పై ఫొటోలో కనిపించే జంట చూడ ముచ్చటగా ఉంది కదా. కేవలం పొట్టిగా ఉన్నారు తప్పితే మరే లోపం ఆ ఇద్దరికీ లేదు. మొత్తం ప్రపంచంలోనే అతి పొట్టి వాళ్ళు ఈ ఇద్దరూ. బ్రెజిల్ కి చెందిన పాలో గాబ్రియేల్ వయసు 36 ఏళ్ళు. ఎత్తు 90.28 సెంటీమీటర్లు . కత్యుషియా లీషినో వయసు 33 ఏళ్ళు. ఎత్తు 91. 13 సెంటీమీటర్లు. 2006 లో వీరిద్దరూ ఒకరికొకరు సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యారు.ఇద్దరి ఎత్తులు దగ్గరగా ఉండటం .. అభిరుచులు కలవడంతో ముందు మంచి స్నేహితులయ్యారు. కొంతకాలం ఆన్లైన్ చాటింగ్ లో మాట్లాడుకునే వారు. అలా అలా ప్రేమలో పడిపోయారు.
2008 లో మొదటిసారిగా కల్సి ఒకరినొకరు చూసుకున్నారు. ఆ పై పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికొచ్చారు. కానీ అంత సులభంగా ఒకటి కాలేకపోయారు. తర్వాత పెద్ద వాళ్ళ అనుమతి తో 2016లో ముందడుగు వేశారు. లండన్ లోని గిన్నిస్ బుక్ రికార్డు హెడ్ ఆఫీస్ సమీపంలోని చర్చిలో పెళ్లిచేసుకున్నారు. తమ కలను సాకారం చేసుకున్నారు. కత్యుషియా లీషినో ఒక బ్యూటీ పార్లర్ నడుపుతున్నది. ప్రస్తుతానికి పిల్లలు వద్దనుకున్నారు. కిచెన్, ఫర్నిచర్ తదితరాలను వారికి అనుకూలంగా మార్చుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొట్టి జంటగా వీరు కొత్త రికార్డ్ నెలకొల్పారు. గిన్నిస్ బుక్ వారు ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఒక సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. ప్రస్తుతం ఆ ఇద్దరు హ్యాపీగా కలసి జీవిస్తున్నారు. ఆ రికార్డు ను కూడా తర్వాత ఎవరూ అధిగమించలేదు.
Unsolved Cases……………………………. కొన్నేళ్ల క్రితం వరకు భారత మూడో ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రిది అనుమానాస్పద మృతిగా భావించాం. అయితే అది హత్య అని నిర్ధారణ అయింది. అలాగే అణుశాస్త్ర పితామహుడు … Read More
Bharadwaja Rangavajhala ……………………………………… తెలుగు సినిమా చరిత్రలో మాధవపెద్ది ఫ్యామిలీది ఓ స్పెషల్ పేజ్. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బ్రాహ్మణ కోడూరు గ్రామం నుంచి రాజకీయ, సాహిత్య, సంగీత చిత్రకళా రంగాల్లో … Read More
Hanging pillar……. లేపాక్షిలో వేలాడే స్థంభం ఉన్నట్టే తమిళనాడులోని ధర్మపురి దేవాలయంలో మరో వేలాడే స్థంభం ఉంది. ధర్మపురిలోని ఈశ్వరన్ కోయిల్ని మల్లికార్జునేశ్వర ఆలయం అంటారు. దీనినే కామాక్షి అమ్మన్ దేవాలయం అని … Read More