అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
ఆయన గురించి ఎన్నో కథలు ప్రచారం లో ఉన్నాయి. అందులో నిజాల కంటే అబద్ధాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయనలో చాలామందికి తెలియని మానవతా కోణం ఉంది. ఆంధ్రజ్యోతి తిరుపతిలో( 1989 ) పని చేస్తున్న రోజులవి . ఒక రోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాప్రసాద్ ఫోన్ చేసి ‘కడప వస్తావా ?’అని అడిగేడు .”ఏం” అన్నాను …
కోనసీమలో మూకుడు రొట్టె చాలా పాపులర్. అందులో ముక్కామలలో మినప రొట్టెలు మరీ ప్రసిద్ధి. సాయంకాలం వేళలో ఈ మినప రొట్టెల కోసం జనం ఎదురుచూస్తుంటారు. ఉదయం పూట ప్రతీ ఒక్కరూ ఇడ్లీ, పూరీ, దోశె , గారె వంటి పదార్ధాలను అల్పాహారం తీసుకోవడం సర్వసాధారణం. సాయంత్రం సమయంలో మాత్రం వేడే వేడి మూకుడు రొట్టె కోసం …
విజయాలైనా … వైఫల్యాలనయినా ప్రజలే డిసైడ్ చేస్తారు. ఓడిపోయిన వారు ఆ ప్రజలకు దగ్గరై మరల విజయం సాధించవచ్చు . కాకపోతే సరైన పద్దతిలో , సరైన వ్యూహంతో ముందుకు సాగాలి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ కేవలం ఒకటి ,రెండు ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రానా కాడి వదిలేసి దూరంగా వెళ్ళటం సబబుగా లేదని ఆయన అభిమానులు అంటున్నారు. నిజానికి ఇప్పటికి మించిపోయింది …
ఆస్తిపాస్తులు … డబ్బు పుష్కలంగా ఉన్నప్పటికీ చాలామంది సామాజిక సమస్యల పట్ల స్పందించరు. కనీసం చిన్న చిన్న దానాలు కూడా చేయరు. కానీ మెకంజీ స్కాట్ అలాంటి వ్యక్తి కాదు. తనకున్న కోట్లకొలది సొమ్మును దానం గా ఇస్తున్నారు. సామాజిక సమస్యల పరిష్కారానికి తనవంతు సహాయం చేస్తున్నారు. మెకంజీ స్కాట్ లాంటి వాళ్ళు దేశానికి ఒకరు …
వాట్సాప్ ఇక పై అన్ని ఫోన్లలో పనిచేయదు . 2021 జనవరి 1నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది. కొన్ని ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని అంటున్నారు. కంపెనీ చెబుతున్న వివరాల ప్రకారం ఐఫోన్‌లో ఐవోఎస్ 9, ఆండ్రాయిడ్ ఫోన్లలో 4.0.3 ఆపరేటింగ్ సిస్టమ్ కన్నా ముందువి ఉంటే వాటిలో మాత్రం వాట్సాప్ …
త్వరలో పెద్దల సభకు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను పంపే యోచన లో ఏపీ సీఎం జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి రాజ్య సభకు మేధావి వర్గానికి చెందిన వారినే పంపాలి. అయితే రాజకీయ పార్టీలు ఎక్కువగా రాజకీయ నేతలనే ఎంపిక చేస్తుంటాయి.మేధావులను,రాజ్యాంగ నిపుణులను పంపితే కీలకమైన బిల్లులు తదితర అంశాల్లో తమ వాదనలను వినిపిస్తారు. …
చైనా దూకుడు కు చెక్ చెప్పేందుకు భారత్ సిద్ధమౌతున్నదా ? పరిస్థితి చూస్తుంటే అలాగే ఉందని అనిపిస్తుంది. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో సైనికులకు 15 రోజుల యుద్ధానికి అవసరమైన మందుగుండు, ఆయుధాలు సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు వెళ్లిన క్రమంలో ఈ సందేహాలు ఎవరికైనా వస్తాయి. దీనికి తోడు త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మాటలు అలాగే …
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రభుత్వానికి గుదిబండగా మారింది. పీకల్లోతు నష్టాల్లో ఇరుక్కుపోయిన సంస్థ ను అమ్ముదామంటే కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. సిబ్బందికి, పైలట్లకు వేతనాలు ,అలవెన్సులు ఇవ్వలేక సంస్థ నానా పాట్లు పడుతోంది. ఈ నేపథ్యంలోనే 2018 లోనే సిబ్బంది సమ్మెకు దిగుతామని హెచ్చరికలు కూడా జారీ చేసారు. 2015 …
గ్రహాంతర వాసుల గురించి మీడియాలో వస్తోన్న కథనాలను నమ్మాలా ? వద్దా ? అసలు గ్రహాంతర వాసులు ఉన్నారా ?లేరా ? ఈ మిస్టరీ ఏమిటి అనే అంశంపై కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే కొందరు శాస్త్రవేత్తలు చెప్పే విషయాలను బట్టి చూస్తే నిజంగా గ్రహాంతర వాసులు ఉన్నారనిపిస్తుంది. అంతుపట్టని రేడియో సిగ్నల్స్‌వ్యవహారం .. ఖగోళ మేధావి స్టీఫెన్ హాకింగ్ లాంటి మేధావుల హెచ్చరికలు.. మరోవైపు నాసా మౌనం ఇవన్నీ గ్రహాంతర వాసుల పట్ల విపరీతమైన …
error: Content is protected !!