Putin’s mansion ………………..
“రష్యా అధ్యక్షుడి రహస్య భవనం” ఇదే అంటూ కొన్నేళ్ల క్రితం ఒక వీడియో నెట్లో హల్ చల్ చేసింది. వీడియో అప్ లోడ్ చేసిన నాలుగైదు రోజుల్లోనే పెద్ద సంఖ్యలో నెటిజెన్లు దాన్ని చూసారు. పుతిన్ కట్టించిన అత్యంత విలాసవంతమైన భవనం అని ఆయన విమర్శకుడు ‘అలెక్సీ నవాల్ని’ దాన్ని అంతర్జాలంలో పెట్టాడు.
వాస్తవానికి నల్లసముద్రం ఒడ్డున పుతిన్‌కు ఒక రహస్యభవనం ఉందనే కథనాలు 2010 నుంచే ప్రచారంలో ఉన్నాయి. 2012లో బీబీసీ సైతం ఈ భవనం గురించి ఒక కథనాన్ని ప్రచురించింది. అపుడే దీని గురించి జనాలకు తెలిసింది.. అయితే ఫోటోలు, వీడియోలు చూసిన వారు తప్ప దగ్గరగా దీన్నిచూసినవారు ఇంతవరకూ లేరు. ఆ మధ్య కాలంలో రష్యన్ పర్యావరణ కార్యకర్తలు కొందరు ఈ భవనం వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.
ఇది రష్యాలోనే అతి పెద్ద, అత్యంత విలాసవంతమైన భవనమని చెబుతున్నారు. నల్ల సముద్రం దగ్గర్లోని ప్రస్కోవేవ్కా గ్రామానికి సమీపంలో కేప్ ఇడోకోపాస్‌లోఈ భవనం ఉంది ఈ భవన నిర్మాణానికి పదివేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.ఈ భవనంలో అతి పెద్ద ఈత కొలను, చర్చి, పెద్ద పెద్ద రూములు .. డైనింగ్ హాల్స్ .. కోట్లాది రూపాయల విలువైన ఫర్నిచర్ ఉన్నాయట.
వీడియోలోఅవే మనకు కనిపిస్తాయి . రష్యా ప్రభుత్వ సంస్థలైన రాస్‌నెఫ్ట్, ట్రాన్స్‌నె్‌ఫ్ట కలిసి ఈ భవనానికి అవసరమైన డబ్బు సమకూర్చినట్టు విమర్శకుడు నవాల్ని ప్రధాన ఆరోపణ. పుతిన్ అవినీతి కి ఈ భవనం ఒక నిదర్శనమని నవాల్ని ఆరోపణ.అదొక ఫాల్స్ వీడియో అని ప్రభుత్వం కొట్టి పారేసింది.
కాగా నవాల్నిపై 2020 లో జర్మనీలో విషప్రయోగం జరిగింది. పుతిన్ ప్రభుత్వమే తన పై విషప్రయోగం చేయించిందని నవాల్నిఅప్పట్లో ఆరోపించాడు. ఈ ఆరోపణలను రష్యా సర్కారు కొట్టి పడేసింది. ప్యాలెస్ ఎవరిది అనే విషయాన్ని వెల్లడించలేమని అప్పట్లో రష్యా ప్రభుత్వం ప్రకటించింది.
తర్వాత కాలంలో జర్మనీ నుంచి రష్యాకు చేరుకున్న నవాల్నిని ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేసి జైలుకు తరలించారు. అంతకుముందే ఆయన ఈ వీడియో ను ఎవరి ద్వారానో మీడియాకు చేర్చినట్టు సమాచారం.జైలులో కొంత కాలమున్న అలెక్సీ నవాల్ని ఫిబ్రవరి 16, 2024న రష్యాలోని ఫార్ నార్త్‌లోని యమలో-నేనెట్స్ అటానమస్ ఓక్రగ్‌లోని జైలులో మరణించాడు.
ఆసక్తి గలవారు వీడియో చూడవచ్చు