ఈ రెడ్ లైట్ మల్లెల గోడు వినేదెవరు ??

Sharing is Caring...

Red light area Girls……………………….

ప్రస్తుతం భారత్ లొ దాదాపు ౩ కోట్ల మంది మహిళలు, బాలికలు వ్యభిచార వృత్తి లొ మగ్గుతున్నారు. వీరిలో 60శాతం మంది అట్టడుగు వర్గాల వారే వున్నారు. ఇందులో 30 శాతం మంది 18ఏళ్ళ లోపు వారే. వీరందరిలో 40 శాతం మంది నిర్బంధం లొ ఉన్నవారే కావడం గమనించదగిన అంశం. ఇవన్నీ నమ్మలేని నిజాలు. 

అమ్మాయిలు ఈ వృత్తి లోకి దిగడానికి  అనేక కారణాలున్నాయి.పేదరికం, నిరక్ష రాస్యత, ప్రేమ ,పెళ్లి పేరిట మోస పోవడం ,సినిమా మోజు తో ఇంట్లోంచి చెప్పకుండా వెళ్లి పోయి మోసగాళ్ళ చేతిలో పడటం… వారి  ద్వారా వ్యభి చార కూపాల్లో చిక్కుకోవడం జరుగుతోంది . ఇలా బలవంతం గా ఈ వృత్తి లోకి దిగిన యువతులకు స్వేచ్చ వుండదు.

కుటుంబం తో సంబంధాలు వుండవు. అంద చందాలు వాడి పోనంత వరకు,డిమాండ్ ఉన్నంత వరకు ఒక చోట నుంచి మరో చోటుకి మారుతూ సమిధల్లా కాలిపోతుంటారు . కొన్ని ప్రాంతాల్లో తల్లి తండ్రులే యువతులను బలవంతంగా  ఈ వృత్తి లోకి దించడం కూడా జరుగుతోంది.

ఇక మారుతున్న కాలంలొ విలాసాలు, జల్సాల కోసం  కొంత మంది మహిళలే స్వయం గా వ్యభి చార వృత్తి లోకి దిగుతున్నారు. చేసేది వ్యభి చారమే అయినా దానికి  స్నేహం, ప్రేమ, డేటింగ్ వంటి ముద్దు పేర్లు పెట్టు కొని డబ్బు సంపాదిస్తున్నారు.

ఇలాంటివారికి చాలా వరకు స్వేచ్చ వుంటుంది. కుటుంబంతో సంబంధాలు వుంటాయి. ఇవాళ దేశంలో  సెక్స్ వర్కర్లు లేని టౌన్ లేదు.లక్షల మంది మహిళలు సెక్స్ వర్క్ ని ఉపాధి గా చేసుకుని బతుకుతున్నారు. అన్నట్టు సెక్స్ వర్కర్లలో కూడా కేటగిరీలున్నాయి. 

హోం, సీక్రెట్ , లాడ్జ్ ,హైవే ,స్ట్రీట్ ,బ్రోతల్ అని  వర్గీకరించారు.హోం, సీక్రెట్ దాదాపుగా ఒకటే. వీరు వృత్తి ని గుట్టు చప్పుడు గా చేస్తుంటారు. రోజులో ఒకటి అర వ్యక్తులతో మాత్రమే శృంగారం లొ పాల్గొని డబ్బు సంపాదిస్తారు.లాడ్జ్ లొ వృత్తి చేసే వారు కాంట్రాక్టు పద్ధతి పై వస్తుంటారు. 

రోజుకి వెయ్యి రెండువేలు చొప్పున మాట్లాడుకుని వారం,రెండు వారాలు ఉండి డబ్బు సంపాదించుకుని తిరిగి ఇళ్ళకు వెళుతుంటారు.బ్రోతల్ అంటే వ్యభి చార గృహాలలో మగ్గే వారు. వీరు ఒక చోట నుంచి మరో చోటుకి తరలించబడుతుంటారు. వీరికి అసలు స్వేచ్ఛ ఉండదు. పోలీసుల రైడింగ్ జరిగినపుడు వీరిని భూగృహాల్లో , రహస్య అరల్లో దాచి ఉంచుతారు. చెప్పిన మాట వినకపోతే దారుణంగా హింసిస్తారు.  

ఇక వీధుల్లో నిలబడి విటులను ఆకర్షించే కేటగిరీ మరొకటి. హైవే మీద లారీ, ట్రక్కు డ్రైవర్లను ఆకర్షించి వ్యాపారం చేసే కేటగిరీ ఇంకొకటి. పేరు ఏదైనా జరిగిదే మాత్రం వ్యభిచారమే. లోతులలో కెళ్ళి చూస్తే ఈ వృత్తి  భయంకరమైంది,ఈ వృత్తి లొకి తెలిసో తెలియకో దిగిన మహిళల్లో ‘మేము సంతోషంగా వున్నాం’ అని చెప్పుకునే వారు..బహు తక్కువే అని చెప్పుకోవాలి.

కొందరు బాగా సంపాదించినా ఆ సొమ్ముని ప్రియులకు, తాత్కాలిక భర్తలకు ఇచ్చి మోస పోయే వారే ఎక్కువ. సాలె గూడు లొ చిక్కిన పురుగుల మాదిరిగా, వ్యభిచార కూపాల్లో మగ్గి పోతున్న వారి జీవితాలను చూస్తే గుండెలు బరువెక్కుతాయి.

సెక్స్ వృత్తి ని రూపుమాపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ అదంతా సులభమైన పని కాదు. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పని చేయాలి. పోలీసు వ్యవస్థలో ఇటీవల కాలంలో చాలా మార్పు వచ్చింది. సెక్స్ రాకెట్ నడిపే వారిని అరెస్ట్ చేసి జైళ్లకు పంపుతున్నారు. అమ్మాయిలను తరలించే ట్రాఫికర్లను పట్టుకుని శిక్షలు పడేలా చేస్తున్నారు.

ఈ కార్యక్రమాల్ని మరింత పకడ్బందీగా చేపడితే వ్యభిచారం కొంత మేరకు తగ్గుతుంది. అలాగే వృత్తి నుంచి బయటకొచ్చిన మహిళలకు స్వయం ఉపాధిపథకాలు అమలు చేయాలి.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!