అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఆ జర్నలిస్టును నిర్దాక్షిణ్యంగా ఉరి తీశారు !

పై ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు ..రుహాల్లా జామ్. జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు.  ఇరాన్ ప్రభుత్వం  అతగాడిని నిర్దాక్షిణ్యంగా  ఉరి తీసింది. అతను ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్నది ప్రధాన అభియోగం.  అమద్‌ న్యూస్‌ పేరిట అతను ఒక న్యూస్ ఛానల్ ను స్థాపించారు . ఇరాన్ సుప్రీంకోర్టు ఈ ఏడాది (2020)జూన్ లో మరణశిక్ష విధించగా,దాన్ని అమలు చేశారు. 2017-18లో ధరల పెరుగుదలపై ఇరాన్‌లో ప్రభుత్వానికి …

ప్రణబ్ ‘ఆత్మకథ’లో “సోనియా” పై ఘాటు విమర్శలు !

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ పై  దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తన ఆత్మకథలో ఘాటైన విమర్శలు చేసారు. ఇప్పటికే స్వపక్షంలోని నేతలు విమర్శలు చేస్తుంటే … తట్టుకోలేక వాటికి సమాధానం చెప్పలేక మల్లగుల్లాలు పడుతున్న సోనియా .. రాహుల్ గాంధీ లు ప్రణబ్ విమర్శలపై నోరెత్తలేని పరిస్థితిలో పడిపోయారు. దివంగత నేతపై విమర్శలు చేస్తే సబబుగా ఉండదు. అదొక కాంట్రవర్సీ గా మారే …

రైతు ఉద్యమం ఉదృతమవుతున్నదా ?

రైతులు ఎందుకు ఉద్యమిస్తున్నారు? ప్రభుత్వం మొండిగా ఎందుకున్నది?ఒకటి కాదు, రెండు కాదు 17 రోజులుగా ఉద్యమం సాగుతున్నది.మరింత ఉధృతమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది,అని ఆందోళన చేస్తున్న రైతుల వాదన. కాదు రైతుల వెనక స్వార్థ రాజకీయ శక్తులున్నాయి అని ప్రభుత్వ వాదన. రైతుల వెనక రాజకీయ శక్తులు ఉంటే ఉండవచ్చు. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు …

ఎవరీ పూర్ణా మంగరాజు ?

సినిమా తీయడం గొప్పకాదు…దాన్ని రిలీజు చేసుకోవడంలోనే ఉంది మజా. తీసిన సినిమాకు గుర్తింపు రావాలన్నా…కాసులు రాలాలన్నా ముందు అది థియేటర్లలోకి వెళ్లాలి. ఇలా తయారైన సినిమాలను జనాల దగ్గరకు చేర్చే వాడు పంపిణీదారుడు. విచిత్రమేమిటంటే…ఎవరో తీసిన సినిమాకు గుర్తింపు తీసుకొచ్చే ఈ పంపిణీ దారుల ముఖాలుగానీ పేర్లుగానీ ప్రేక్షకులకే కాదు ప్రపంచానికే తెలియవు. కానీ సినిమాకు వారు …

బెజవాడ ఊర్వశి థియేటర్ కి యాభై ఏళ్లు !

సరిగ్గా 50 ఏళ్ల క్రితం ‘MACKENNA’S GOLD’ సినిమాతో ప్రదర్శనలు ఆరంభించింది బెజవాడ ఊర్వశి 70MM థియేటర్.అప్పట్లో ఆ సినిమాని భారతదేశంలోనే మొదటిసారి ప్రతిష్ఠాత్మకంగా విడుదలచేసి,రికార్డ్ సృష్టించిన ఆ హాలు,ఈ 2020 డిసెంబర్ 10న స్వర్ణోత్సవం జరుపుకుంది..బెజవాడలో మొట్టమొదటి 70MM సినిమా హాల్ అది. మేము డిగ్రీ చదివే రోజుల్లో ఊర్వశి,మేనక హాల్స్ లో ఇంగ్లీష్ …

జో బైడెన్ భారత్ కి అనుకూలమేనా ?

అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న జో బైడెన్‌ భారత్‌ పట్ల ఎలాంటి వైఖరి అవలంబిస్తారనే అంశంపై రాజకీయవర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఉన్న విధానాలనే బైడెన్ కొనసాగిస్తారా? లేక కొత్త పద్ధతులకు శ్రీకారం చుడతారా ? అనేది కొన్ని రోజులు పోతే కానీ తేలదు. ఇప్పటికైతే బైడెన్ వ్యవహారశైలి తెలిసినవారు చెప్పేదాని ప్రకారం బైడెన్‌ భారత్‌ …

ఏలూరు వింత వ్యాధి మిస్టరీ ఏమిటి ?

ఆ వింత వ్యాధికి  లక్షణాలు కనిపిస్తున్నాయి కానీ.. కారణాలు తెలియడం లేదు. కేంద్ర వైద్య బృందాలు, ప్రఖ్యాత సంస్థల నిపుణులు వచ్చారు. పరీక్షలు చేస్తున్నారు. కేసులను పరిశీలిస్తున్నారు. ఫలానా కారణమని నిర్ధారించలేకపోతున్నారు. కొంతమంది నిఫా వైరస్ అంటున్నారు. నీటి వల్లే కాలుష్యం జరిగిందని ఊహించలేమంటున్నారు.  ప్రజలు ఎక్కువగా వినియోగించే కూరగాయాల్లో రసాయనాల ప్రభావం ఏమైనా ఉందా పరిశీలించాల్సి ఉందని చెబుతున్నారు.   కోవిడ్‌ నివారణా …

ఇదే కొత్త పార్లమెంట్ భవనం నమూనా..2022 కి సిద్ధం!

నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి ఇవాళ పునాది పడబోతోంది.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. టాటా ప్రాజెక్ట్స్ సంస్థ నిర్మించే ఈ నూతన భవనానికి రూ.971 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 93 ఏళ్ళనాటి ప్రస్తుత పార్లమెంటు భవనానికి బదులుగా ఈ నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. స్వతంత్ర భారతావని 75 వసంతాలు …

ఆ స్టోరీ చూసి ఇద్దరు నవ్వుకున్నారట !

అవును మరి…  లాజిక్ లోపించిన కథనం… ఊహాగానాలతో వండి వార్చిన ఆ స్టోరీ చదివి తెలంగాణ సీఎం కేసీఆర్ … ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లు నవ్వుకున్నారట.  “కారుకు ఫ్యాన్ గాలి “అంటూ ఆ పత్రిక రాసిన కథనం అలా ఉంది మరి. రీడర్లు మహా తెలివిగలవారు అనే విషయం మర్చిపోయి వారి చెవుల్లో పూలు …
error: Content is protected !!