మహారాజశ్రీ మాయగాడు (1)

Sharing is Caring...

Expert hand in cheating …………………….

స్టాక్ మార్కెట్ వర్గాలను, బ్యాంకులను పెద్ద ఎత్తున బురిడీ కొట్టించిన  మాయగాళ్లలో  హర్షద్ మెహతా అగ్రజుడు. షేర్ మార్కెట్ తో కొంచెం పరిచయం ఉన్నవారికి కూడా ఇతగాడి పేరు తెలుసు. 90 దశకంలో ఆ పేరు అంత పాపులర్.

92 లో జరిగిన స్టాక్ కుంభకోణానికి ఇతనే మూలం. ఇండియాలో జరిగిన పెద్ద స్కాముల్లో ఇదొకటి.బ్యాంకులు … స్టాక్ మార్కెట్ లావాదేవీల్లో ఉన్న లొసుగులను ఆధారం గా చేసుకుని 5 వేల కోట్ల రూపాయల ఆర్ధిక కుంభకోణానికి హర్షద్ పాల్పడ్డాడు. 

స్టాక్ మార్కెట్ బ్రోకర్ గా పనిచేసిన హర్షద్ మెహతా మార్కెట్ కార్యాకలాపాలను బాగా అధ్యయనం చేసాడు. బ్యాంకుల్లో లొసుగులు ఏమిటో తెలుసుకున్నాడు. ఆ తర్వాత మెల్లగా కుంభకోణానికి తెరలేపాడు.  బ్యాంకుల నుంచి స్వల్ప కాలిక రుణాలు తీసుకునే వాడు. ఆ సొమ్మును మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాడు.పలు కంపెనీల షేర్లను కొనుగోలు చేసి … మరల అమ్ముతుండేవాడు.

ఈ షేర్ల అమ్మకాలు ..కొనుగోళ్లలో జిమ్మిక్కులు చేసే వాడు. ముందుగా ఏదైనా ఒక కంపెనీ షేర్లను తక్కువ ధరలో పెద్ద ఎత్తున కొనుగోలు చేసిపెట్టుకునే వాడు.  ఫలానా షేర్ పెరగబోతోందని ముందుగానే మార్కెట్లో ఫీలర్లు వదిలేవాడు. దాంతో ఒక స్థాయికి షేర్ ధర చేరుకోగానే తన వద్ద నున్న షేర్లు అమ్మేసి లాభాలు ఆర్జించేవాడు.

ఈ ప్రక్రియ లో కొంతమంది బ్రోకర్ల సహాయం కూడా తీసుకునే వాడు. ఇదంతా తెర వెనుక చాలా పకడ్బందీగా నిర్వహించేవాడు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున షేర్ల కొనుగోలు కోసం  పలు బ్యాంకుల్లో రుణాలు తీసుకునే వాడు. ఆ బ్యాంక్ ల్లో రుణాలు తీర్చడం కోసం వేరే బ్యాంకుల్లో రుణాలు చేసేవాడు.

బ్యాంకర్లు కూడా ఒక దశలో హర్షద్ మెహతా అంటే ఆటోమేటిక్గా రుణాలు మంజూరు చేసేవారు. ఎక్కడా దేనికి వెనుకాడకుండా  బ్యాంకు ఉన్నతాధికారులను మేనేజ్ చేసేవాడు. అలా ఆలా మనీ రొటేషన్ కి బాగా అలవాటు పడ్డాడు. అతగాడు ఆపరేట్ చేసిన షేర్లలో ఏసీ సి కంపెనీ ఒకటి.  

అప్పట్లో ఆ షేర్ ధర రూ. 200 వద్ద ఉండగా దాన్ని రూ. 9000 కి తీసుకెళ్లాడు. మార్కెట్ ఊహించని పెరుగుదల అది. ఇదంతా ముందే చెప్పుకున్నట్టు బ్రోకర్ నెట్వర్క్ ద్వారా చేసాడు. షేర్ ధర పెరిగినపుడు అమ్ముకున్నవారు లాభాలు ఆర్జించారు. ఇంకా కొంతకాలం చూసి అమ్ముదాములే అనుకున్నవాళ్ళు షేర్ ధర పడిపోయి నష్ట పోయారు.

ఇదంతా మూడునెలల వ్యవధిలో జరిగింది. అలా ఎన్నో షేర్లు కొన్నారు … అమ్మారు. వాటి ధరలు అసహజ ధోరణి లో పెరిగాయి…  తర్వాత పతనమయ్యాయి. చాలా షేర్లలో కంపెనీ సమాచారం ముందే పసిగట్టి ఇన్ సైడర్ ట్రేడింగ్ కి కూడా పాల్పడ్డాడు.  కేవలం 38 ఏళ్ళ వయసులో అసాధారణంగా అలోచించి, తప్పుడు విధానాలద్వారా అనల్పకాలంలో మిలియనీర్ గా ఎదిగాడు.

హర్షద్ మెహతా ఎక్కడి వాడో ? ఎలా ఈ రంగంలోకి వచ్చాడో ?   పార్ట్ 2 లో తెల్సుకుందాం. 

——- KNMURTHY

PL.READ IT ALSO …………..బ్యాంకులకు టోపీ పెట్టిన బిగ్ బుల్ 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!