబ సభ్యులు, బంధువులకు పంపిస్తామని, నేరుగా ఇంటికొస్తామంటూ ఫోన్లు చేసి బెదిరించారు.కుటుంబాన్ని చంపేస్తామంటూ భయపెట్టారు. ప్రతిసారీ కొత్త నంబరు నుంచి ఆ నేరగాళ్లు ఫోన్ చేసేవారు.దాదాపు వంద వేరువేరు నంబర్లతో వేధించారు.

అతని ఇన్ స్టాగ్రామ్ ఖాతాను హ్యాక్ చేసి స్నేహితుల ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు సేకరించి వారికి అతగాడి వ్యక్తిగత సమాచారాన్ని పంపారు. అంతటితో ఆగకుండా ఫోన్ నంబరును వ్యభిచారానికి సంబంధించిన వెబ్ సైట్లలో ఉంచారు.

దీంతో ఫోన్లు పెరిగాయి. నేరగాళ్ల వేధింపులు భరించలేక గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్, బ్యాంకు ఖాతాల ద్వారా మూడు దఫాలుగా మొత్తం రూ.2. 18 లక్షలు అతగాడి నుంచి గుంజారు. ఇలాంటి బాధితులు ఎంతోమంది ఉన్నారు. అయినా నేరగాళ్ల ఉచ్చులో కొత్త వాళ్ళు చిక్కుకుంటున్నారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!