కోస్టల్ కర్ణాటక’ యాత్ర చేయాలనుకుంటున్నారా?

Sharing is Caring...

IRCTC Coastal Karnataka Tour Package…..  

‘కోస్టల్ కర్ణాటక’ పేరిట IRCTC స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది.ప్రతి మంగళవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఈయాత్ర మొదలవుతుంది. ఈ యాత్రలో భాగంగా మురుడేశ్వర్, ఉడిపి, శృంగేరి,మంగళూరు వంటి అధ్యాత్మిక ప్రాంతాలను దర్శించవచ్చు.

5 రోజులు /6 రాత్రుల పాటు ఈ యాత్ర సాగుతుంది.

DAY..  1…. కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 06.05 గంటలకు యాత్ర మొదలవుతుంది. పగలు, రాత్రి అంతా జర్నీ ఉంటుంది.

DAY.. 2… ఉదయం 9. 30 గంటలకు మంగళూరు సెంట్రల్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి బస్ లో ఉడిపి కి వెళ్తారు.హోటల్ లో చెక్ ఇన్ అవుతారు. సమీపంలోని శ్రీ కృష్ణ టెంపుల్ తో పాటు Malpe బీచ్ ను చూస్తారు. ఆ రాత్రి  హోటల్ లో బస చేస్తారు. 

DAY..3.. ఉదయం కొల్లూరుకు వెళతారు. మూకాంబిక ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మురుడేశ్వర్ కు వెళతారు. అక్కడ ఆలయాన్ని,శివుని విగ్రహాన్ని సందర్శిస్తారు. సాయంత్రం గోకర్ణకు చేరతారు. అక్కడ బీచ్ ను చూస్తారు. రాత్రి కి  మళ్లీ ఉడిపికి చేరుకొని అక్కడే బస చేస్తారు.

DAY..4…. హోటల్ చెక్ అవుట్ చేసి హార్నాడు కు చేరుకుంటారు. అక్కడ అన్నపూర్ణ ఆలయాన్ని దర్శిస్తారు. అనంతరం శృంగేరికి వెళ్లి శారదాంబా ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి మంగళూరు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

DAY.. 5…  హోటల్ చెక్ అవుట్ చేస్తారు. మంగళూరు లో మంగళాదేవీ ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం తన్నెరభావి బీచ్, గోకర్నాథ్ ఆలయాన్ని చూస్తారు.రాత్రి 7 గంటలకు మంగళూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 8.05 గంటలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.

DAY..6 … మరునాడు రాత్రి 11.40కి కాచిగూడకు చేరుకోవటంతో యాత్ర ముగుస్తుంది.

కోస్టల్ కర్ణాటక ప్యాకేజి ధరలు…

 

టూర్ ప్యాకేజీలో 3 రోజులు అల్పాహారం.. 3 రాత్రులు వసతి. లోకల్ రవాణా, ప్రయాణ బీమా సదుపాయం ఉంటాయి .. లంచ్,డిన్నర్ ఖర్చులు, ఇతర ఖర్చులు ప్రయాణీకులు భరించాలి. ఏమైనా సందేహాలు లేదా వివరాలను తెలుసుకోవాలంటే.. IRCTC –Mob: 8287932229 / 9701360701 లకు ఫోన్ చేసి కనుకోవచ్చు.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!