ఇంతమంది లైంగిక నేరస్థులు ఉన్నారా ?

Sharing is Caring...

Sex offenders……………………………

మన దేశంలో 10 లక్షలమందికి పైగా  లైంగిక నేరస్థులు ఉన్నారట. నమ్మశక్యంగా లేదు కదా. కానీ నిజమే. ఈ 10 లక్షలమంది వివరాలతో కూడిన డేటా ను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ లైంగిక నేరస్థులలో కొన్ని కేటగిరీలు కూడా ఉన్నాయి. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడేవారు.. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే రేపిస్టులు, బూతులు మాట్లాడుతూ వేధించేవారు,బూతు బొమ్మలు, వీడియోలు పంపుతూ వేధించేవారు. 

ఇలా రక రకాల లైంగిక నేరాలున్నాయి. ఇందులో నేరస్థులు చిన్న వాళ్ళు ఉండొచ్చు .. పెద్దలు ఉండొచ్చు. ఇదో పెద్ద సబ్జెక్టు. ఇలాంటి  లైంగిక నేరస్థులకు సంబంధించి న  డేటాబేస్ ను కేవలం కొన్ని దేశాలు మాత్రమే నిర్వహిస్తున్నాయి. ఈ లైంగిక దాడులకు సంబంధించి విదేశాల్లో చట్టాలు కూడా కఠినంగా అమలు చేస్తుంటారు. పలు పద్దతుల ద్వారా ఈ తరహా నేరస్థుల సమాచారం సేకరిస్తుంటారు.

ఇండియాలో కూడా ఇపుడు ఈ లైంగిక నేరస్థుల సమాచారం సేకరిస్తున్నారు.  లైంగిక నేరాలకు పాల్పడే వారిని తేలికగా గుర్తించి, దర్యాప్తులను మరింత వేగవంతం చేసే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్ల క్రితం శ్రీకారం చుట్టింది.ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా లైంగిక నేరాలకు పాల్పడుతోన్న 10 లక్షల మంది వివరాలతో కూడిన డేటాబేసు సిద్ధం చేసింది.

వీటిని వివిధ దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉంచిన కేంద్ర హోంశాఖ, ఎప్పటికప్పుడు ఈ డేటాను అప్ డేట్ చేస్తుంది. కేంద్ర హోంశాఖ వార్షిక నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా లైంగిక నేరాలకు పాల్పడే వారి వివరాలను నేషనల్ డేటాబేస్ ఆన్ సెక్సువల్ అఫెండర్స్ (NDSO)లో పొందుపరిచారు. ముఖ్యంగా లైంగిక నేరాలకు పాల్పడిన వారి పేర్లు, అడ్రస్, ఫొటోలు, ఐడీ కార్డులతో పాటు నేరస్థుల వేలి ముద్రలను కూడా డేటాబేస్ లో పెట్టారు. 

ఇప్పటివరకు 10.69 లక్షల మంది వివరాలను అందులో నిక్షిప్తం చేయగా.. అత్యాచారం, గ్యాంగ్ రేప్, మహిళలను వేధించడం, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి పోక్సో  చట్టం కింద కేసులు ఎదుర్కొన్న వివరాలు కూడా అందులో ఉన్నాయి.

వీటిని దేశవ్యాప్తంగా అన్ని దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉంచారు. మహిళలపై వేధింపులు, అత్యాచారాలకు సంబంధించిన కేసుల్లో సత్వర దర్యాప్తు కోసం ఈ ఎడీఎస్ ఓ సమాచారం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది.

లైంగిక నేరాల దర్యాప్తు వేగవంతం చేయడంలో భాగంగా ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ (ఐటీఎస్ఎస్ డీ), లైంగిక నేరస్థుల డేటాబేస్ (ఎ డీఎఓ)లను 2018లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇటువంటి డేటాబేస్ ఇప్పటివరకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్ అండ్ టొబాగో వంటి కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దర్యాప్తు అధికారులు శ్రద్ధ పెడితే నిందితులను ఈ డేటాబేస్ ద్వారా ఈజీగా పట్టుకోవచ్చు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!