ఆయన బెస్ట్ సినిమాల్లో ఇదొకటి !!

Sharing is Caring...

Subramanyam Dogiparthi………….            Best Remake film from tamil 

నటుడు చంద్రమోహన్ నట విశ్వరూపానికి ప్రతీక 1978 లో వచ్చిన ఈ ‘పదహారేళ్ళ వయసు’ సినిమా. శ్రీదేవిని స్టార్ హీరోయిన్ ని చేసి.. రాఘవేంద్రరావు ప్రభంజనాన్ని కొనసాగించిన సినిమా. సినిమా విడుదలయిన ఆల్మోస్ట్ అన్ని కేంద్రాలలో వంద రోజులు ఆడి సూపర్ డూపర్ హిట్టయిన సినిమా.

తమిళంలో హిట్ సినిమా ’16 వయత్తినిలే ‘ రీమేక్ మన ‘పదహారేళ్ళ వయసు’ సినిమా.  తమిళంలో శ్రీదేవి , కమల్ హాసన్, రజనీకాంత్ నటించారు. తమిళ సినిమా కూడా యూట్యూబులో ఉంది. వీలుంటే చూడండి. ఈ సినిమాలో చంద్రమోహన్ తన సత్తా చాటుకున్నాడు. ‘ఎలా ఉంది దెబ్బ’ అంటూ మోహన్ బాబు తన ప్రత్యేక మేనరిజాన్ని కొనసాగించారు.

ఈ సినిమా ఏమీ సందేశాత్మక సినిమా కాదు. ఓ పదహారేళ్ళ పల్లెటూరి అమ్మాయి సినిమా. ఆ వయసులో సహజంగా ఉండే ఆలోచనలు,ఆకాంక్షలు, వయసు తెచ్చే కష్టాలు వగైరాయే ఈ సినిమా. కధలో కొత్తదనం, తెరకెక్కించిన విధానం, చిత్రీకరణ, పాటలు ఈ సినిమాను సూపర్ హిట్ చేసాయి. శ్రీదేవిని ఒక్కసారిగా NTR పక్కన వేటగాడు సినిమాలో హీరోయిన్ని చేసింది.

 చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ సూపర్ హిట్. పాటలను అన్నీ వేటూరి వారే వ్రాసారు పాటల్ని బాలసుబ్రమణ్యం, యస్ జానకిలే పాడారు. సుశీలమ్మ ఒక్క పాట కూడా పాడకపోవటం విశేషం. ‘సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా’ ఈ సినిమాకు ఐకానిక్ సాంగ్. తమిళ ట్యూన్నేఉంచారు. అది ఇళయరాజా చేసిన ట్యూన్.  

‘కట్టుకధలు నేను చెప్పి నవ్విస్తే’ పాటలో చంద్రమోహన్ నటన సూపర్బ్ .’పంటచేలో పాలకంకి నవ్వింది’ ,’పువ్వు లాంటి మల్లి పుష్పించేనమ్మా’ పాటలు శ్రావ్యంగా ఉంటాయి. ‘వయసంతా ముడుపుగట్టి వస్తాలే ఆడుకుందాం’ గ్రూప్ సాంగ్ లో హలం అందాన్ని అంతా మూటగట్టి చూపించారు రాఘవేంద్రరావు .

శ్రీదేవి మొదటిసారిగా హీరోయిన్ గా నటించిన ‘అనురాగాలు’ సినిమాలో హీరో రవికాంత్ ఈ సినిమాలో వెటర్నరీ డాక్టరుగా నటించారు. ఇతర పాత్రల్లో నిర్మలమ్మ , హలం ప్రభృతులు నటించారు. ఈ సినిమాలో పాత్రలు కూడా ఎక్కువగా ఉండవు. తెలుగు సినిమాకు స్వల్ప మార్పులు చేసారు.  

ఈ సినిమా చూస్తున్నప్పుడు అక్కడక్కడా ‘సిరిసిరి మువ్వ’ సినిమా గుర్తుకొస్తుంది. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు చంద్రమోహన్ మొదటి సినిమా ‘రంగులరాట్నం’ వచ్చింది . ఆ సినిమా చీరాలలో చూసొచ్చిన మా డ్రిల్ మాస్టారు ఓ మాటన్నారు. ఇంకో మూడు అంగుళాలు ఎత్తు ఉంటే తెలుగు సినిమా రంగాన్ని ఏలుతాడు అని .లేకపోయినా ఏలాడు చంద్రమోహన్ . లాంగెస్ట్ కెరీర్ అనుభవించాడు.

తమిళంలో కమల్ హాసన్ కి ఉత్తమ నటుడు,భారతీరాజా కి ఉత్తమ దర్శకుడు, జానకి కి ఉత్తమ గాయని గా రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు వచ్చాయి. తెలుగు లో చంద్రమోహన్ కి ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. ఒక సందర్భంగా కమలహాసన్ మాట్లాడుతూ ‘నాకంటే నువ్వే బాగా చేశావు అని చంద్రమోహన్తో అన్నారట. 

తర్వాత కాలంలో తమిళ సినిమాను డైరెక్ట్ చేసిన భారతీరాజాయే హిందీలో సోల్వా సావన్ టైటిలుతో తీసారు . హిందీలో కూడా శ్రీదేవియే నటించింది.బహుశా హిందీలో ఆమెకు ఇదే మొదటి సినిమానేమో ! అమోల్ పాలేకర్ హీరో. హిందీలో బాగా ఆడలేదు .

పదహారేళ్ళ వయసు సినిమా చూడనివారు,చూసిన వారు యూట్యూబులో ఉంది. చూసేయండి . An entertaining , feel good , musical super hit movie . An unmissable one. పాటల వీడియోలు కూడా ఉన్నాయి . చూసేయండి .

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!