గణిత బ్రహ్మ మన బోధాయనుడు !

Sharing is Caring...

మన వేదాలు, శాస్త్రాలను పరిహసించే వారు ముందుగా అందులో దాగివున్న అఖండ విజ్ఞానాన్ని తెలుసుకోవలసి వుంది. ఒక్కో శ్లోకం ఒక్కో విశ్వసూత్రాన్ని విప్పి చెపుతుంది.మన పూర్వీకులు అపార విజ్ఞానాన్ని సూత్రాల రూపంలో,శ్లోకాలుగా గ్రంధస్థం చేసి ఉంచారు. అలాంటి మహానుభావుల్లో బోధాయనుడు (బౌధాయనుడు) గురించి తెలుసుకుందాం. ఆయన తన కాలంలో అనేక సూత్రాలను ప్రతిపాదించాడు. ఆయన సూత్రాలన్నీ కృష్ణ యజుర్వేదం లోని తైత్తిరీయ శాఖకు చెందినవిగా చెబుతారు.

అనంత విశ్వంలోని గ్రహాలూ,నక్షత్రాలు,పాలపుంతల దూరాలను గణించ టానికి అవసరమైన అనేక సూత్రాలను వివరించాడు. గణితానికి , ఖగోళానికి ఎంత సంబంధం వుందో ఆ సూత్రాలు చదివితే మనకే అర్ధం అవుతుంది. మనం గుండె గాభరా అనుకునే ఆల్జీబ్రా సూత్రాలన్నీ బోధాయనుడు అప్పుడే చెప్పాడు.

ఆంగ్లేయులు మనకు చేసిన ద్రోహాల్లో ముఖ్యమైనది ఒకటుంది. మన ప్రాచీన శాస్త్రాలను మరుగున పెట్టి , విదేశీయులను ప్రమోట్ చేస్తూ , వాటినే పాఠ్యపుస్తకాల్లో పెట్టి అవే నిజమని మనల్నిభ్రమింప జేశారు. పైథాగరస్ కు ముత్తాతలాంటి మన బోదాయనుడి గురించిన వివరాలు ఇస్తున్నాను చదవండి.ప్రముఖ భారతీయ గణితవేత్త ,శుల్బసూత్రాల రూపకర్త బోధయానుడు. క్రీస్తుపూర్వం 800-700 సంవత్సరాల ప్రాంతంలో భారతదేశంలో నివశించాడు. నాటి కాలంలో యాగాదుల వంటి వైదిక కర్మలు నిర్వహించటానికి వేదికలు నిర్మాణానికి కొలతల కొరకు ఉపయోగించే తాడును సంస్కృతంలో శుల్బ అంటారు.దీని నుండే శుల్బ సూత్రాలు పుట్టుకొని వచ్చాయి.

”దీర్ఘ చతురస్ర సాక్ష్యమారజ్జ పార్స్య మనీ తిర్యక్ మనీయత్ ప్రుధక్ భూతే గురు తస్థ దభయం కరోతి” శుల్భ సూత్రాలలోని ఈ శ్లోకం అర్ధం లంబకోణ త్రిభుజం లోని కర్ణము మీది చతురస్ర వైశాల్యం మిగిలిన రెండు భుజముల మీది చతురస్రాల వైశాల్యానికి సమానం అని పైథాగరస్ కన్నా ఐదు వందల సంవత్సరముల క్రితమే తెలియ జేశాడు. ఇంకా దీర్ఘ చతురస్ర కర్ణము ఆ చతురస్రమునకు రెండు సమభాగములు చేస్తుందని ,దీర్ఘ చతురస్త్రం యొక్క కర్ణాలు రెండు పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయని సమచతుర్భుజ(రాంబస్) కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయని తెలిపాడు.

ఆ కాలం నాటికే భారతీయులు 10 టుది పవరాఫ్ 12 వరకు లెక్కించే స్థితిని చేరుకున్నారు. పై ( !!) విలువను సుమారుగా లెక్కించారు.గ్రహ నక్షత్ర సమూహాల పరిశీలనకు శుల్బసూత్రాల స్థానంలో సిద్ధాంతాలను ప్రతిపాదించటం ప్రాచీన భారతీయుల గొప్పతనం. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ను ఖచ్చితంగా లెక్కించింది కూడా బోదాయనుడే.

అలాగే  శ్రౌత సూత్రం ,గృహ్య సూత్రం ,ధర్మ సూత్రం కూడా రచించారు. వీటి ద్వారా మానవులు బ్రహ్మచర్యం లో, గ్రహస్థునిగా ఉన్నపుడు, వానప్రస్థంలో  ఆచరించాల్సిన వివిధ ధర్మాలను విపులంగా తెలియజేశాడు.  ధర్మ నిర్ణయం చేయాల్సిన ధర్మపరిషత్ గురించి తీర్పు చెప్పేటప్పుడు అనుసరించాల్సిన పద్ధతులు వివరంగా చెప్పాడు. స్త్రీల ఆస్తుల గురించి వివరిస్తూ .. పలు ప్రాయశ్చిత్తాలను కూడా తెలిపాడు. యవ్వనంలో ధార్మికుడిగా లేకపోయినా మలి వయసులో అయినా ధార్మిక క్రియలు అవసరమని వివరించారు.  

———- Sheik Sadiq Ali 

Read Also   >>>>> ప్రపంచానికి పాఠాలు నేర్పిన బ్రహ్మగుప్తుడు !

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!