ఆకట్టుకునే మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ !

Sharing is Caring...

 Interesting Story………………………….

క్రైమ్ థ్రిల్లర్ లు చూసే వారికి ఈ ‘రేఖా చిత్రం’ బాగా నచ్చుతుంది. నలభై ఏళ్ళ క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఎలా ఛేదించారన్నది కథాంశం. సినిమా కాస్త స్లో అనిపించినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టదు. కథ ,స్క్రీన్ ప్లే పకడ్బందీగా రాసుకుని  తెరకెక్కించారు.

రచయిత రాము సునీల్ అందించిన కథను దర్శకుడు జోఫిన్ టి.చాకో ఆసక్తికరంగా తెర కెక్కించిన విధానం ప్రేక్షకులకు నచ్చుతుంది. ఈ సినిమాను మలయాళ ప్రేక్షకులు ఆదరించారు. సినిమా కమర్షియల్ గా కూడా హిట్ అయింది. హీరోయిన్ లేని సినిమా ఇది.   

సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ వివేక్ (ఆసిఫ్ అలీ) మళ్లీ డ్యూటీ లో చేరతాడు. తిరిగి బాధ్యతలు చేపట్టగానే రాజేంద్రన్ (సిద్ధిఖీ) అనే వ్యక్తి ఆత్మహత్య కేసును ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతాడు.

రాజేంద్రన్ తన ఆత్మహత్యను ఫేస్బుక్ లైవ్లో ఉంచి తాను ఆత్మహత్య చేసుకున్నచోటే ఓ మహిళ శవాన్ని పూడ్చిపెట్టామని చెబుతాడు. తనతో పాటు విన్సెంట్ (మనోజ్ కె. జయన్) సహా మరికొందరు కలసి ఆ శవాన్ని పూడ్చిపెట్టినట్టు చెప్పి ఆత్మహత్య చేసుకుంటాడు.  

ఈ వివరాల ఆధారంగా వివేక్ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. రాజేంద్రన్ చెప్పిన ప్రదేశంలో తవ్వి చూడగా ఒక యువతి, కొన్ని ఎముకలు,కాలి పట్టీ దొరుకుతాయి.. వాటి ఆధారంగా విచారణ స్టార్ట్ అవుతుంది. యువతి ని పూడ్చిపెట్టిన ప్రదేశం లో జోరున వాన కురుస్తుండగా జరిపిన తవ్వకాల సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.ఇక్కడ నుంచే కథ మొదలవుతుంది.

ప్రేక్షకులకు క్యూరియాసిటీ పెరుగుతుంది. విచారణ క్రమంలో వచ్చే క్యారెక్టర్లు కథ పట్ల కుతూహలాన్నిపెంచుతుంటాయి. హత్యకు గురైన అమ్మాయి రేఖ అని తెలుస్తుంది.. ఆ అమ్మాయి  ఒక సినిమా షూటింగ్ లో ఒక రోజు పాల్గొంటుంది. రెండో రోజు కనబడకుండా పోతుంది. ఆ అమ్మాయిని చంపింది ఎవరో చివర్లో తెలుస్తుంది.

ఇక్కడో ఒక పుష్ప క్యారెక్టర్ ను పెట్టారు. అసలు విలన్ ఎవరో కథ చివర్లో కానీ తెలియదు. ఒక ఆధారాన్ని పట్టుకుని మరో ఆధారం కోసం వెతుకుతూ వెళుతుండగా హత్యలో పాల్గొన్న నిందితులు, సాక్షులు చనిపోతుంటారు. మెల్లగా సస్పెన్స్ పెంచుకుంటూ వెళతారు డైరెక్టర్. అలా కథలో ప్రేక్షకులను లీనం చేస్తారు.

వివేక్ పాత్ర ధారి ఆసిఫ్ అలీ చక్కగా నటించారు. మలయాళ సినిమాలు రెగ్యులర్ గా చూసే ప్రేక్షకులకు ఈ హీరో తెలిసే ఉంటుంది. రేఖగా అనస్వర రాజన్, నటన  ఆకట్టుకుంటుంది . పుష్ప క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా బాగా చేసింది. విన్సెంట్ గా నటించిన మనోజ్ కె. జయన్ ఆ పాత్రకు కరెక్టుగా సూట్ అయ్యారు. ఇతర పాత్ర దారులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

సినిమా షూటింగ్ సందర్భంగా మలయాళ అగ్రహీరో మమ్ముట్టి కనబడతారు. అప్పట్లో ప్రింట్ మీడియా రిపోర్టర్లు ఎలా ఉండే వారో ఒక జర్నలిస్ట్ పాత్ర ద్వారా తెలియ జేస్తారు. అలాగే యూట్యూబర్ పనితీరును కూడ చూపిస్తారు.అన్ని పాత్రలను అవసరమైన మేరకే దర్శకుడు వాడుకున్నారు.  

రేఖాచిత్రం లో పాటలు పెద్దగా లేవు ..బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.. కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. సినిమాకు ప్లస్ అయింది.. దర్శకుడు జోఫిన్ టి చాకో కి ఇది రెండో సినిమా .. అంతకు ముందు ప్రీస్ట్ సినిమా తీశారు.

ఈ రేఖా చిత్రం తెలుగు వెర్షన్  సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మంచి మిస్టరీ, ఇన్వెస్టిగేటెవ్ క్రైమ్ థ్రిల్లర్ ను చూశామన్న ఫీల్ కలుగుతుంది. మసాలా లేని థ్రిల్లర్ కాబట్టి కొందరికే నచ్చుతుంది.   ఈ మలయాళ సినిమా Overseas Collection ₹ 25.5 కోట్లు …. India Gross Collection ₹ 31.25 కోట్లు . 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!