కఠారి పుణ్యమూర్తి …………………………………………
మద్యపాన సేవనం కంటే కూడా తీవ్రమైన వ్యసనం పంచదార సేవనం…పంచదార ఆరోగ్యానికి మంచిది కాదని మనందరికీ తెలుసు… కానీ పంచదార తీపికి మనం బానిసలం..చాలామంది రోజుకి కనీసం నాలుగైదు సార్లు టీ- కాఫీలు బోలెడంత పంచదార వేసుకుని తాగుతారు…మరికొంత మంది పంచదారతో చేసిన మిఠాయిలు, బిస్కెట్లు, కేకులు, ఇతర తీపి పదార్థాలు తెగ తింటారు.
ముప్ఫై ఏళ్ళు వచ్చేదాకా మనం ఎలాంటి గడ్డి తిన్నా అరిగిపోతుంది కాబట్టి ప్రాబ్లెమ్ లేదు…కానీ చిక్కల్లా ఆ తర్వాత… శరీరంలో జీవక్రియల వేగం తగ్గడం అనేది 30 ఏళ్ళు దాటిన తర్వాత మొదలవుతుంది… ఆ తర్వాత పంచదార వినియోగాన్ని ఖచ్చితంగా మానెయ్యాలి.
పంచదార మంచిది కాదని తెలిసినా దాన్ని తినడానికి మనం పెట్టుకునే వంకలు ఇలా ఉంటాయి..
1. తీపి లేకుండా, నోరు కట్టుకుని ఎన్నాళ్లు బ్రతుకుతాం, ఉన్నంతకాలం శుభ్రంగా నచ్చింది తినేసి తొందరగా పోయినా ఫర్లేదు అనే మెట్ట వేదాంతం కొందరిది… 2. పంచదార కంటే బెల్లం మంచిది కాబట్టి బెల్లం తిందాం అని కొందరు బెల్లంతో చేసినవి తింటారు.. 3. షుగర్ ఫ్రీ పౌడర్ వేసిన టీ కాఫీలు తాగుతూ, షుగర్ ఫ్రీ స్వీట్స్ తింటూ ఉంటారు.
నిజానికి బెల్లం పంచదార కంటే కొంచెం బెటరయినా కూడా ప్రస్తుతం మార్కెట్లో దొరికే బెల్లం స్వచ్ఛమైనది కాదు. ఎన్నో ప్రమాదకర రసాయనాలు కలిపి తెల్లగా, అందంగా కనిపించేట్టు తయారు చేస్తున్నారు.ఇక షుగర్ ఫ్రీ పొడులు కృత్రిమంగా తయారు చేసినవి..ఇవి పంచదార కంటే మరింత ప్రమాదకరం.. అస్సలు వాడకూడదు…. ఈ కృత్రిమ తీపి పొడుల లేబిల్స్ ని చూడండి..వాటిలో Dextrose, Sucralose అనే ప్రమాదకర రసాయనాలు ఉంటాయి…ఒక్కటే బండ గుర్తు…మీరు కొనబోయే వాటి లేబిల్స్ చూడడం అలవాటు చేసుకోండి… glucose, fructose, sucrose, dextrose, sucralose…అంటే చివర్లో “ose” అని ఉంటే మన ఆరోగ్యానికి మంచివి కాదు… “ose” లేకపోయినా maltodextrin అనే రసాయనం కూడా మంచిది కాదు.
మరి తీపి లేకుండా ఎలారా బాబూ అంటారా? ఇవిగో ప్రత్యామ్నాయాలు.. ఖరీదు బాగా ఎక్కువ కానీ ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువ కాదు కదా… డాక్టర్ కి, మందులకు డబ్బులు తగలెట్టే బదులు ఖరీదయినా మంచి ప్రోడక్ట్స్ ను వాడాలి. మామూలు పంచదార ఒక కిలో 75 రూపాయలు ఉంటే నేను కింద రాయ బోయేవి కిలో సుమారుగా వెయ్యి రూపాయల ఖరీదు ఉంటాయి…
1. Stevia powder: ఇది సహజ సిద్ద తీపి పదార్ధం..stevia మొక్క ఆకులను పొడి చేస్తే ఇది వస్తుంది.. మామూలు పంచదార కంటే ఐదారు రెట్లు తియ్యగా ఉంటుంది… కాబట్టి ఒక టేబుల్ స్పూన్ పంచదార వాడే బదులు ఇది రెండు చిటికెలు వేసుకుంటే సరిపోతుంది.
2. షుగర్ ఆల్కహాల్స్: వీటిల్లో చాలా రకాలు వున్నా Erythritol, Xylitol అనేవి మంచివి…
3. Monk fruit నుండి తీయబడ్డ పొడి లేదా ద్రావణం…
మధుమేహం ఉన్నవారు భయపడకుండా, నిరభ్యంతరంగా వీటిని వాడొచ్చు… షుగర్ ఆల్కహాల్స్ కొంచెం విరోచనాలు కలిగించే అవకాశం వున్నా, వాడే కొలదీ అలవాటు అయిపోతుంది…
నా ఓటు మాత్రం స్వచ్ఛమైన 100% ఉన్న stevia పొడికే.
Stevia వాడి తే పరవాలేదు తరువాత డయాబెటిక్ షుగర్
అమ్ముతున్నారు అది natural అని చెప్పి kg300/- అలా కాస్ట్.ఇది మంచిదో