ఏపీ నుంచి అయోధ్యకు రెండు రైళ్లు !!

Sharing is Caring...

Special Trains to Ayodhya………………….

అయోధ్య రామ మందిరం ప్రారంభమైన నేపథ్యంలో భక్తులు బాల రాముడిని దర్శించుకునేందుకు తహతహలాడుతున్నారు. బాల రాముని దర్శించుకోవడానికి భారతదేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

దీంతో అయోధ్యలో సందడి నెలకొన్నది. ఈ క్రమంలోనే భారత రైల్వే సైతం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పలు ప్రధాన పట్టణాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడిపిస్తోన్నది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అయోధ్యకు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.

ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు రైళ్లు అందుబాటులో ఉండగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నారు.గుంటూరు నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు ప్రారంభించిన విషయం తెలిసిందే .. ఏపీ నుంచి అయోధ్యకు వెళుతున్న తొలి రైలు ఇదే కావటం విశేషం..

అంతకుముందు అయోధ్యకు నేరుగా వెళ్ళడానికి రైళ్లు అందుబాటులో లేవు. భువనేశ్వర్ వెళ్లి అక్కడ నుంచి మరో రైల్లో అయోధ్యకు వెళ్లాల్సి ఉండేది.. కానీ ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొచ్చిన రైళ్లతో నేరుగా అయోధ్యకు వెళ్లవచ్చు.

గుంటూరు నుంచి ప్రారంభమైన ఈ ప్రత్యేకమైన రైలు విజయవాడ, సామర్లకోట, తుని, అనకాపల్లి, విశాఖపట్నం మీదుగా అయోధ్యకు చేరుకుంటుంది ఇక రెండో రైలు ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.. ఈ రైలు సామర్ల కోట లో ప్రారంభమై పిఠాపురం, తుని, అనకాపల్లి మీదుగా అయోధ్యకు చేరుకొనుంది రెండు రైళ్లు వెళ్ళటానికి అందుబాటులోకి రావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!