కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ !!

Sharing is Caring...

An entertaining film………

‘రేసు గుర్రం’ 2014  నాటి సినిమా ..టాలీవుడ్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్ మూవీ. దర్శకుడు సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్, కిక్ ఇచ్చే కథనంతో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా అలరించింది.అల్లు అర్జున్, శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు.  
కథాంశం
రామ్ (శ్యామ్) ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. అతని తమ్ముడు లక్ష్మణ్ అలియాస్ లక్కీ (అల్లు అర్జున్) ఎటువంటి బాధ్యత లేకుండా జల్సాగా తిరిగే కుర్రాడు. చిన్నప్పటి నుండి ఈ ఇద్దరు అన్నదమ్ములకు అస్సలు పడదు, ఎప్పుడూ  గొడవపడుతుంటారు. ఇదిలా ఉంటే, శివారెడ్డి (రవి కిషన్) అనే ఒక క్రూరమైన ఫ్యాక్షనిస్ట్ రాజకీయ నాయకుడిగా మారి వ్యవస్థను శాసించాలని చూస్తుంటాడు.

శివారెడ్డి అక్రమాలను అడ్డుకోవాలని రామ్ ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో రామ్‌ను చంపడానికి శివారెడ్డి ప్లాన్ చేస్తాడు. తన అన్న ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలుసుకున్న లక్కీ.. శివారెడ్డిపై ఎలా తిరగబడ్డాడు? అసలు అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు ఎలా తొలగిపోయాయి? లక్కీ తన తెలివితేటలతో శివారెడ్డి రాజకీయ సామ్రాజ్యాన్ని ఎలా కూల్చేశాడు? అనేదే మిగిలిన కథ.

లక్కీ పాత్రలో అల్లు అర్జున్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్.. ఇలా ప్రతి దాంట్లోనూ జీవించేశాడు. ముఖ్యంగా అతని డాన్స్ మూవ్స్ (సినిమా చూపిస్తా మావ పాటలో )అప్పట్లో థియేటర్లను ఊపేశాయి.

సినిమాకు అతిపెద్ద అస్సెట్ సెకండ్ హాఫ్‌లో వచ్చే బ్రహ్మానందం కామెడీ ట్రాక్. స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ‘కిల్ బిల్ పాండే’గా ఆయన పండించిన హాస్యం  ప్రేక్షకులను అలరిస్తుంది.క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుంది.

ఎమోషన్స్ లేని అమ్మాయిగా స్పందన పాత్రలో శృతి హాసన్ నటన, డ్యాన్స్ ఆకట్టుకుంటాయి. పద్ధతి గల అన్నయ్యగా శ్యామ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. అలాగే విలన్ రవి కిషన్ నటన కూడా  పవర్‌ఫుల్‌గా ఉంటుంది.. ఆలీ, ఎం.ఎస్. నారాయణ కామెడీ ట్రాక్స్ కూడా బాగా నవ్విస్తాయి. పోసాని తన పాత్రలో జీవించాడు. ప్రకాష్ రాజ్ కూడా ఒక డిఫరెంట్ పాత్రలో నటించారు. పాత్రధారుల నుంచి దర్శకుడు నటనను రాబట్టారు.   

ఇది ఒక సాధారణ అన్నదమ్ముల సెంటిమెంట్, విలన్-హీరో మైండ్ గేమ్ కథే. కేవలం ట్రీట్‌మెంట్ వల్లే సినిమా నిలబడింది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఒక రొటీన్ కథను ఎంచుకున్నప్పటికీ, దానికి ఎంటర్‌టైన్‌మెంట్,స్టైల్ జోడించి ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించారు. 

ఈ సినిమాకు ప్రముఖ సౌత్ ఇండియన్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస కెమెరామెన్‌గా పనిచేశారు. అతని పనితనం సినిమాను చాలా రిచ్‌గా, స్టైలిష్‌గా మార్చింది.సురేందర్ రెడ్డి సినిమాల్లో ఉండే స్టైలిష్ లుక్‌ను మనోజ్ స్క్రీన్ మీద అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రతి ఫ్రేమ్ చాలా కలర్‌ఫుల్‌గా, గ్రాండ్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్‌ను ఎంతో హ్యాండ్‌సమ్‌గా, స్టైలిష్‌గా చూపించారు.

క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్‌లో కెమెరా మూవ్‌మెంట్స్ యాంగిల్స్ చాలా అగ్రెసివ్‌గా ఉండి, ఫైట్స్ లోని ఇంటెన్సిటీని ప్రేక్షకుడికి కనెక్ట్ చేస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ లో ‘రేసు గుర్రం’ ఒకటి. ఈ సినిమాకు ఆయన అందించిన సాంగ్స్  బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఆకట్టుకుంటాయి. ఈ సినిమా సోనీలివ్,యూట్యూబ్ లో ఉంది ..ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!