Huge recognition with just one small role ……………………….
కూలీ సినిమా లో నాగార్జున కుమారుడి ప్రియురాలిగా , సౌబిన్ షాహిర్ భార్య కళ్యాణి గా నెగటివ్ పాత్రలో నటించిన రచితా రామ్ కి మంచి గుర్తింపు వచ్చింది. కళ్యాణి పాత్ర మొదట్లో అమాయకంగా ఉంటుంది .. తర్వాత తనలో దాగిన మోసగత్తె బయటకు వస్తుంది. ఈ క్యారెక్టర్ ద్వారా కథలో వచ్చే ఊహించని ట్విస్ట్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.
రచితా రామ్ ఈ కళ్యాణి పాత్ర ద్వారా తమిళ, తెలుగు,హిందీ సినీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. కూలీ సినిమాలో ఆమె పాత్రని చూసి ఎవరీ మహానటి, అపరిచితురాలు అంటూ సోషల్ మీడియా లో పోస్టులు కూడా పెట్టారు. నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ తో అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన రచితా రామ్ అసలు ఎవరు..?
కన్నడ సినిమా రంగంలో రచితా రామ్ ను ‘డింపుల్ క్వీన్’ అని పిలుస్తారు . రచిత 2012లో ‘అరసి’ అనే టెలివిజన్ సిరీస్‌తో తన నట జీవితాన్ని ప్రారంభించింది..2013లో కన్నడ సూపర్‌స్టార్ దర్శన్ సరసన ‘బుల్ బుల్’తో సినీరంగ ప్రవేశం చేసింది. అందరిలాగే తానూ 200 మందితో పోటీపడి ‘బుల్బుల్’ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది.
20కి పైగా చిత్రాలలో నటించిన ఆమె, కిచ్చా సుదీప్, గణేష్, ఉపేంద్ర,దివంగత పునీత్ రాజ్‌కుమార్ వంటి నటులతో కలిసి నటించింది. రచిత శిక్షణ పొందిన భరతనాట్య నృత్యకారిణి, 50కి పైగా ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఇది ఆమె విభిన్న కళా నైపుణ్యాలను హైలైట్ చేస్తుంది.
రచితా రామ్ 2022 లోనే ‘సూపర్ మచ్చి’ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు. కళ్యాణ్ దేవ్ ఆ సినిమాలో హీరో. అయితే ఆ సినిమా ద్వారా రచితా రామ్ కి అంత గుర్తింపు రాలేదు. తాజా చిత్రం ‘కూలీ’ ద్వారా తన సత్తా చాటుకున్నారు. మరిన్ని అవకాశాలు అందుకోనున్నారు.
రచిత సోదరి నిత్యా రామ్ కూడా నటి. తెలుగు సీరియళ్లు ‘ముద్దుబిడ్డ’, ‘అమ్మ నా కోడలా’లో నటించారు. రెండు కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. రచితా రామ్ ఇంస్టాగ్రామ్ లో చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఆమెకు 2.6 మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు.
ప్రస్తుతం ‘శబరి సెర్చింగ్ ఫర్ రావణ’, ‘అయోగ్య 2’, ‘లవ్మీ ఆర్ హేట్ మీ’ సహా ఐదు ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉన్నారు.

