Thopudu Bandi Sadiq Ali ………………………………………………
ముందుగా శిల్పం సైజు యెంత ఉండాలో నిర్ణయించుకొని ఆ సైజులో పిండితో పలకల అచ్చు పోశారు. అది తడిగా ఉండగానే దానిమీద ఉలితో అవసరం లేకుండానే ,చేతులతో,ఇతర పరికరాలతో శిల్పాన్ని రూపొందించారు.(ఇప్పుడు వివిధ సముద్ర తీరాల్లో మనం చూస్తున్న సైకత శిల్పాల తరహాలో అన్న మాట.)
అందుకే ఈ శిల్పాల ఫినిషింగ్ కాస్త మొరటుగా కన్పిస్తుంది.దేవాలయాల మీద నల్లరాతి శిలలతో రూపొందిన శిల్పాల సౌకుమార్యం ఇందులో కన్పించదు.ఆ అచ్చులు కొద్దిగా పచ్చిగా ఉండగానే రెండేసి అడుగుల చొప్పున మైసూర్ పాక్ లా కోసేశారు.
అందుకే యెంత పెద్ద శిల్పమైనా ఒకేచోట ఒక్కోటి రెండడుగుల సైజులో మూడు,నాలుగు ముక్కలుగా తయారయ్యింది.వాటిని అదే క్రమంలో అమరుస్తూ ఆలయం నిర్మించారు.అవి విడిపోకుండా ,అలాగే కలిసి ఒకే విగ్రహంలా ఉండటానికి రెండు పలకల మధ్యలో కనపడీ కనపడకుండా మళ్ళీ అదే పిండి మిక్చర్ తో అతికించారు.
అయితే ,కాలక్రమంలో ప్రకృతి కారణంగా మధ్యలో వేసిన జాయింట్లు చాలా వరకు కరిగిపోయి విగ్రహాలు ముక్కలుగా ఉండిపోయాయి. ఈలోగా గుప్త నిధుల అన్వేషకులు గుడిచుట్టూ,గర్భగుడి మధ్యలో అరాచకంగా తవ్వకాలు జరపటం వల్ల విగ్రహాలు అటూ ఇటూ జరిగి,ఒరిగిపోయాయి. అదీ ఇప్పుడు ఉన్న పరిస్థితి.
స్థానికులు చెప్పిన దాని ప్రకారం 20 ఏళ్ళ క్రితం ఆ గుడిలో పెద్ద శివలింగం,పానవట్టం ఉండేవి.కానీ వాటిని సమీపంలోని గ్రామస్తులు ఎవరో తరలించుకొని పోయారు.ఎనిమిదేళ్ల క్రితం కొత్తూరు ప్రజలు ఖాళీగా ఉన్న గర్భగుడిలో లక్ష్మీనరసింహ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు,ఏడాదికి ఒకసారి జాతర నిర్వహిస్తున్నారు.గర్భ గుడి ఎదురుగా ఎనిమిది అడుగుల ఎత్తు,ఒక అడుగు వెడల్పు ఉన్న పాలరాతి ఆయక స్థంభం కూడా ఉండేది.
దానిమీద కూడా కొన్ని విగ్రహాలు చెక్కి ఉన్నాయి.ఆ స్తంభాన్ని కూడా ముష్కరులు విరగ్గొట్టి పక్కన పడేశారు.అవి అక్కడే ఒక పక్కన పడి ఉన్నాయి. అయితే ,ఈశిల్పాల గురించి హరగోపాల్ సర్ కొంత విశ్లేషణ ఇచ్చారు. ఇలా శిల్పాల అమరిక భారతదేశంలో మరెక్కడా లేదనీ,కంబోడియాలో ఇలా శిల్పాలను ముక్కలుగా అమర్చిన కొన్ని ఆలయాలు ఉన్నాయని చెప్పారు.
అలాగే శిల్పాలలో బౌద్ధ,శైవ ఆనవాళ్ళు ఉన్నాయని,కొన్ని శిల్పాలు ఉత్తరాది లక్షణాలతోనూ ఉన్నాయన్నారు.వీటి మీద సమగ్ర అధ్యయనం అవసరమనీ ఆయన అభిప్రాయ పడ్డారు.శాతవాహనులకన్నా ముందా?మహాయాన బౌద్ధ కాలమా?అనేది ఇప్పుడిప్పుడే నిర్ధారించ లేము అని చెప్పారు.
ఇక ఈ ‘ దేవుని గుట్ట మీద ఉన్న ఈ దేవాలయం గురించి ఒక అనూహ్యమైన వ్యక్తీ నుంచి వచ్చిన స్పందన,వివరణ చూసి నాకు మతి పోయింది.ఆ వ్యక్తి ఆషామాషీ వ్యక్తి కాదు.జర్మనీకి చెందిన సుప్రసిద్ధ పరిశోధకురాలు Corinna wessels.ఈవిడ 1970 వ దశకం చివరి నుంచి 80 వ దశకం ప్రారంభ కాలంలో జర్మనీ లో ‘ఇండియన్ ఆర్కియాలజీ అండ్ ఆర్ట్ హిస్టరీ లో శిక్షణ పొందారు.1982-83 మధ్య కాలంలో ఆరు నెలలకు పైగా భారతదేశం మొత్తం పర్యటించారు. ఆ తర్వాత కూడా పలుమార్లు భారత్ సందర్శించారు.
దేశంలోని పలు దేవాలయాలు సందర్శించి పరిశోధనలు చేశారు.ఇండియన్ / సౌత్ ఆసియన్ ఆర్ట్ హిస్టరీ మీద చేసిన పరిశోధనలకు గాను 1999 లో డాక్టరేట్ పొందారు. అలాంటి అకడమిక్ నేపధ్యం ఉన్న ఆవిడ దేవునిగుట్ట లోని గుడి ఫోటోలు చూసి చాలా ఎమోషనల్ గా ఫీలయ్యి స్పందించారు. ఆవిడ యేమని రాశారో ఆవిడ మాటల్లోనే ఇక్కడ ఇస్తున్నాను.
This site in Telangana is extremely interesting. Just from the photographs that you shared I would say that it could well turn out to be a discovery like no other, perhaps, in the past roughly 40 years or so, in Indian temple architecture. The supposedly early style that may date around Late Gupta/post-Gupta periods appears unknown to me (though it may be linked to some extent with the early Odishan style of temple art, or that of Rajim and Sirpur in Chhattisgarh). The presence of Amaravati-style spoils is, of course, highly interesting, too.
https://tharjani.in/with-what-chisel-this-history-created/I feel like visiting this site as soon as possible. Although I may not be able to plan a visit that soon, I mean, before winter, – let us assume that I could make it within the next few weeks. Could you possibly guide me there? I have not visited this part of India before.
దీన్ని బట్టి ఆ గుడి ప్రాధాన్యత ఏమిటో మనం అర్ధం చేసుకోవచ్చు.ఈ సమాచారంతో మన చరిత్రకారులు ఈ దిశగా పరిశోధించే అవకాశం ఉందని భావిస్తున్నాను.
Read Also >>>>>> ఈ చరిత్ర ఏ ఉలితో ? 1