వృద్ధాప్యం శత్రువు కాదు !!

Sharing is Caring...

Important things to say to adults ………………………….

మీ ఇంట్లో పెద్ద వాళ్ళు ఉన్నారా ? వారితో ప్రేమగా మాట్లాడుతూ ఈ కింది అంశాలు వారి దృష్టికి తీసుకెళ్లండి.

చాలా “రోగాలు” నిజానికి వ్యాధులు కావు, అవి సహజమైన మానసిక–శారీరక వృద్ధాప్య లక్షణాలు మాత్రమే.వారికి అర్ధమయ్యేలా చెప్పండి .

1. మీరు అనారోగ్యంతో లేరు — మీరు వృద్ధులైపోతున్నారు.

2. మీరు వ్యాధిగా భావిస్తున్న అనేక లక్షణాలు, నిజానికి శరీరం వృద్ధాప్య దశలోకి ప్రవేశిస్తున్న సంకేతాలు మాత్రమే. 

3. “జ్ఞాపక శక్తి తగ్గిపోవటం” అల్జీమర్స్ కాదు — ఇది మన మెదడు తీసుకునే రక్షణాత్మక చర్య. మీరు తాళం చెవి ఎక్కడ పెట్టారో మరచిపోవడం సహజం, కానీ ఆ తాళం మీకై మీరు వెతుక్కోగలిగితే, అది మతిమరుపు కాదు.

4. నడక మందగించడం, కాళ్లు చేతులు మాట వినకపోవడం… పక్షవాతం కాదు — ఇది కండరాల బలహీనత మాత్రమే. గుర్తించగలిగితే ఔషధం కన్నా ముందు వీలైనంత శరీరం సహకరించినంత మేరకు అటూ ఇటూ శరీర కదలికే పరిష్కారం అవుతుంది. 

5. “నిద్రపట్టకపోవడం” అనేది నిద్రలేమి కాదు — మీ మెదడు నిద్ర తాలూకు రిథమ్‌ను మార్చుకుంటోంది.

ఇది వ్యాధి కాదు, ఇది నిద్ర నిర్మాణంలోని మార్పు. నిద్ర మాత్రలు ఎక్కువగా వాడడం ప్రమాదకరం — వాటి వలన నడుస్తూ పడి పోవచ్చు. మానసిక బలహీనతకు గురి కావచ్చు. 

 వృద్ధులకు ఉత్తమమైన “నిద్రమాత్ర” అనగా — పగలు సూర్యరశ్మిని గ్రహించడం, ఒక నియమిత దినచర్య కలిగి ఉండటమే. 

6. “ఒళ్ళు నొప్పులు” అనేవి రోగం కాదు — ఇవి నరాలలో వృద్ధాప్యం కారణంగా  సంభవించే సహజమైన మార్పు. నెమ్మదిగా నాడీ స్పందన జరుగుతుండటమే ఇక్కడ ప్రధాన కారణం. ఔషధాలతో కాకుండా వ్యాయామం, ఫిజియోథెరపీతోనే ఉపశమనం పొందవచ్చు. తేలికపాటి మసాజ్, గోరు వెచ్చటి నీటి స్నానం, హాట్ కాంప్రెస్ వంటి ప్రక్రియలు మంచివి.

7. “ఫిజికల్ చెకప్‌లో ఏవైనా అసాధారణ విలువలు రావడం” వ్యాధి కాదు — ఆరోగ్య ప్రమాణాలు వృద్ధులకు తగ్గట్టుగా మారలేదనే ఉద్దేశం.

– పెద్దలకు కొలెస్ట్రాల్ కొద్దిగా ఎక్కువగా ఉండటం మంచిదే, ఎందుకంటే ఇది హార్మోన్ల సృష్టికి అవసరం.

– రక్తపోటు విషయంలోనూ, వృద్ధుల లక్ష్యం 150/90 mmHg కన్నా తక్కువగా ఉండడమే సరిపోతుంది — యువతలో ఉండే 140/90 ప్రమాణం కాదిది.

-వృద్ధాప్యాన్ని వ్యాధిగా భావించకండి. అది మన జీవిత మార్గంలో సహజమైన దశ.

ఇవి వృద్ధులకూ, వారి పిల్లలకూ చెబితే మంచిది. 

– ప్రతీ అసౌకర్యం వ్యాధి కాదు — గుర్తుంచుకోండి.

– వృద్ధులు భయపడటమే ఎక్కువ. ఫిజికల్ చెకప్ రిపోర్టులను చూసి కంగారు పడకండి.

– పిల్లలు తమ తల్లిదండ్రులను హాస్పిటల్‌కు తీసుకువెళ్లడమే కాదు — వారి వెంట నడవడం, మాట్లాడడం, భోజనం చేయడం, సూర్యప్రకాశంలో కాలక్షేపం చేయడం — ఇవే ముఖ్యం.

-వృద్ధాప్యం శత్రువు కాదు — దాన్ని చూసే దృష్టి కోణమే అసలైన శత్రువు.

(బీజింగ్‌లోని ఒక ఆసుపత్రి డైరెక్టర్ వృద్ధులకు చెప్పిన విషయాలు. ) 

Credits to Unknown Writer 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!