అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
ముందెన్నడూ లేని విధంగా ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీ లో దూకుడుగా వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ వర్గాల్లో ఆనందం వ్యక్తమౌతోంది. ఆయన అభిమానులైతే సంబరపడుతున్నారు. చంద్రబాబు ఇదే శైలి లో వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ దే విజయమని చెప్పుకుంటున్నారు. నేతల తీరుని బట్టీ కార్యకర్తలు కూడా దూసుకుపోతుంటారు. ఏపార్టీలో అయినా …
కొవిడ్-19 నేపథ్యంలో మామూలుగా తిరిగే రైళ్లను నిలిపివేసి ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్ల పేరిట ప్రయాణీకులనుంచి అధిక చార్జీలను వసూలు చేస్తోంది. దాదాపు ఓ వంద మేరకు ఇలా ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ప్రత్యేక రైళ్లు నడుపుతున్న రైల్వే మామూలు రైళ్లను ఎందుకు నడపదో అర్ధం కానీ విషయం. కోవిడ్ …
జి హెచ్ ఏం సి … ఎన్నికల నేపథ్యంలో కొన్ని టీవీ ఛానెళ్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపని వారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశాయి. రాజకీయ నాయకుల కంటే ఘోరంగా మాట్లాడాయి. ఓటు వేయని దద్దమ్మలు, పోలింగ్‌కి దూరంగా వున్న చవటలు, సెలవు ఎంజాయ్ చేశారు కానీ ఓటేయడానికి రాలేని సన్నాసులు, బద్ధకజీవులు … అంటూ …
జయలలిత నెచ్చెలి శశికళ కొద్దీ రోజుల్లో జైలునుంచి విడుదల కాబోతోంది. ఇటీవలే జరిమానా మొత్తం రూ.10కోట్ల 10 వేలు చెల్లించడంతో చిన్నమ్మ విడుదలకు మార్గం సుగమమయింది. శశికళ జైలునుంచి వచ్చాక సైలెంట్ గా ఉంటారా ? మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా ? లేదా అనేది ఇంకా సస్పెన్సుగా నే ఉంది. 2017 లో శశికళ కర్ణాటక …
Sheik Sadiq Ali ………….. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలారం సమీపంలోని నల్లగుట్టలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇక్కడ వెలసిన సున్నపు గుహలు తెలంగాణా మరెక్కడా కనిపించవు. ప్రాచీన శిలాయుగానికి చెందిన అనేక రాతి పనిముట్ల ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ గుట్టలు ఒకనాటి ఆదిమానవుల ఆవాసమే అని చరిత్రకారులు భావిస్తున్నారు. భూమికి 300 అడుగుల …
ఎన్నికల ఫలితాలు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినప్పటికీ …ఓడిపోయానని స్పష్టం గా తేలినప్పటికీ అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ వైఖరిలో మార్పురావడం లేదు. ఎలాగైనా జో బైడెన్ కు అడ్డం పడాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రంప్ వ్యవహార శైలి పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఆయన బేఖాతర్ చేస్తున్నారు. మరోపక్క మూడు మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి కోర్టుల్లో రీకౌంటింగ్ చేపట్టాలని వేసిన కేసుల వలన మళ్ళీ కౌంటింగ్ జరిగింది. ఫలితాలు చూస్తే బైడెన్ మెజారిటీ మరింత …
సినిమా కళాకారులు ముఖ్యమంత్రిని కలిసారు.అబ్బో బ్రహ్మండమైన వార్త.ఇంకేం ప్రజలకు మంచి జరగబోతుంది.వాళ్ళు లోపలకు వెళ్ళి నాలుగు ఫొటోలు తీసుకోని తర్వాత తీరికగా తమ కష్టాలు వెళ్ళబుచ్చుతారు.తమకు తినటానికి కూడా తిండి లేదని,కనుక తమ చేతిలో ఉన్న కనీసం వందకు పైగా ధియేటర్లకు కరెంట్ ఛార్జీలు మాఫీ చేయాలని కోరతారు. టికెట్ ధరల పెంపు కోసం అనుమతి అడుగుతారు. 24 …
తైవాన్ పార్లమెంట్ రణరంగం గా మారింది. సభ్యులు పరస్పరం దాడులకు దిగారు. అమెరికా నుంచి పంది, గొడ్డు మాంసం దిగుమతిపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. అంతటితో ఆగకుండా ఒకరిపై ఒకరు మాంసం ముద్దలు విసురుకుంటూ, పిడిగుద్దులకు దిగారు. దీంతో సభలో కొంత …
హైదరాబాద్ జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రధానంగా బీజేపీ-ఎంఐఎం పార్టీల నేతల ప్రసంగాలు దుమారం రేపుతున్నాయి. నేతలు పదునైన విమర్శలు కలకలం రేపుతున్నాయి. ముందెన్నడూ ఈ రీతిలో ప్రచారం జరగలేదు. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ విమర్శలు .. వాగ్గానాల జోరు కూడా …
error: Content is protected !!