అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
పై ఫొటోలో కనిపించే సునీల్ మిట్టల్ సామాన్యుడు కాదు.ఇవాళ మనం మొబైల్ ఫోన్లు మాట్లాడటానికి ఆద్యులలో ఈయన ఒకరు. ఎయిర్ టెల్ బ్రాండ్ ఈయనదే. ఎయిర్ టెల్ బ్రాండ్ ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి .. మొబైల్ ఫోన్లు లక్షల సంఖ్యలో పెరగడానికి దోహద పడింది ఈ మిట్టలే. ఎయిర్ టెల్ వచ్చాకనే.. ఆయన …
స్టాక్‌మార్కెట్లు పతన దిశగా పయనిస్తున్నాయి. సెన్సెక్స్ నిన్న1,939 పాయింట్లు ( 3.80 శాతం)నష్టపోయి 49,099.99 పాయింట్ల వద్ద ముగిసింది.నిఫ్టీ 568 పాయింట్లు (3.76 శాతం )నష్టపోయి 14,529.15 పాయింట్ల వద్ద ముగిసింది.గత పదినెలల కాలంలో ఇది భారీ పతనం అని విశ్లేషకులు చెబుతున్నారు ఈ పతనం మరికొద్ది రోజులు కొనసాగవచ్చుఅంటున్నారు. కొంతకాలం బేరిష్ దశలోనే మార్కెట్ …
పినరయి విజయన్ సుదీర్ఘ అనుభవం గల కమ్యూనిస్ట్ యోధుడు. ఈయన నాయకత్వం లోనే ఇపుడు కేరళ ప్రభుత్వం నడుస్తోంది. కన్నూర్ జిల్లాలోని పేద కుటుంబంలో విజయన్ జన్మించారు. పెరాలస్సెరీ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు.1964వ సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో చేరక ముందే విద్యార్థి సంఘ నాయకునిగానే రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు. జిల్లా …
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి లోనారాయణ స్వామి నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోవడం తో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పటికి అక్కడ 7 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. అన్నిసార్లు రాజకీయ సంక్షోభమే కారణంగా రాష్ట్రపతి పాలన వచ్చింది. రాబోయే మే నెల వరకు అక్కడ రాష్ట్రపతి పాలన ఉంటుంది. మే …
సాధారణంగా అసెంబ్లీలలో ప్రజా సమస్యలపై ఎక్కువగా చర్చలు జరుగుతాయి. లేదంటే ఏదో అంశంపై గొడవ పడటం .. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మామూలే. దేశ వ్యాప్తంగా ఏ అసెంబ్లీ ని చూసినా ఇదే తరహాలో ఉంటుంది. అలాంటిది అనూహ్యంగా రాజస్థాన్ అసెంబ్లీలో దెయ్యాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. సరిగ్గా మూడేళ్ళ క్రితం ఈ చర్చ …
Paresh Turlapati …………………… ” సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట. ” ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి . ” ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి ” మనం ప్రధానమంత్రి …
ఏపీ బీజేపీ పంచాయితీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. వైసీపీ ని ఓడించి రాబోయే కాలంలో అధికారంలోకి వస్తామని పదేపదే చెబుతున్న ఆ ఆ పార్టీ నేతలకు ఓటర్లు షాక్ ఇచ్చారు. కరెక్టుగా ఇన్ని పంచాయితీలు వచ్చాయని కూడా ఆ పార్టీ నేతలు చెప్పుకోలేకపోతున్నారు. సరిగ్గా ఎన్నికల సమయానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు …
News Leaks………………………….. రాజకీయాల్లో, వార్తల ప్రచురణలోనూ అపుడపుడు కొన్ని తమాషాలు జరుగుతుంటాయి. రాజకీయ నాయకులు కొన్ని వార్తలను కావాలనే తమ సన్నిహితుల ద్వారా లీక్ చేయిస్తుంటారు. విషయ ప్రాధాన్యతను బట్టి ఆ వార్తలు సంచలనంగా మారుతుంటాయి. వాటిపై ఇతర పార్టీలు కూడా స్పందిస్తుంటాయి. ఒక్కోసారి లీక్ ఇప్పించినవారే అదేమీ లేదు అని కూడా ఖండిస్తుంటారు. సహజంగా …
తెలంగాణ లో డాక్టర్ చెరుకు సుధాకర్ పేరు తెలియని వారు లేరంటే ఆశ్చర్యపోనవసరం లేదు. తెలంగాణ ఉద్యమ సారథుల్లో ఆయన ప్రముఖుడు. బాల్యం నుంచే సుధాకర్ పోరాటాల బాట పట్టారు. వృత్తిపరంగా డాక్టర్ అయినప్పటికీ డబ్బుల కోసం ఆయన ఏనాడు పని చేయలేదు. బడుగు,బలహీన వర్గాల సంక్షేమం కోసం ఉద్యమ బాటలో పయనించారు. బహుజన తెలంగాణా …
error: Content is protected !!