అతివల అక్రమ రవాణా, వ్యభిచార కేంద్రాల నిర్వహణ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 30 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందని అంచనా. భారత దేశంలో కూడా అమ్మాయిల శరీరాలతో జరిగే ఈ వ్యాపారం క్రమం గా పెద్ద పరిశ్రమ గా మారింది.వేలమంది ఇందులో లబ్ది పొందుతున్నారు.
ఒక అమ్మాయిని మోసగించో, ప్రలోభ పెట్టో, తీసుకొచ్చి అప్పగిస్తే కమీషన్ రూ 10నుంచి 30వేలు వరకు బ్రోకర్లకు లభిస్తుంది. దీన్నిబట్టి అమ్మాయిలపై ఎంత వ్యాపారం జరుగుతుందో అంచనా వేయ వచ్చు.ప్రస్తుతం భారత్ లొదాదాపు మూడు కోట్లమంది మహిళలు,బాలికలు వ్యభిచార వృత్తిలొ మగ్గుతున్నారు.
వీరిలో 60శాతం మంది అట్టడుగు వర్గాల వారే వున్నారు. ఇందులో 30 శాతం మంది 18 ఏళ్ళ లోపు వారే . వీరందరిలో 40 శాతం మంది నిర్బంధంలొ ఉన్నవారే కావడం గమనించదగిన అంశం . ఇవన్ని నమ్మలేని నిజాలు.కానీ అక్షర సత్యాలు.
ఈ నేపధ్యం లొ ఒక సెక్స్ వర్కర్ తో చేసిన ఇంటర్వ్యూ ఇది..
# అసలు ఈ వృత్తి ని మీరు ఎందుకు ఎంచుకున్నారు ?
@ నన్నైతే మా ఆయనే ఈ వృత్తి లోకి దించాడు. అప్పట్లో నాకు అంతా తెలివి తేటలు లేవు.ఉద్యోగం అని చెప్పి ఒక ఆంటీ దగ్గర చేర్పించాడు. ఆవిడ నన్ను బలవంతం గా వృత్తి లోకి దింపింది. కొన్నాళ్ళు అక్కడే ఉండిపోయా.ఆవిడ చనిపోయాక అక్కడ నుంచి బయట పడ్డా.
# మళ్ళే మీ ఆయన దగ్గరకి వెళ్ళారా ?
@ లేదు. నేనే సొంతం గా బతకడం అలవాటు చేసుకున్నా. ఒక స్వచ్చంద సంస్థ వాళ్ళు చిన్న ఉద్యోగ మిచ్చారు. అడపా దడపా ఈ వృత్తి చేస్తుంటా. నన్ను ఇష్ట పడిన మగాడితో కలసి ఉంటున్నా, నాకో పాప కూడా పుట్టింది. నేను పడిన ఇబ్బందులు నా పాప పడకూడదు. అందుకే దాన్ని మంచి కాన్వెంట్ లొ వేసి, నేను ఉంటున్నవాతావరణానికి దూరం గా పెంచుతున్నా.
# ఇప్పుడు ఎక్కడ చూసిన సెక్స్ వర్కేర్లు పెద్ద సంఖ్య లొ కనపడుతున్నారు.కారణమేమిటి ?
@ చాలా మంది అమ్మాయిలు పేదరికం నుంచి బయట పడాలని,ప్రేమ,ఉపాధి, సినిమా వేషాల పేరిట మోసబోయి బలవంతం గా ఈ వృత్తి లోకి దిగుతున్నారు,మరి కొందరు విలాసవంత మైన జీవితం కోసం ఈ వృత్తి ని చేపడుతున్నారు.బాగా చదువుకున్నవాళ్ళు కూడా ఈ వృత్తి ని ఎంచుకోవడం దౌర్భాగ్యం.
# కొన్ని సంస్థలు వ్యభిచారానికి లైసెన్సు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి గదా ? లైసెన్సు ఇస్తే మంచిదే అంటారా ?
@ వ్యభిచారానికి లైసెన్సు ఇస్తే ఇక పెద్ద కార్పొరేటు కంపెనీలు కూడా ఇదే పని చేపడతాయి. అమ్మాయిలకు డిమాండ్ పెరిగిపోతుంది. మహిళల కు రక్షణ కరువై పోతుంది. ఇప్పటికే మన దేశం లొ రోజూ 200 మందికి పైగా అమ్మాయిలు అక్రమ రవాణా కి గురై వ్యభిచార గృహాలకు చేరుతున్నారు. అదే లైసెన్సు ఇస్తే ఇక ఒంటరిగా రోడ్డు పైకి రావడం కూడా కష్టమే. అందుకే ప్రభుత్వం కూడా ఆ డిమాండ్ ని తోసి పుచ్చింది. లైసెన్సు కావాలని కోరే ఏ సెక్స్ వర్కర్ కూడా తమ బిడ్డలను ఈ కూపం లోకి దించడానికి సిద్ధం గా లేదు. బిడ్డల శరీరాలతో కూడా వ్యాపారం చేస్తానంటే అది తల్లి కాదు కసాయి అని చెప్పుకోవాలి. ఇప్పటికే సెక్స్ వర్కర్ల గా మా హక్కులను అనుభవించలేక పోతున్నాం .ఇక లైసెన్సు ఇస్తే పూర్తిగా బానిసలూ గా మారిపోవాల్సి వుంటుంది.
# హక్కుల సాధన కోసం మీరు కూడా పోరాడవచ్చు గదా?
@ మేము కూడా సమాజం లొ భాగమే. మాకూ హక్కులున్నాయి,వాటిని సాధించుకోవడం కోసం మేము పోరాడుతున్నాం. మా హక్కులు సాధించుకోవడానికి కొంత మంది సామాజిక ఉద్యమ కారులు మాకు సహాయ పడుతున్నారు.
# మీకు హక్కులు లేవు అని ఎవరైనా చెప్పారా?
@ లేదు… కానీ సమాజానికి మేమంటే చిన్న చూపు ఎక్కువ. సెక్స్ వర్కర్ అని చెప్పుకుంటే చీత్కారం గా చూస్తారు. ఒకప్పుడు రేషన్ కార్డులు..బ్యాంకు అక్కౌంట్లు ఉండేవి కావు. కొన్నిఎన్జీవోలు అవన్నీ ఇప్పించాయి. గతం తో పోల్చుకుంటే ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగు పడింది.
# రోజు మీరు ఎంత సంపాదిస్తారు ??
@ సంపాదన మనిషిని బట్టి వుంటుంది.ఒకళ్ళు రోజుకి వేయి సంపాదిస్తారు, ఇంకొందరు మూడు వేల నుంచి పది వేలు సంపాదిస్తారు .మరొకరు వంద కూడా సంపాదించ లేక పోవచ్చు.
# బాగా సంపాదించే వాళ్ళు ఏవైనా దాచుకుంటారా
@దాచుకొని కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళు లేక పోలేదు,కానీ వాళ్ళ సంఖ్య కంటే మోస పోయే వాళ్ళే ఎక్కువ.
# కొంచెం వివరిస్తారా ??
@చేసేది ఎలాంటి పని అయినా మాకూ ప్రేమ కావాలి, ఓదార్పు కావాలి, అక్కున చేర్చుకొని నీకు నేనున్నా అని చెప్పేవాళ్ళు కావాలి.చాలామంది మగాళ్ళు ఇలా మాయ మాటలు చెప్పి మాలాంటి సెక్స్ వర్కర్లు దాచుకున్న సొమ్మును నొక్కేస్తారు.వాడు మొగుడు కావచ్చు ,తాత్కాలిక భర్త కావచ్చు.ప్రియుడు కావచ్చు,ఈ మూడు రూపాల్లో ఉంటూ ఒక వైపు మమ్మల్ని చేరదీసి ఓదారుస్తూనే ….మరో వైపు మమ్మల్నే తారుస్తుంటారు. వినే వాళ్ళకు ఇదంతా కొత్త గా, వింతగా ఉండొచ్చు. ఈ రకం దోపిడీ కి మేము అలవాటు పడిపోయాము. కేవలం కొందరు మాత్రమే తెలివిగా సంపాదించిన సొమ్ము దాచుకుని ఇళ్ళు కట్టుకున్నారు, బిడ్డలను చదివించు కుంటున్నారు,పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నారు. అయితే వారి సంఖ్య తక్కువ.చాలామంది ఈ వృత్తి లోకొచ్చి వ్యసనాలకు బానిస అవుతారు.చివరికి ఆరోగ్యం చెడిపోతే చూపించుకోవడానికి సోమ్ములేక అనాధలు గా చనిపోయిన వాళ్ళువున్నారు.
# ఒక రోజులో ఒక మహిళ ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొనే శక్తి ని కల్గి వుంటుంది ?
@ సాధారణం గా ఒక మహిళ మూడు నాలుగు సార్లు సెక్స్ లో పాల్గొనే శక్తి ని కల్గి వుంటుంది. అయితే సెక్స్ వృత్తి లోని మహిళ డిమాండ్ ను బట్టి రోజుకి 20 సార్లు కూడా సెక్స్ లో పాల్గొంటుంది.నిజం చెప్పాలంటే అన్ని సార్లు సెక్స్ అంటే ఒక మహిళకు అది నరకం,రంపపు కోత. వ్యభిచార గృహాలలో ఇరుక్కుపోయిన అమ్మాయిలు వచ్చిన కస్టమర్ ను సంతృప్తి పరచక పోతే ఓనరమ్మలు/ఓనర్లు చిత్ర హింసలు పెడతారు. కాబట్టి అక్కడ వున్న అమ్మాయిలు యంత్రాల్లా మారిపోక తప్పదు. అదోక యాంత్రిక జీవనం. నాలా స్వతంత్రం గా సెక్స్ వర్క్ చేసే వాళ్ళు ఇష్టమైతేనే సెక్స్ లో పాల్గొంటాం.
# మీకు వాళ్ళకు తేడా ఏమిటి ?
@ స్వతంత్రం గా వృత్తి చేసే మాకు కొంత మేరకు స్వేచ్చ వుంటుంది,వ్యభిచార గృహాలలో ఉన్న అమ్మాయిలు చాలా మంది బలవంతం గా వృత్తి లోకి దిగిన వాళ్ళే.వాళ్ళకు స్వేచ్చ వుండదు.కుటుంబాలతో సంబంధాలు వుండవు. ఒక చోట డిమాండ్ అయిపోతే మరోచోటకు తరలించబడతారు. ఆరోగ్యం కాపాడుకోవడానికి కూడా అవకాశంవుండదు .హెచ్ ఐ వి బారిన పడితే రోడ్డు మీదకు నెట్టేస్తారు. అదే స్వతంత్రం గా వృత్తి చేసే వాళ్ళైతే ఆరోగ్యం కాపాడుకుంటారు. వృత్తి రహస్యం గా చేసుకుంటూ కుటుంబ సభ్యులతో ఉంటుంటారు.
#ప్రభుత్వం ఆసరా కల్పిస్తే ఈ వృత్తి మానేస్తారా ?
@మానేయాలనే వుంది ,కానీ అంతా సులభం గా బయట పడలేక పోతున్నా,ఆర్ధిక అవసరాలు తరుముతున్నాయి. నా జీవితం ఎలాగు కాలి పోయింది. పాప అయినా మంచి చదువులు చదువు కొని ఉన్నత స్థాయి లొ బతకాలన్నది నా లక్ష్యం. ప్రభుత్వం అందరికి ఉపాధి కల్పించడం అంత సులభం కాదు.
# స్వచ్చంద సంస్థ లొ ఏం చేస్తుంటారు ?
@ నా లాంటి సెక్స్ వర్కర్లు కు మంచి చెడు చెబుతుంటాను . వాళ్ళను తీసుకెళ్ళి ఆరోగ్య పరీక్షలు చేయిస్తుంటా. హెచ్ ఐ వి బారిన పడితే మందులు వాడేలా వారికీ ధైర్యం చెబుతూంటా. ఒకప్పుడు సెక్స్ వర్కర్ల వల్లె హెచ్ ఐ వి వ్యాప్తి చెందిందనే అపప్రధ వుండేది, ఇపుడు అదే సెక్స్ వర్కర్లు హెచ్ ఐ వి /ఎయిడ్స్ వ్యతిరేక ప్రచారం లొ పాల్గొంటూ హెచ్ ఐ వి తగ్గు ముఖం పట్టేందుకు కృషి చేస్తున్నారు.
# పోలీసుల నుంచి మీకు ఎలాంటి సమస్యలు లేవా ??
@ ఎందుకు లేవు ? బోల్డు సమస్యలు వున్నాయి.కొందరు మరీ కఠినంగా వ్యవహరిస్తుంటారు. ఇంకొందరు సున్నితంగా మందలించి వదిలేస్తుంటారు. నిజాయితీ గల అధికారులు ఒత్తిళ్ల కు లొంగకుండా పని చేస్తే వ్యభిచారాన్ని నియంత్రించవచ్చు. అలాంటి వారు కూడా ఉన్నారు.అయితే అన్ని చోట్ల లేరు. గతంతో పోలిస్తే ఇపుడు చాలా నయం . మమ్మల్ని కొట్టకుండా హోమ్స్ కి అప్పగిస్తున్నారు.
# మీ తోటి సెక్స్ వర్కర్లకు ఏం చెబుతారు ?
@మన జీవితాలు ఎలాగు బుగ్గి అయ్యాయి. మన పిల్లల బతుకులు అలా కాకుండా చూడండి . పద్దెనిమిది లోపు పిల్లలు ఈ వృత్తి లోకి రాకుండా చూడండి అని చెబుతాను.
———— K.N.MURTHY
Your interview with a sex worker
Is morelous. The rechhwd lives of theworker depicted in all angles of their life.