వజ్రాలు అలా ఏర్పడతాయా ?..

Sharing is Caring...

Birth of Diamonds……………………………..

డైమండ్ అనేది కార్బన్ అణువులతో నిర్మితమై విలువైన ఒక రాయి . సాధారణ రాళ్ళ మాదిరిగా కాకుండా వజ్రాలలో కార్బన్ అణువులు క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ లాగా అమర్చబడి ఏర్పడుతాయి. వజ్రాలు భూమికి అత్యంత లోతులో భూమి పొరల్లో ఏర్పడతాయి.ఇవన్నీ సహజంగా ఏర్పడుతాయి. 

ఈ లోపలి ప్రదేశాన్ని ఎర్త్ మాంటిల్ అంటారు.అగ్ని పర్వతాలు బద్దలైన చోట ఈ వజ్రాలు లావాతో పాటు పైకి ఎగజిమ్ముతాయి. అగ్నిపర్వతంలోని లావా చల్లారిన తరువాత గాలి,వర్షం, వరదల కారణంగా అవి నదులలోకి కొట్టుకొని పోతాయి. ఇలా వెళ్ళినవి నదుల్లో ఉండే రాళ్ళ మధ్యలో పేరుకుపోతుంటాయి.

అగ్నిపర్వతాలు బద్దలైన చోట తవ్వకాలు జరిపినప్పుడు వజ్రాలు లభించే అవకాశం ఉంది. అక్కడ పడివున్న రాళ్ళలో వజ్రాలు కనిపిస్తాయి.ఎర్త్ మాంటిల్ లో ఉన్న కార్బన్ ఫ్లూయిడ్స్ అక్కడ ఉండే అధిక ఉష్ణోగ్రత, ఒత్తిడి కారణంగా వజ్రాలు ఏర్పడుతాయి. అయితే, వాస్తవానికి వజ్రాలకు రంగు ఉండదు.

కానీ వజ్రాలు ఏర్పడేటప్పుడు 10 లక్షల కార్బన్ అణువులతో 1 బోరాన్ తోడైతే ఆ వజ్రం నీలిరంగు వజ్రంగా తయారవుతుంది. అదేవిధంగా10 లక్షల కార్బన్ అణువులతో నైట్రోజన్ తోడైతే అప్పుడు పసుపురంగు వజ్రం ఏర్పడుతుంది. ఒకవేళ వజ్రాలతో కార్బన్ అణువుల ఆకృతి సరిగ్గా ఏర్పడకపోతే ఆ వజ్రం గోధుమ రంగులోకి మారుతుంది. ఒకవేళ డైమండ్ పై రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటె అది ఆకు పచ్చ వజ్రంగా మారుతుంది. అదండీ వజ్రాల కథ. .

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!