Mani Bhushan ……………………..
ప్రాంతీయ పార్టీలు అన్నాక చీలికలు,పేలికలు కావడం సహజ పరిణామం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, గుజరాత్ నుంచి అరుణాచల్ వరకు ఏ రాష్ట్రంలో నైనా ఇదే తంతు.1914 నాటి జస్టిస్ పార్టీ, ‘20 నాటి శిరోమణి అకాలీ దళ్’ మొదలుకుని, ఇటీవలి వరకు చరిత్రలో ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకి అఖండత అనేది లేదు.
TDP రెండున్నరేళ్లకే చీలింది. YSRCP ఎనిమిదేళ్లకు బీటలు పడింది. ఇప్పుడు TRS వంతు వచ్చింది. అంతే, తతిమాదంతా సేమ్ టు సేమ్.హెడ్ క్వార్టర్సులోనే తప్ప క్షేత్ర స్థాయిలో సంస్థాగత నిర్మాణం లేని పార్టీలు మరింత వేగంగా చీలిపోతాయి.
అధికారం ఉన్నంత కాలం ఉక్కు ముక్కలా కనిపిస్తాయి… అధికారం పోగానే సీనా రేకు డబ్బా (tin box)లా ఎక్కడికక్కడ ముక్కలవుతాయి. కారణం చాలా సింపుల్… వాటి నిర్మాణంలోనే లోహ పరమైన riveting ఉండదు. కార్డ్ బోర్డ్, ప్లాస్టిక్, రబ్బరు, ఇనుము లాంటి భిన్నమైన ఎలిమెంట్లను fevi quickతో అతకబెట్టినట్లుగా show run చేయడం జరుగుతుంది.
ఒక సదాశయం, సంకల్పంతో… భావ సామీప్యంగల బుద్ధిజీవుల భాగస్వామ్యంతో ఒక Partnership Ventureలా ప్రాంతీయ పార్టీలు రూపు దాలుస్తాయి. Leader బలపడుతున్నకొద్దీ, అనుకున్న లక్ష్యం నెరవేరుతున్న కొద్దీ Proprietary Concernగా మారతాయి. Parallelగా కుటుంబీకులు ప్రవేశిస్తారు. వారిచుట్టూ గుంపులు చేరేసరికి…చివరకు Family Enterpriseగా మిగులుతాయి.
NTR సంతానంలో ఎవరికీ ardent political ambitions లేవు కాబట్టి, బావ చంద్రబాబు చేతికే పార్టీని అప్పగించేశారు. హరికృష్ణ కొంత తాటాకు చప్పుడు చేసి చప్పబడ్డారు.’అన్న తెలుగు దేశం’పార్టీపెట్టి ఘోరంగా ఓడిపోయాడు.ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి కూడా హడావుడి చేసి నీరస పడిపోయారు. అంతకుముందు నాదెండ్ల భాస్కర రావు పరిస్థితి కూడా భిన్నమేమీ కాదు.
ఇతర రాష్ట్రాలైన తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కళగం (DMK), మహారాష్ట్రలో శివ సేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), హర్యానాలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD), బీహారులో లోక్ జనశక్తి పార్టీ (LJP), సమత పార్టీ, ఉత్తర ప్రదేశులో సమాజవాది పార్టీ, జమ్మూ కాశ్మీరులో జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) వంటివి Family enterprises గానే కొనసాగుతున్నాయి.
తమిళనాడులో డీఎంకే.. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు దేశం పార్టీ లు మాత్రమే ఎన్ని చీలికలు వచ్చినా నిలదొక్కుకున్నాయి. ప్రస్తుతానికి అఖండంగా కనిపిస్తున్న లాలు ప్రసాద్ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (RJD), మమత బెనర్జీ పార్టీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITC), బిజు పట్నాయక్ పార్టీ బిజు జనతా దళ్ (BJD)లు రేపటి రోజున ఏమవుతాయో చెప్పలేం.