అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

మౌన వ్యూహంలో మర్మం ఏమిటో ?

‘పయ్యావుల కేశవ్’ కు చురుకైన నాయకుడని పేరుంది . కానీ గత కొంత కాలంగా ఆయన మౌనంగా ఉంటున్నారు.  ఆ మద్య బీజేపీ లో చేరబోయి మళ్ళీ వెనుకడుగు వేశారని కూడా అంటారు. గత ఎన్నికల్లో  టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల‌లో కేశవ్ ఒక‌రు. 2019లో వైసీపీ గాలులు వీచినప్పటికీ తట్టుకుని ఉరవకొండ …

చూడాల్సిన క్షేత్రం ‘ఘటిక సిద్ధేశ్వరం’ !     

అత్యంత ప్రాచీన శైవక్షేత్రాల్లో ఘటిక సిద్దేశ్వరం ఒకటి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి పూర్వం ఇక్కడ ఆలయం వెలసినట్లు స్థల పురాణం చెబుతోంది. సప్త రుషులలో ఒకరైన అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేసి ఉమామహేశ్వరుల కల్యాణం జరిపినట్లు నిత్యనాథసిద్ధాచార్యులు రసరత్నాకర గ్రంథంలో పేర్కొన్నట్టు చెబుతారు.ఇక్కడి  శివుడు సిద్దేశ్వరునిగా, అమ్మవారు ఇష్టకామేశ్వరిగా కొలువై వున్నారు. …

ఎవరీ స్టిల్స్ భూషణుడు ?

డ్రీమ్ గాళ్ హేమమాలిని, గ్లామర్ స్టార్ కాంచన, అభినేత్రి వాణిశ్రీ ఇలా అనేక మంది తారల తొలి మేకప్ స్టిల్స్ తీసిన ఖ్యాతి గొల్లపల్లి నాగ భూషణరావు అలియాస్ స్టిల్స్ భూషణ్ ది.   బాపు తీసిన దాదాపు అన్ని సినిమాలకూ భూషణే స్టిల్ ఫొటోగ్రాఫర్. ఏవో చిన్న అభిప్రాయబేదాలతో సంపూర్ణ రామాయణం మరింకేదో సినిమాకు ఆయన పనిచేయలేదు. తప్ప …

మందు బాబులను మించిన విశ్లేషకులు లేరబ్బా!

ఉన్నట్లుండి పొద్దున్నే వర్షం మొదలైంది. రైతు బజారు నుంచి వస్తుండగా ఊహించని వాన ఊపందుకుంది. కనీసం గొడుగైనా చేతిలో లేకపోవడంతో గబాలున ఎదురుగా కనిపించిన ఆటో స్టాండు దగ్గరకు పరుగెత్తాను. వరుసగా పదికి పైగా ఆటోలు పార్క్ చేసున్నాయి. అందరు ఆటో డ్రైవర్లూ కలిపి రెండు ఆటోల్లో సర్దుకుని మాటా మంతీ ఆడుతున్నారు. సరిగ్గా వారి …

అధినేత్రి నిర్ణయాల వెనుక సలహాలు ఆయనవే !

అహ్మద్ పటేల్ ..కాంగ్రెస్ నేతల్లో ఆయన తెలియని వారుండరు. అందరూ ఆయనను  అహ్మద్ భాయి అని పిలుస్తారు. ఇందిరా, రాజీవ్,సోనియా,రాహుల్ గాంధీ లకు ఆయనే సలహాదారుడిగా పనిచేశారు. గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకమైన వ్యక్తి. ఇబ్బందుల్లో ఉన్న సమయాల్లో ఆయన వ్యూహాలే పార్టీ ని ముందుకు నడిపించాయి. గుజరాత్ కి చెందిన అహ్మద్ పటేల్ గాంధీ …

బరిలో నిలిచేదెవరో ? ఓడేదెవరో ?

తిరుపతి లోకసభ స్థానానికి ఉప ఎన్నిక ఎపుడు జరిగేది అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ రాజకీయ పార్టీలు  పోటీకి సిద్ధమౌతున్నాయి.వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో ఈ ఉప ఎన్నిక జరగనుంది. 2021 ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నిక జరగవచ్చుఅంటున్నారు.ఈ ఉప ఎన్నికలో జనసేన పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోందని ప్రచారం జరుగుతోంది. అందుకే పవన్ …

సామాన్యులను బాదేస్తారు … సంపన్నులను వదిలేస్తారు !

విల్‌ఫుల్‌ డిఫాల్టర్ల (ఉద్దేశపూర్వకంగా రుణాలు తీసుకుని ఎగవేసిన వారు)పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఈ నాటివి కావు. ఎవరు ఎన్ని విమర్శించినా ప్రభుత్వ తీరులో, అధికార యంత్రాంగం లో మార్పు లేదు.  తీసుకున్న అప్పులు తిరిగి తీర్చలేకపోయినందుకు న్యాయమైన కారణాలుంటే పోనీలే అనుకోవచ్చు. కానీ విల్‌ఫుల్‌ డిఫాల్టర్లపై మాత్రం కఠిన చర్యలు …

ఈయన మరో అమర శిల్పి జక్కన్న !

పై ఫోటోలో కనిపిస్తున్న ప్రముఖుని పేరు S.M.గణపతి స్థపతి.ఈ అమర శిల్పి గురించి ఈ తరం వారిలో  చాలామందికి తెల్సి ఉండక పోవచ్చు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఉన్న కళాకారుల విగ్రహాలు, హుస్సేన్‌సాగర్ ‌లోని బుద్ధవిగ్రహన్ని రూపొందించింది ఈ ప్రముఖుడే. కఠిన శిలలను సైతం ఆకర్షణీయమైన రూప లావణ్యంతో అద్భుత కళాఖండాలుగా తీర్చిదిద్దడంలో గణపతి స్థపతికి తిరుగులేదు. …

ఆ మంచు పర్వతం ఢీ కొంటే ??

అట్లాంటిక్  సముద్రంలోనే  మూడేళ్లుగా గిరగిరా తిరుగుతున్న మంచుకొండ దగ్గరలోని ఒక దీవిని ఢీకొట్టే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ మంచుకొండ ప్రయాణిస్తున్న మార్గాన్ని అంచనా వేసిన పరిశోధకులు అది ఖచ్చితంగా జార్జియా ద్వీపం వైపు దూసుకెళ్తున్నదని అంటున్నారు. ఆ మంచుకొండను  A 68 A  పేరుతో పిలుస్తున్నారు. ఈ మంచు పర్వతం చాలాకాలం క్రితం దక్షిణ ధృవంలోని  అంటార్కిటికా మంచుఖండం నుంచి వేరయింది. ఒకప్పుడు అది ఇపుడున్న సైజు కంటే పెద్దగా ఉండేది. కాలక్రమంలో ఈ మంచుకొండ మూడు …
error: Content is protected !!