చిత్రం..భళారే విచిత్రం!

Sharing is Caring...
Goverdhan Gande ................................

Rise in prices…………………………………పెట్రోలియం ధరల పెరుగుదలపై పై ఓ విచిత్రమైన ట్రెండ్/ధోరణి నడుస్తోంది. పేదలు,మధ్య తరగతి వర్గాలు సహజంగానే ధరల పెరుగుదలను నిరసిస్తాయి.ఆగ్రహం వ్యక్తం చేయడం,. ప్రభుత్వాలను విమర్శించడం, నిరసనలు తెలపడం, ఆందోళనలు చేయడం మనం దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం కదా.ఆది సహజమైన ధోరణి కదా. కానీ కాదంటారు వీరు.పెంపును సమర్ధించే వారంతా దేశ భక్తులని, వ్యతిరేకించే వారంతా దేశ ద్రోహులని తీర్మానిస్తున్నారు. వేర్వేరు వర్గాలని తేల్చిపాడేస్తున్నారు ‘మీరు వేరు-మేము వేరు ‘అనే గీతలు గీసి పడేస్తున్నారు ఈ “మహానుబావులు” ఏకంగా తీర్పులే ఇచ్చేస్తున్నారు.ఇదీ సోషల్ మీడియాలో ఇపుడు నయా “ట్రెండ్”. 

విచిత్రంగా ధరల పెంపును సమర్థిస్తున్నారు. పెంపుదలను ప్రశ్నించేవారు, నిరసించేవారు, దీనిలో ప్రభుత్వ వైఖరి ని తప్పుబట్టేవారు,విమర్శించే వారినందరినీ దేశద్రోహులుగా చిత్రించడం, దూషించడం, నిందించడమే ఈ ట్రెండ్!ఇంత విచిత్ర మైన ట్రెండ్ /ధోరణి భూమిపై ఏ దేశంలో కూడా ఉండే అవకాశమైతే లేదనుకుంటా. ఈ ‘ట్రెండ్ సెట్టర్స్’ వాదనలు చూద్దాం….ఒకాయన .. పెంపు పరవా లేదు! అంటాడు. మరొకాయన …… దేశం కోసం ధర్మం కోసం పెంచవచ్చు! నంటాడు. ఇంకొకాయన మద్యం ధరలతో పోల్చమని ఉచిత సలహాలిస్తాడు.ఎన్నికల్లో ఓటు వేయడానికి డబ్బు తీసుకుంటున్నారు కదా, ఇపుడు అనుభవించండి అని శాపనార్ధాలు పెడతాడు మరొకాయన.మందు తాగడం బంద్ చేయమని చెబుతూ ఉచిత సలహాలిస్తాడు. 

30 ఏళ్ళ క్రితం పెట్రో ధరలను భూములు, బంగారం ధరలను పోల్చుతూ ఇంకొకాయన చిత్రమైన వివరణ ఇస్తాడు. వాటిని అద్భుతమైన “విశ్లేషణలు”గా ఇంకొందరు కీర్తిస్తారు.ఇలాంటి సమర్ధింపులు ఇపుడు సోషల్ మీడియాలో పెరిగిపోతున్నాయి. కొనసాగుతున్న ఈ ట్రెండ్/ధోరణి ని ఏమని పిలవాలి?పెట్రో ధరల పెంపు ప్రభావం నిత్య జీవితం పై ఎంత దుర్భరంగా ఉంటుందో వీరికి తెలియదనుకోవాలా?

నిత్యజీవితానికి అవసరమైన ప్రతి వస్తువు మన వరకు చేరడానికి ఏదో ఒక విధమైన రవాణా సాధనం కావలసిందే కదా. దానికి డీజిల్, పెట్రోల్ లాంటి ఇంధనం అనివార్యం కదా.వాటి ధరల పెరుగుదల ప్రతి వస్తువుపై పడుతుంది కదా. అది ప్రతి వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేయక తప్పదు కదా. ఈ కనీస జ్ఞానం వీరికి లేదనుకోవాలా?లేక ధరల పెంపు వీరి జీవితాలను ప్రభావితం చేయదనుకోవాలా? అదీకాక వీరంతా కడుపు నిండిన వర్గం అని భావించాలా?దేశం కోసం, ధర్మం కోసం ధరల పెంపును సమర్థించడం ఏమిటి విచిత్రంగా.

తాజాగా పెట్రోల్ ధర హైదరాబాద్ ,భోపాల్ ,ఔరంగాబాద్ నగరాలలో వంద రూపాయలు దాటింది.

photo courtesy.. pinclip art

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!