బాలుకి గాత్రమిచ్చిన గాయకులెవరో తెలుసా ?

Sharing is Caring...

Celebrities who have given voice to Balu  ……………………………………

సుప్రసిద్ధ గాయకుడు బాలు తాను నటించిన కొన్నిచిత్రాల్లో తన పాత్రకు తాను పాటలు పాడుకోలేదు.వేరే వాళ్ళ చేత పాడించమని ఆయా సినిమా దర్శకులని కోరాడు. ఆ రెండు చిత్రాలు ‘ముద్దిన మావ’ .. ‘రక్షకుడు’. ఈ రెండు చిత్రాల్లో బాలు నటించాడు  ఆ విశేషాలు ఏమిటంటే ….

రక్షకుడు…ఈ సినిమా 1997 లో ప్రవీణ్ గాంధీ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. నాగార్జున, సుస్మితా సేన్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు.బాలు కూడా ఒక కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్నికె. టి.కుంజుమోన్ నిర్మించారు.  

ఎ.ఆర్. రహమాన్ సంగీత దర్శకత్వం వహించాడు.ఇందులో “లక్కి లక్కి లక్కి లక్కి” అనే పాట బాలసుబ్రమణ్యం పై చిత్రీకరించారు. రికార్డింగ్ సమయంలో పాటను ఆయననే పాడమని రహమాన్ అడగగా బాలు అందుకు అంగీకరించలేదు.

హీరో నాగార్జున కు తాను గాత్రం ఇస్తున్నాను కాబట్టి తనకు వేరే వాళ్ళ చేత పాడించమని చెప్పారు. ఈ ప్రయోగం ఏదో బాగుందని రహమాన్ ఆ పాటను ‘సుఖఃవీందర్ సింగ్’ చేత పాడించారు. అలా ఒక ప్రముఖ గాయకుడికి మరో ప్రముఖ గాయకుడు చేత పాడించడం ద్వారా ఒక కొత్త వరవడికి రహమాన్ నాంది పలికారు.  

సుఖఃవీందర్ సింగ్ కూడా మంచి గాయకుడు.హిందీలోనే కాక అన్నిభారతీయ భాషల్లో పాటలు పాడాడు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన బహుభాషా చిత్రం ‘దిల్ సే’ లో ‘ఛయ్య ఛయ్యా’ పాటతో ఆయన వెలుగులోకి వచ్చాడు. లక్కీ లక్కీ పాట పాడాక  నిజంగా నేను లక్కీ యే … ఎస్పీ అంతటి ప్రముఖ గాయకుడికి స్వరం ఇవ్వడం ఆంటే మాటలు కాదు అన్నారట. 

అలాగే  “ముద్దిన మావ” కన్నడ చిత్రం లో కూడా బాలు నటించారు. ఇది తెలుగులో “మామగారు” పేరిట వచ్చింది. ఆ సినిమాలో ‘దాసరి నారాయణ రావు ‘ నటించిన పాత్రనే కన్నడం లో ‘బాలు’ చేసారు . ఈ సినిమాలకు మూలం తమిళంలో” నాన్ పుడిచ మా పిళ్ళై ” అనే సినిమా.  కన్నడంలో “ముద్దిన మావ ” పేరిట 1993 లో విడుదలైంది.

హీరో శశికుమార్, శృతి , బాలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో “దీపావళి దీపావళి”  అనే పాట ఉంది. ఆ పాటలో బాలుకి సుప్రసిద్ధ నటుడు రాజకుమార్ గాత్ర దానం చేశారు. ఒక ప్రముఖ గాయకుడికి మరో ప్రముఖ నటుడు పాట పాడటం అదే ప్రధమం.

ఈ సినిమాకు సంగీతాన్ని అందించింది కూడా బాలు యే. కన్నడంలో ఆ సినిమా హిట్ అయింది. పాటలు కూడా ప్రజాదరణ పొందాయి. ‘ఓం సాయి ప్రకాష్’ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అలా అరుదైన సందర్భాల్లో ఇద్దరు ప్రముఖులు బాలుకి గాత్రం అందించారు. 

——– KNM
  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!